వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిరీష కేసు: 'రాజీవ్ ప్రియురాలు తేజస్విని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు'

కురునూరుపల్లి తీసుకెళ్లిన పోలీసులు తమ అనుమానాలను తీర్చలేదని బ్యూటీషియన్ శిరీష కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కారులో తమను కుకునూరుపల్లి తీసుకు వెళ్లారని, అయితే అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కురునూరుపల్లి తీసుకెళ్లిన పోలీసులు తమ అనుమానాలను తీర్చలేదని బ్యూటీషియన్ శిరీష కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కారులో తమను కుకునూరుపల్లి తీసుకు వెళ్లారని, అయితే అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు.

చదవండి: శిరీష దుస్తులపై మరకలు: పోలీసుల వద్ద ఫోరెన్సిక్ రిపోర్టు.. ఏం తేలింది?

శిరీష షేర్ చేసిన లొకేషన్‌ను పోలీసులు చెక్ చేసుకున్నారని చెప్పారు. కనీసం తమను కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి కూడా తీసుకెళ్లలేదని వారు తెలిపారు. పోలీసులు తమకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు.

చదవండి: భరించలేకపోయా, నీకు పెళ్లైందిగా అని చెప్పా: శిరీష పేరెంట్స్‌తో తేజస్విని, జాబ్ మానేయమని హెచ్చరిక

అది తేల్చడం లేదు

అది తేల్చడం లేదు

ఏం జరిగిందో, ఎలా జరిగి ఉంటుందన్న విషయాలేవీ తమకు చెప్పలేదని శిరీష కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసుల వ్యవహారశైలి మొత్తం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఈ కేసులో కేవలం వివాహేతర సంబంధం అన్న అంశం చుట్టూనే పోలీసులు తిరుగుతున్నారని, ఆమెది హత్యా? ఆత్మహత్యా? అన్న విషయాన్ని దర్యాప్తు చేయలేదెంటున్నారు.

తేజస్వినిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు

తేజస్వినిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు

రాజీవ్‌ను ప్రేమించిన తేజస్వినితో మాట్లాడించారని శిరీష కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యవహారం అంతా పోలీస్ క్వార్టర్సులో జరగలేదని, రెండు కిలోమీటర్ల దూరంలో జరిగిందని, రాజీవ్ కొట్టిన దెబ్బలకే శిరీష చనిపోయిందని, రాజీవ్ ప్రియురాలు తేజస్విని ఎందకు అరెస్టు చేయడం లేదని బంధువులు అంటున్నారు. సీన్ టు సీన్ వివరిస్తారని భావించామని, వారు మాత్రం అలా చేయలేదన్నారు.

పోలీసులు ఏం చూపించారంటే..!

పోలీసులు ఏం చూపించారంటే..!

శిరీష కుటుంబ సభ్యులను కుకునూరుపల్లితీసుకు వెళ్లిన పోలీసులు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ క్వార్టర్స్ చూపించారు. శిరీష, రాజీవ్, శ్రవణ్ కుకునూరుపల్లి వెళ్లిన సమయంలో ఎస్సై క్వార్టర్సులో ఏర్పాటు చేసిన హోంగార్డు నుంచి వివరాలు సేకరించారు.

విస్రా పరీక్షలో..

విస్రా పరీక్షలో..

కాగా, శిరీషపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. విస్రా పరీక్షలో ఆమె మద్యం సేవించి ఉన్నట్లు తేలిందన్నారు. శిరీష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో తేలిందన్నారు. ఆమె దుస్తులపై ఉన్న మరకలు అత్యాచారానికి సంబంధించినవి కావని, ఆహార పదార్థాల మరకలని నివేదికలో వెల్లడైనట్లు తెలిపారు. శిరీష మృతిపై ఎవరికి అనుమానాలు ఉన్నా నివృత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

English summary
Beautician Sirisha's family questioning police why they are not arresting Rajeev's lover Tejaswini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X