వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కోదండరాం కళ్లలోకి కేసీఆర్ సూటిగా ఎందుకు చూడలేకపోతున్నారు'

తెలంగాణ కోసం అలుపెరగని ఉద్యమాన్ని నిర్వహించిన జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని రేవంత్ రెడ్డి గురువారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ శుక్రవారం నిప్పులు చెరిగింది. తెలంగాణ ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఊదరగొట్టిన కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.

ఉద్యోగులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయలేదన్నారు. కేజీ టూ పీజీ విద్య అటకెక్కిందన్నారు.

'కేసీఆర్‌కు 22సార్లు హైకోర్టు మొట్టికాయలు', 'బాబు బిగ్ బజార్ అవుట్ లెట్లు ఎలా కొన్నారు' 'కేసీఆర్‌కు 22సార్లు హైకోర్టు మొట్టికాయలు', 'బాబు బిగ్ బజార్ అవుట్ లెట్లు ఎలా కొన్నారు'

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. విద్యార్థుల హక్కుల సాధనకై వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9వ తేదీన 'విద్యార్థుల పోరుబాట' పేరుతో బహిరంగసభను నిర్వహించనున్నట్లు చెప్పారు.

'Why KCR is not giving appointment to Kodandaram'

కళ్లలోకి సూటిగా చూడరెందుకు: రేవంత్

తెలంగాణ కోసం అలుపెరగని ఉద్యమాన్ని నిర్వహించిన జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని రేవంత్ రెడ్డి గురువారం అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమంయలో బంగారు ముఖంతో వెలిగిపోతున్న కోదండ ముఖం చూసి ఆకాశానికి ఎత్తుకున్న కేసీఆర్... ఇప్పుడు అదే కోదండరాం ముఖంలోకి సూటిగా చూడలేకపోతున్నారని, అపాయింటుమెంట్ ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో జేఐసీ, ప్రజా సంఘాల నేతలు కోదండరాం, హరగోపాల్, గద్దర్, విమలక్క తదితరులు పోలీసులతో అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పారు.

English summary
Why KCR is not giving appointment to Kodandaram, questiones TDP leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X