వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎందుకంత తొంద‌ర‌..? హ‌రీష్ రావు "క్వార్ట‌ర్" కూడా ఖాళీ చేసారు..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో స‌హ‌చ‌ర మంత్రుల‌కు ఇస్తున్న గౌర‌వం త‌న అల్లుడు హ‌రీష్ రావు కు ముఖ్య‌మంత్రి చంద్రశేఖ‌ర్ రావు ఇవ్వ‌డం లేద‌నే సందేహాలు క‌లుగుతున్నాయి. హ‌రీష్ రావును తెలంగాణ‌లో ఏకాకిని చేస్తున్నారనే ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరే విధంగా చంద్ర‌శేఖ‌ర్ రావు అడుగులు వేస్తున్న‌ట్టు నిర్ధార‌ణ అవుతోంది. ఎన్నో సంద‌ర్బాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు, మంత్రులు, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ప్ర‌భుత్వానికి సంబందించిన నివాస గ్రుహాల‌ను వాడుకోవ‌డం చూస్తుంటాం .

ఖాళీ చేయ‌మ‌ని వంద‌ల నోటీసులు జారీ చేసినా ఖాళీ చేయ‌ని ఉందంతాలు సైతం చూసాం. అలాంటి ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో విచిత్రం చోటు చేసుకుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్మించిన మంత్రుల క్వార్ట‌ర్ల‌లో 50కి పై నివాస గ్రుహాలు ఉన్నాయి. వాటిలో గ‌త టెర్ములో హ‌రీష్ రావుకు ఒక‌టి కేటాయించారు.అయితే, టీఆర్ఎస్ రెండ‌వ సారి అధికారంలోకి వ‌చ్చాక రెండు నెల‌ల అనంత‌రం మంత్రి వ‌ర్గం ఏర్పాటుచేశారు. అందులో హ‌రీష్ రావు పేరు లేక‌పోవ‌డం ఎవ‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేయ‌లేదు. ఎందుకంటే చాలారోజుల నుంచి అది ప్ర‌చారంలో ఉంది కాబ‌ట్టి.

Why is it quick? Harish Raos Quarter is also spaced out!

మంత్రి ప‌ద‌వి ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు త‌న‌యుడు కేటీఆర్ కూడా ఇవ్వ‌లేదని క‌వ‌ర్ చేస్తున్నా అది నామ‌మాత్ర‌మే అని తెలుస్తోంది. హ‌రీష్ రావుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని ఎలా చూసినా స‌మ‌ర్థించ‌లేని సంఘ‌ట‌న‌గా ప‌రిణ‌మించింది. అస‌లు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే ఇవ్వ‌క‌పోయారు., క‌నీసం హ‌రీష్ రావు కు ఇచ్చిన‌ బంగ్లా ను కూడా వ‌ద‌ల‌కుండా లాగేసుకున్నారనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఉన్న‌ది 12 మంది మంత్రులు. మంత్రుల నివాసాలు చాలా ఉన్నాయి.

అలాంటి నేప‌థ్యంలో హ‌రీష్ ఉంటున్న బంగ్లానే ఇత‌రుల‌కు కేటాయించిన అవ‌స‌రం ఏంట‌నే సందేహం క‌లుగుతున్న‌యి. అయినా ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అధికారులు హ‌రీష్‌రావుకు అదికారిక నివాసాన్ని ఖాళీ చేయాల‌ని ఏకంగా నోటీసు ఇవ్వ‌గా, ఆయ‌న గురువారం రోజే త‌క్ష‌ణం మినిష్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ లోని అదికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. హ‌రీష్ రావుకు పార్టీలో ఇంతటి వేగవంత‌మైన మార్పులు ఎందుకు జ‌రుగుతున్నాయో ఎవ‌రికి అంత‌గా అంతుచిక్క‌డం లేదు.

English summary
There is no doubt that Harish's bungalow needs to be allocated to others. There is debate in the political circles that this decision was deliberately taken. Officials gave notice to Harish Rao to vacate the apartment, but he was evacuated at the Ministers' Quarters in the immediate aftermath of Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X