వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ అస్థిపంజరం ఎవరిది ? మూటకట్టి ఉందంటే హత్యే కదా .. ఎవరో తెలిస్తేనే మిస్టరీ వీడేది

|
Google Oneindia TeluguNews

భూపాలపల్లి జిల్లా రాఘవరెడ్డిపేటలో ఒక అస్థిపంజరం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. అసలే అస్థిపంజరం ఎవరిది.. మూట కట్టి ఎవరు దీన్ని ఇక్కడ పడేశారు. మూట కట్టి ఉందంటే ఇది కచ్చితంగా హత్యేనా .. అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సమాచారాన్ని పోలీసులకు అందించటంతో పోలీసులు ఆ మూటలో ఉన్న అస్తిపంజరానికి పంచనామా నిర్వహించి ఎంజీఎం మార్చురీకి తదనంతర పరీక్షల నిమిత్తం తరలించారు. ఇక ఈ అస్థిపంజరం మిస్టరీని ఛేదించటానికి రంగంలోకి దిగారుపోలీసులు .

ప్రజా ప్రభుత్వం పోయి ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చింది .. అరాచకం రాజ్యమేలుతుంది... జగన్ పై యనమల ఫైర్ప్రజా ప్రభుత్వం పోయి ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చింది .. అరాచకం రాజ్యమేలుతుంది... జగన్ పై యనమల ఫైర్

 భూపాలపల్లి మండలంలోని రాఘవరెడ్డిపేట శివారులో మూటలో అస్థిపంజరం

భూపాలపల్లి మండలంలోని రాఘవరెడ్డిపేట శివారులో మూటలో అస్థిపంజరం

పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం భూపాలపల్లి మండలంలోని రాఘవరెడ్డిపేట శివారులో రోడ్డు పక్కన ఒక సంచిలో మూటగట్టిన అస్తిపంజరం అక్కడి రైతులకు కనిపించింది . రోడ్డు పక్కన ఉన్న సంచి వర్షానికి తడవడంతో దానిని కుక్కలు చింపటంతో సంచిలోంచి పుర్రె, చెప్పులు, కాలిఎముకలు బయటకు వచ్చాయి. ఇక అక్కడ అస్థిపంజరం కనుగొన్న రైతులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భూపాలపల్లి డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై అనిల్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకోని విచారణ చేపట్టారు. ఆస్థిపంజరానికి పంచనామా నిర్వహించారు. అతనికి సంబంధించిన ఏమైనా ఆధారాలు దొరకుతాయో అని పరిశీలించారు.

ఎవరో హత్య చేసి మూట కట్టినట్టు ప్రాధమిక అంచనాకు వచ్చిన పోలీసులు .. దర్యాప్తు

ఎవరో హత్య చేసి మూట కట్టినట్టు ప్రాధమిక అంచనాకు వచ్చిన పోలీసులు .. దర్యాప్తు

మృతుడికి స్వెటర్‌ ఉండటంతో డిసెంబర్, జనవరిలో ఎవరో చంపి సంచిలో మూటగట్టి ఇక్కడ పడేసినట్లుగా పోలీసులు ప్రాధమిక అంచనాకి వచ్చారు . మృతదేహం కుళ్లిపోయి వాసన రాకుండా ఉండేందుకు హంతకులు పాలిథిన్‌ సంచుల్లో కట్టి యూరియా సంచిలో పెట్టి రోడ్డు పక్కన పడేశారని పోలీసులు భావిస్తున్నారు . అయితే 5, 6 నెలల క్రితం సంచి ఇక్కడ లేదని ఎండాకాలంలో ఈ ప్రాంతంలో చెత్తను కాలపెట్టినప్పుడు సంచి కూడా కాలి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి మరీ ఈ సంచి అక్కడికి ఎలా వచ్చింది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పరకాలకు చెందిన వ్యక్తిగా అనుమానం ... అస్థిపంజరం ఎవరిదో తేలితేనే మిస్టరీ తేలే అవకాశం

పరకాలకు చెందిన వ్యక్తిగా అనుమానం ... అస్థిపంజరం ఎవరిదో తేలితేనే మిస్టరీ తేలే అవకాశం

అయితే రాఘవరెడ్డిపేటలో అస్తి పంజరం లభించడంతో పోలీసులు అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించారు.గత ఐదారు నెలల కాలంలో ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అన్న కోణంలో ముందు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఒక మిస్సింగ్ కేసు విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరకాల రాజుపేటకు చెందిన తుమ్మల శ్రీకాంత్‌ అనే 18 ఏళ్ళ యువకుడు 5 నెలల నుంచి కనపడటం లేదని ఫిర్యాదు వచ్చిందని పరకాల సీఐ మధు అనుమానంతో సంఘటన స్థలానికి వచ్చారు. శ్రీకాంత్‌కు సంబంధించిన బంధువులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించగా రాత్రి అయినందున అందుబాటులో ఎవరూ లేరని సంఘటన స్థలానికి రాలేదు. శ్రీకాంత్‌కు తెలిసిన మిత్రులు ఫొటో తీసుకుని రాగా శ్రీకాంత్‌ ఫొటోలోని చెప్పులు, చేతిదండ, పాయింట్‌ ఒకే రకంగా ఉన్నాయని అది శ్రీకాంత్ మృతదేహమే అనే అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే ఆ అస్థిపంజరానికి సంబంధించి శ్రీకాంత్‌ సంబంధీకులు ఎవరూ రాకపోవడంతో అస్తి పంజరాన్ని, స్వెటర్, చెప్పులను ప్యాక్‌ చేసి ఎంజీఎం మార్చురీకి తరలించారు పోలీసులు .

English summary
The farmers were found a human skeleton wrapped in a bag beside the road in the suburb of Raghavareddipeta in Bhopalpalli zone. The road side bag fell into the rain and the dogs sprayed the skull, slippers and toes out of the bag. The farmers who found the skeleton were informed to the police. Bhoopalapalli DSP Kirankumar, CI Srinivas and SI Anil Kumar have taken up the investigation. It was examined to find any evidence of him. However, this mystery can only be revealed once the real person of the skeleton is identified. For further tests, the police packed the skeleton, sweater and slippers and transported them to MGM Mortuary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X