వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ కారణం, వారిపై ఫిర్యాదు: రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎందుకు ఉన్నారంటే?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలుస్తారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఆయన ఖండించారు కూడా.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎందుకు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలుస్తారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఆయన ఖండించారు కూడా.

బాబుకు రేవంత్ షాకిస్తారా: రాహుల్ గాంధీని కలుస్తారని ప్రచారం జరగడం వెనుక..?బాబుకు రేవంత్ షాకిస్తారా: రాహుల్ గాంధీని కలుస్తారని ప్రచారం జరగడం వెనుక..?

అందుకే ఢిల్లీలో రేవంత్ రెడ్డి

అందుకే ఢిల్లీలో రేవంత్ రెడ్డి

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎందుకు ఉన్నారు అనే చర్చ సాగుతోంది. అయితే ఆయన ఢిల్లీలో ఉండటం వెనుక తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు చేసేందుకు ఆయన దేశ రాజధానిలో ఉన్నారు.

కూలీ పనితో లక్షలు

కూలీ పనితో లక్షలు

కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినం సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నేతలు కూలి పని చేశారు. వారు కూలి పని ద్వారా లక్షలు వచ్చినట్లుగా చెప్పారు.

అప్పుడే నిలదీసిన విపక్షాలు

అప్పుడే నిలదీసిన విపక్షాలు

దీనిపై రేవంత్ రెడ్డితో పాటు విపక్షాలు అప్పుడే విమర్శలు గుప్పించాయి. ఒక్క రోజు కూలికి లక్షల రూపాయలు వస్తే, రైతులకు, ఇతర కూలీలకు కూడా అలా ఇప్పిస్తారా అని నిలదీశారు.

ఈసీ, సిబిఐ, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

ఈసీ, సిబిఐ, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా మంత్రులు చేసిన కూలీపై రేవంత్ రెడ్డి అప్పుడే సిఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీలో ఉన్నారు. ఈసీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి, సిబిఐకి ఆయన ఫిర్యాదు చేయనున్నారు.

English summary
Telanganana Telugu Desam Party working president Revanth Reddy on Tuesday conmdemned meeting with AICC vice president Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X