• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంబేద్కర్ ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనరా .. ? సరికొత్త చర్చకు తెరతీసిన మందకృష్ణ !!

|

హైదరాబాద్ : చాలా కాలం తర్వాత ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావును టార్గెట్ చేసారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ ఉత్సవాలను కారణంగా చూపుతూ చంద్రశేఖర్ రావు పైన విమర్శానాస్త్రాలు సంధింస్తున్నారు. ప్రభుత్వం తీరుకు నిరశనగా ఈ నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయనున్నట్టు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహం కు పాలాభిషేకం చేశారు. చంద్రశేఖర్ రావు అగ్రకుల అహంకారంతో అంబెడ్కర్ ను అవమానిస్తున్నారని. దేశం మొత్తం అధికారికంగా నిర్వహిస్తుంటే చంద్రశేఖర్ రావు మాత్రం ఉత్సవాలలో పాల్గొనక పోవడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు.

 గులాబీ నేతలు అంబేద్కర్ ను గౌరవించిన తర్వాతే కేసీఆర్ ను గౌరవిచాలి..! మందక్రిష్ణ తిరుగుబాటు..!!

గులాబీ నేతలు అంబేద్కర్ ను గౌరవించిన తర్వాతే కేసీఆర్ ను గౌరవిచాలి..! మందక్రిష్ణ తిరుగుబాటు..!!

అంబెడ్కర్ ఉత్సవాలలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎందుకు పాల్గొనడం లేదో వివరణ ఇవ్వాలని, ఐక్యరాజ్య సమితి లో కూడా అంబెడ్కర్ జయంతి ఉత్సవాలు జరుపుతున్నా, కనీసం ప్రగతి భవన్ లో, ఫార్మ్ హౌస్ లో ఎందుకు అంబెడ్కర్ జయంతి ఉత్సవాలు చేయడం లేదని మందక్రిష్ణ నిలదీసారు. అంబెడ్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొనక పోవడం పౌర హక్కులను హరించడమేనని, అంబెడ్కర్ దళితుడు కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలలో చంద్రశేఖర్ రావు పాల్గొనడం లేదని ఘాటుగా విమర్శించారు.

కేసీఆర్ కు దళితులంటే చిన్నచూపు..! అందుకే అంబేద్కర్ ఉత్సవాలకు దూరమన్న మంద..!!

కేసీఆర్ కు దళితులంటే చిన్నచూపు..! అందుకే అంబేద్కర్ ఉత్సవాలకు దూరమన్న మంద..!!

అగ్రకులస్థులు ప్రణబ్ ముఖర్జీ కాళ్ళు మొక్కిన చంద్రశేఖర్ రావు, దళితుడు కాబట్టే ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ కాళ్ళు మొక్కడం లేదని ప్రత్యేక వాదనను తెలరపైకి తెచ్చారు. అగ్రకుల నాయకుల కాళ్లు మొక్కిన చంద్రశేఖర్ రావు.. కనీసం అంబెడ్కర్ కు నివాళి అర్పించక పోవడం దారుణమన్నారు. పంజాగుట్ట సెంటర్ లో రాజశేఖర్ రెడ్డి విగ్రహం కు అనుమతి లేకపోయినా ఆ విగ్రహాన్ని ఎవరు ముట్టుకోరని, అనుమతులన్న అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ద్వంసం చూస్తారని మండి పడ్డారు.

ప్రభత్వ తీరుకు నిరశనగా ఉద్యమాలు..! 22న మహాదర్నా..!!

ప్రభత్వ తీరుకు నిరశనగా ఉద్యమాలు..! 22న మహాదర్నా..!!

అనుమతి లేదని అంబెడ్కర్ విగ్రహాన్ని విరగగొట్టి జీహెచ్ఎంసీ వాహనంలో తరలించి డంపింగ్ యార్డ్ లో వేయడం దారుణమన్నారు. పంజాగుట్ట ఉదంతం పట్ల యావత్ సమాజం స్పందించినా చంద్రశేఖర్ రావు మాత్రం ఎందుకు మాట్లాడడంలేదని, ఎర్రవెల్లి లో ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి ఇప్పటి వరకు చంద్రశేఖర్ రావు పూలమాల వేయలేదని అన్నారు. ఎర్రవెల్లి లో రోడ్ వెడల్పు పేరుతో అంబెడ్కర్ విగ్రహం తొలగించి ప్రభుత్వ స్కూల్ లో పెట్టడం కూడా దారుణమైన అంశమని మందక్రిష్ణ తెలిపారు.

చాలా కాలం తర్వాత కేసీఆర్ పై ఆరోపణలు..! అంబేద్కర్ సాక్షిగా మరో పోరాటానికి శ్రీకారం చుట్టిన మందక్రిష్ణ..!!

చాలా కాలం తర్వాత కేసీఆర్ పై ఆరోపణలు..! అంబేద్కర్ సాక్షిగా మరో పోరాటానికి శ్రీకారం చుట్టిన మందక్రిష్ణ..!!

ఇప్పటి వరకు పాఠశాలలో పెట్టిన విగ్రహాన్ని ఎవరు పట్టించుకోలేదని, ఎర్రవెల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూల్ కూలి పోయే దశలో ఉన్నా అదికాకర పార్టీ పట్టించుకోవడం లేదని మంద క్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను రాజకీయ నాయకున్ని కాకపోయినప్పటికి పాఠశాలకు, రోడ్ లకు నిధులు ఇప్పించుకుని బాగు చేసుకున్నామని అన్నారు. టీఆర్ఎస్ లో ఉన్న దళిత నాయకులు అంబెడ్కర్ ను గౌరవించినపుడే చంద్రశేఖర్ రావును గౌరవించాలని అన్నారు. చంద్రశేఖర్ రావు వైఖరికి నిరశనగా అన్ని జిల్లా, మండల కేంద్రాలలో నిరసన దీక్షలు చేస్తామని, 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాలు చేస్తామని మంద క్రిష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

English summary
After a long time, MRPS national president Madrakshana Madiga targeted Telangana Chief Minister Chandra Shekhar Rao. Criticism on Chandrasekhar Rao has been done due to the Ambedkar festival. Mandakrishna's call for dharnas across the state will be held on January 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X