అవినీతి పరుడని తెలిసినా మీ మిత్రుడు కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయరు.?అమీత్ షా కు షర్మిళ సూటి ప్రశ్న.!
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకంలో వాటా ఉందన్న బీజేపి ముఖ్యనేతలు,చంద్రశేఖర్ రావు చేస్తున్న అవినీతిలో కూడా బీజేపికి వాటా లేదంటే నమ్మాలా?అని వైయస్సార్ టీపీ అద్యక్షురాలు వైయస్ షర్మిళ ప్రశ్నించారు. ఎనిమిదేండ్లుగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలిచ్చారని, ఇక తెలంగాణలో కూడా ఇస్తారా? అని ఎద్దేవా చేసారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనని మీరు, తెలంగాణలో అధికారంలోకి వస్తే కొంటారా?అని నిలదీసారు. తుక్కుగూడలో అమీత్ షా ప్రసంగాన్ని వైయస్ షర్మిళ పూర్తి స్దాయిలో తప్పుబట్టారు.

రైతులను కార్లతో గుద్ది చంపిన చరిత్ర మీది.. మా తెలంగాణ రైతాంగాన్ని ఎలా ఆదుకుంటారన్న షర్మిళ
రైతులను కార్లతో గుద్ది చంపిన మీరు మా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటామని చెవిలో పూలు పెడుతున్నారా? అని షర్మిళ అమీత్ షా ను నిలదీసారు. చట్టబద్ధంగా ఇచ్చిన విభజన హామీలకే దిక్కులేదు, ఇక ఎం మొహం పెట్టుకొని ఒక్క చాన్స్ ఆడుగుతున్నారని మండి పడ్డారు. నిలబెట్ట చేతకాదుగాని కూలగొట్టడంలో దిట్టలు మీరు అని అమీతు షా పై చిందులు వేసారు షర్మిళ. మైనార్టీలను బలిపశువులను చేసి అధీకార పీఠాలను ఎక్కుతున్న మీరు, వారికున్న 4% రిజర్వేషన్ తీసెయ్యడం కాకుండా ఇంకేం ఆలోచించగలరని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మైనారిటీ రిజర్వేషన్ తొలగించలేరు.. అమీత్ షా కు సవాల్ విసిరిన షర్మిళ
దివంగత
వైయస్సార్
ఇచ్చిన
రిజర్వేషన్
మోడి,
అమీత్
షా
కలిసొచ్చినా
పీకెయ్యలేరన్నారు
షర్మిళ.
మీ
మతోన్మాదాన్ని
ఎదిరించగలగేది
వైయస్సార్
స్పూర్తి
మాత్రమేనని
షర్మిళ
స్పష్టం
చేసారు.
ఇదిలా
ఉండగా
తెలంగాణ
లో
కరెంట్
బిల్లులు
చూస్తే
ఫ్యూజులు
ఎగిరిపోతున్నాయని
ట్విట్టర్
లో
వైఎస్
షర్మిల
వాపోయారు.
పేదోడి
ఇంట్లో
బల్బ్
వెలగాలంటే
జేబుకు
చిల్లు
పడాల్సిందేనని
తెలంగాణ
ప్రభుత్వంపై
షర్మిళ
మండిపడ్డారు.

లెక్క పత్రం లేని కరెంట్ బిల్లులు.. పేదవాడికి పెనుభారమన్న షర్మిళ
మొన్నటి వరకు 80 యూనిట్ల లోపు వాడుకొంటే 188 రూపాయలు వచ్చిన బిల్లు ఇప్పుడు 307రూపాయలకు చేరిందన్నారు. ఇక పెరిగిన చార్జీలన్నీ 50,100,200 యూనిట్ల లోపు వాడుకొనే పేద, మధ్య తరగతి వాళ్లకే భారంగా పరిణమించాయని ఆవేదన వ్యక్తం చేసారు. దివంగత వైయస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా బస్ చార్జీలు కానీ కరెంట్ చార్జీలు కానీ ఇంటి పన్ను కానీ ఒక్క పైసా పెంచలేదన్నారు.

ఇది సంక్షేమ పాలన ఎలా అవుతుంది కేసీఆర్..? నిలదీసిన వైయస్సార్ టీపీ అద్యక్షురాలు
సీఎం
చంద్రశేఖర్
రావు
మాత్రం
పన్నులు
పెంచడమే
పనిగా
పెట్టుకొని
పేదోని
నడ్డి
విరుస్తున్నాడని
మండి
పడ్డారు.
పన్నులు,
చార్జీలు
తోచినంత
పెంచి
జనాల
ముక్కు
పిండి
బిల్లులు
వసూల్
చేస్తున్నాడని
తెలంగాణ
సీఎం
పై
షర్మిళ
విరుచుకు
పడ్డారు.
డిస్కంలకు
పడ్డ
బాకీనంతా
పెంచిన
చార్జీల
ద్వారా
వసూలు
చేసేందుకు
ప్రభుత్వం
సన్నాహాలు
చేస్తోందని,
దీని
వల్ల
పేద
మద్య
తరగతి
ప్రజానీకానికి
ఆర్ధిక
భారం
రెట్టింపవుతుందని
షర్మిళ
ఆవేదన
వ్యక్తం
చేసారు.