హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్కటైనా అమలుచేశారా... ఎందుకీ నిర్లక్ష్యం... తెలంగాణ‌ సర్కార్‌పై మరోసారి హైకోర్టు సీరియస్...

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై మొట్టికాయలు వేస్తూనే ఉంది. టెస్టుల సంఖ్య పెంచాలని,బులెటిన్‌ మరింత వివరంగా ఉండాలని,కార్పోరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని... ఇలా పలుమార్లు పలు ఆదేశాలిచ్చింది. అయితే వీటిల్లో ఏ ఒక్కటీ అమలు కావట్లేదని తాజాగా మరోసారి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు పలు ప్రశ్నలు సంధించింది. గతంలో ఇచ్చిన సూచనలు ప్రభుత్వం ఏ మేరకు పాటిస్తుందనే అంశంపై కోర్టు విచారణ చేపట్టింది.

Coronavirus: చికెన్ తింటే కరోనా వస్తుంది జాగ్రత్త, చైనా, మీకు సిగ్గు శరం మానం మర్యాద ఉందా! Coronavirus: చికెన్ తింటే కరోనా వస్తుంది జాగ్రత్త, చైనా, మీకు సిగ్గు శరం మానం మర్యాద ఉందా!

వాటిపై చర్యలేవీ...

వాటిపై చర్యలేవీ...

కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను దోపిడీ చేస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రభుత్వం సోమేష్ కుమార్‌ను ప్రశ్నించింది. అయితే ఇప్పటివరకూ 50 ప్రైవేటు ఆసుపత్రుల‌కు ప్ర‌భుత్వం నోటీసులు ఇచ్చింద‌ని సీఎస్ బదులిచ్చారు. మ‌రి మిగిలిన ఆస్పత్రుల ప‌రిస్థితి ఏంట‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది. అపోలో,బసవతారకం వంటి ఆస్పత్రులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. ప్రస్తుతం వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.

మోదీ కూడా... టెస్టుల సంఖ్య పెంచమని...

మోదీ కూడా... టెస్టుల సంఖ్య పెంచమని...

ఇటీవల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సైతం తెలంగాణలో అర్జెంటుగా టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్న సంగతి తెలిసిందే. మరోవైపు కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను పెంచామని మోదీకి తెలిపారు. లంగాణలో రికవరీ రేటు 71 శాతంగా ఉందని.. మరణాలు రేటు 0.7 శాతం మాత్రమే ఉందని తెలిపారు. కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ప్రధానికి సూచించారు.

నిమ్స్‌కు కోబాస్ 8800 మెషీన్...

నిమ్స్‌కు కోబాస్ 8800 మెషీన్...

అగస్టు 5న నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీరోజూ 40వేల కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు.కానీ ఇప్పటివరకూ రోజుకు 22 వేల నుంచి 23వేల టెస్టులు మాత్రమే చేస్తున్నారు. టెస్టుల సంఖ్యను పెంచేందుకు తాజాగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో కోబాస్ 8800 మెషీన్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రోజుకు 3వేల పైచిలుకు టెస్టులు చేసేందుకు అవకాశం ఉంది.

రూ.7 కోట్ల వ్యయంతో అమెరికా నుంచి తెప్పించిన ఈ మెషీన్‌ను బుధవారం నిమ్స్‌లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన లేబోరేటరీ కోసం మరో రూ.1కోటి ఖర్చు చేశారు. వారం రోజుల్లో ఈ మెషీన్ ద్వారా టెస్టులు చేయడం ప్రారంభిస్తారు.

Recommended Video

Telangana Corona Update : జిల్లాల్లో అదే తీరు, GHMC పరిధి లో 298 కొత్త కేసులు!! || Oneindia Telugu
పెరగనున్న ఆర్టీపీసీఆర్ టెస్టులు....

పెరగనున్న ఆర్టీపీసీఆర్ టెస్టులు....

ప్రస్తుం రాష్ట్రంలో రోజుకు 6600 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తుండగా.. కోబాస్ మెషీన్ అందుబాటులోకి వస్తే.. ఈ సంఖ్య 10వేలకు చేరనుంది. వాస్తవానికి జూన్ నెలలోనే తెలంగాణకు కోబాస్ మెషీన్ రావాల్సి ఉంది. అయితే ఆ మెషీన్‌ను కేంద్రం పశ్చిమ బెంగాల్‌కు పంపించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్‌)లో భాగంగా రాంకీ సంస్థ అమెరికాలోని రోంచే కంపెనీ నుంచి ఈ మెషీన్‌ను బుక్ చేసింది. కానీ కేంద్రం దాన్ని కోల్‌కతాకు పంపించడంతో... ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి తెలంగాణ కోసం మరో కోబాస్ మెషీన్‌ను బుక్ చేశారు.

English summary
Telangana highcourt again questioned government why they are not implementing a single order from court. Chief secretary Somesh Kumar submitted an affidavit in the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X