హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మమ్మల్ని అడగడం ఏమిటి: కేసీఆర్‌కు ఉత్తమ్, టీఆర్ఎస్ కాదు.. వెలమ పార్టీ: కుంతియా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందస్తు సవాల్‌పై టీ కాంగ్రెస్ నేతలు సోమవారం స్పందించారు. ముందస్తు వ్యాఖ్యల నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా, సీనియర్ నేత, శాసన సభా పక్ష నేత జానారెడ్డి మాట్లాడారు.

Recommended Video

కేసీఆర్ సవాల్ కు ఉత్తమ్ సై

తిరగబడిన వ్యూహం!: వైసీపీ మైండ్ గేమ్, దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్, టీడీపీకి కూడాతిరగబడిన వ్యూహం!: వైసీపీ మైండ్ గేమ్, దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్, టీడీపీకి కూడా

తెలంగాణ ప్రజలు కేసీఆర్ నిరంకుశ పాలనతో విసిగిపోయారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ తెరాసలో చేరడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పారు. కేసీఆర్, ఆయన కుటుంబాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏ రోజు ప్రతిపక్షాలను సలహా అడగని కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమన్నారు.

Why KCR asked Congress stand over Early elections: Uttam, Kuntia

తెరాస ఉండేది మరో తొమ్మిది నెలలేనని, ఆ తర్వాత కాంగ్రెస్‌దే అధికారం అన్నారు.
పరస్పర సహకారంతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తామని పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి అన్నారు.

కేసీఆర్ విసిరిన ముందస్తు ఎన్నికల సవాల్‌కు తాము సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా ప్రకటించారు. ఎన్నికల కోసం పని విభజన చేసుకొని తాము బాధ్యతలను నిర్వహిస్తామని చెప్పారు. నాలుగేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఆయన అహంభావంతో ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, తెరాసలను ఎదుర్కోవడానికి తాముసిద్ధమన్నారు. టీఆర్ఎస్ ఓ పార్టీ కాదని, అది ఓ వెలమ కంపెనీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మేం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం: ముఖేష్, విక్రమ్

ఈ సమావేశం అనంతరం ముఖేష్ గౌడ్, విక్రమ్ గౌడ్‌లు పార్టీ మారే అంశంపై వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లోనే ఉంటామన్నారు. ఈ సమావేశానికి కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్, డీకే అరుణ, చిన్నా రెడ్డి, సబిత ఇంద్రా రెడ్డి తదితరులు హాజరయ్యారు.

English summary
Why Telangana Chief Minister K Chandrasekhar Rao asked Congress stand over Early elections, Telangana PCC chief Uttam Kumar Reddy question.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X