వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'భరత్ అనే నేను' సభపై కోదండరామ్ ఇలా.., హైకోర్టులో జెఎసి పిటిషన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఇటీవల ఎల్బీ స్టేడియంలో భరత్ అనే నేను సినిమా కార్యక్రమానికి ఎలా అనుమతిచ్చారని తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ప్రశ్నించారు. తాము సభ పెడతామంటే కాలుష్యం , ట్రాఫిక్ సమస్యలను కారణంగా చూపి అనుమతి ఇవ్వడం లేదన్నారు.మరోవైపు ఈ సభకు అనుమతివ్వాలని న్యాయవాది రచనారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. సోమవారానికి విచారణను వాయిదా వేసింది.

తనను చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు భయమెందుకని జేఎసీ నేత కోదండరామ్ ప్రశ్నించారు. తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరించడంపై ఆయన మండిపడ్డారు.

ఉద్దేశ్యపూర్వకంగానే కెసిఆర్ తమ పార్టీ ఆవిర్భావ సభకు అనుమతి ఇవ్వడం లేదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఎల్బీ స్టేడియం లేదా సరూర్‌నగర్ స్టేడియంలో సభను నిర్వహించుకొంటామని పోలీసులను అనుమతి కోరితే వారు నిరాకరిస్తున్నారని కోదండరామ్ చెప్పారు.

ప్రభుత్వం అనుమతిచ్చినా ఇవ్వకపోయినా ఏప్రిల్ 29న సరూర్ నగర్ స్టేడియంలో సభను నిర్వహిస్తామని కోదండరామ్ ప్రకటించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేశాం, ఆ ఉద్యమ స్పూర్తి నుండే తెలంగాణ జనసమితి ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

why not give permission to us asks tjac chairman Kodandaram

పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్‌లో సభను ఏప్రిల్ 29న, సభను నిర్వహించుకోవాలని జెఎసి భావిస్తోంది. ఈ సభ నిర్వహణ కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ జెఎసి నేతలు పోలీసులను కోరారు. అయితే జెఎసి సభ నిర్వహణకు పోలీసుల నుండి అనుమతి రాలేదు.

తమ పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసే సభకు అనుమతివ్వకపోవడం వెనుక ప్రభుత్వం ఉందని జెఎసి నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం అనుమతిచ్చినా ఇవ్వకపోయినా ఏప్రిల్ 29న సరూర్ నగర్ స్టేడియంలో సభను నిర్వహిస్తామని కోదండరామ్ ప్రకటించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేశాం, ఆ ఉద్యమ స్పూర్తి నుండే తెలంగాణ జనసమితి ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ఏప్రిల్ 29న సరూర్‌నగర్ స్టేడియంలో తెలంగాణ జనసమితి ఏర్పాటు చేసిన సభకు అనుమతివ్వాలని కోరుతూ న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో మంగళవారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పును చెప్పింది.

English summary
TJAC chairman Kodadaram made allegations on KCR on Tuesday. why Kcr government not permit to conduct public meeting in Hyderabad, he asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X