వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క దెబ్బకు రెండు: రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటీ, సమాధానాలు సిద్ధం?

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటి? ఆయన ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఆయన నేరుగా ఎందుకు తేల్చడం లేదు? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.బుధవా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటి? ఆయన ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఆయన నేరుగా ఎందుకు తేల్చడం లేదు? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

గుట్టు విప్పుతున్న రేవంత్ రెడ్డి: కెసిఆర్‌కు అదనపు చిక్కులుగుట్టు విప్పుతున్న రేవంత్ రెడ్డి: కెసిఆర్‌కు అదనపు చిక్కులు

Recommended Video

Revanth Reddy Chit Chat : Latest Update | Oneindia Telugu

బుధవారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏపీ టిడిపి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ విధంగా ఇరు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు దిమ్మతిరిగే ఆరోపణలు చేశారు. ఏపీ టిడిపి నేతలకు కేసీఆర్ కాంట్రాక్టులు ఇస్తున్నారని చెప్పారు.

బాబూ! మాకు అవకాశమివ్వు, పార్టీల్లేవు: రేవంత్, అపాయింట్‌మెంట్‌పై నో, చేరికపై సస్పెన్స్బాబూ! మాకు అవకాశమివ్వు, పార్టీల్లేవు: రేవంత్, అపాయింట్‌మెంట్‌పై నో, చేరికపై సస్పెన్స్

రేవంత్ రెడ్డి వద్ద వ్యూహం ఉందా

రేవంత్ రెడ్డి వద్ద వ్యూహం ఉందా

ఏపీ టిడిపి నేతలపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి రెండు రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఆయన నేరుగా ఆ పార్టీలో చేరుతానని చెప్పడం లేదు. దీనిపై ఆయన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఏపీలో, తెలంగాణలో టిడిపికి పోలిక లేదని ఆయన అభిప్రాయం

ఏపీలో, తెలంగాణలో టిడిపికి పోలిక లేదని ఆయన అభిప్రాయం

ఆయన పదేపదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతున్నారు. పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణలో పని చేశామని, వచ్చే ఎన్నికల్లో పని చేస్తే తప్పేమిటని నిలదీస్తున్నారు. ఏపీలో, తెలంగాణలో టిడిపికి పోలిక లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు.

రేవంత్ ప్లాన్ ఇదీ

రేవంత్ ప్లాన్ ఇదీ

కాంగ్రెస్ పార్టీలో చేరికపై మౌనం, పొత్తులపై పదేపదే మాట్లాడటం వెనుక రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పార్టీ నేతలపై ఆయన మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనుకున్న రేవంత్ రెడ్డి ఇకముందు కూడా విమర్శలు గుప్పించే అవకాశముంది. ఇలా చేయడం ద్వారా వేటు వేయించుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

వేటు వేయించుకొని జంప్

వేటు వేయించుకొని జంప్

టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడానికి ముందే టిడిపి అధిష్టానంతో వేటు వేయించుకొని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

అలా చెప్పడానికి అవకాశం

అలా చెప్పడానికి అవకాశం


తనంతట తానుగా పార్టీ మారితే ప్రజలకు చెప్పేందుకు ఇబ్బంది అవుతుంది. కానీ పార్టీ వేటువేశాక మారితే ప్రజలకు చెప్పుకునేందుకు రేవంత్ రెడ్డి వద్ద చాలా సమాధానాలు ఉన్నాయని అంటున్నారు.

ఆ సమాధానాలు సిద్ధం?

ఆ సమాధానాలు సిద్ధం?

తనపై వేటు వేశాక, పార్టీ మారిన అనంతరం ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలు అడిగే ప్రశ్నలకు రేవంత్ సమాధానాలు సిద్ధంగా ఉంచున్నారని తెలుస్తోంది. ఓటుకు నోటు నుంచి ఏ అంశం పైన అయినా ఆయన జవాబులతో సిద్ధంగా ఉన్నారట. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు కుమ్మక్కయ్యాయని, వాటిని తాను నిలదీస్తే తనపై వేటు వేశారని చెప్పడానికి రేవంత్ సిద్దంగా ఉన్నారట.

ఇరువురినీ ఇరికించిన రేవంత్ రెడ్డి

ఇరువురినీ ఇరికించిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కొత్త ఊపు వచ్చే అవకాశముంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణల్లోను అధికార పార్టీలను ఆయన చీల్చి చెండాడుతారని భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఏపీ టిడిపి నేతలకు కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్, జేఏసీ నేతలు చాలా రోజులుగా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ అక్కడ చంద్రబాబును, ఇక్కడ కేసీఆర్‌ను ఇరకాటంలో పడేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంట్రాక్టులు తీసుకున్నారంటే ఏది ఏపీ టిడిపి నేతలకు కూడా ఇబ్బందికరమే. ఇచ్చినందుకు కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బంది.

English summary
Why Telangana TDP working president Revanth Reddy not talking about joining Congress?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X