వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్నకాంగ్రెస్..! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమీకి కారణం చంద్రబాబేనా...?

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో పోత్తు కాంగ్రెస్ కొంపముంచిందా....ఆయనతో పోత్తులకు వెళ్లకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ మరిన్ని స్థానాలు సాధించే అవకాశం ఉండేదా...లోక్‌సభ ఫలితాల తీరు చూస్తే అది నిజమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 20 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే..అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కూడ ఉహించని విధంగా సీట్లు సాధించింది.మొత్తం 119 స్థానాలకు గాను 88 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. అయితే అన్ని సాధిస్తుందని ప్రతిపక్షాలు ఉహించలేకపోయాయి. ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఎర్పడుతుందని అంతా భావించారు.మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలకే పరిమితం కాదని అనుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమీకి కారణం చంద్రబాబు నాయుడని అభిప్రాయం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమీకి కారణం చంద్రబాబు నాయుడని అభిప్రాయం

అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒటమీపై సమీక్షించింది. ఓటమీకి కారణం చంద్రబాబునాయుడుతో పోత్తుకు వెళ్లడమే అనే ప్రాధమిక అంచనాకు వచ్చింది. ప్రధానంగా చంద్రబాబునాయడు తెలంగాణలో మరోసారి ప్రచారంలోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు కూడ గెలవలేకపోయిందనే అంచనాకు వచ్చింది. మొత్తం మీద చంద్రబాబుతో పోత్తు కాంగ్రెస్ పార్టీకి శరఘాతంగా మారిందని పార్టీ శ్రేణులు ఒక అభిప్రాయానికి వచ్చాయి. ఒంటరిగా వెళ్లిఉంటే గౌరవప్రదమైన సీట్లను గెలిచే అవకాశం ఉండేదని పార్టీ శ్రేణులు భావించాయి.

 ఎమ్మెల్యేలు పార్టీ మారీనా... కాంగ్రెస్‌ను తిరిగి ఆదరించిన ప్రజలు

ఎమ్మెల్యేలు పార్టీ మారీనా... కాంగ్రెస్‌ను తిరిగి ఆదరించిన ప్రజలు

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నదే అయింది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటిలోకి దిగింది. దీంతో అసెంబ్లి ఎన్నికలు జరిగిన అనతికాలంలోనే పార్టీ పుంజుకుంది. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారినా ఒంటిరిగా పార్లమెంట్ స్థానాలకు వెళ్లడంతో ఆపార్టీని ప్రజలు ఆదరించారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో ముందంజల్లో ఉంది. నల్లోండ, భువనగిరి,మల్కజ్‌గిరి తోపాటు చేవెళ్ల స్థానాల్లో పార్టీ ముందంజలో ఉంది. దీంతో చంద్రబాబునాయుడు రాకతోనే పార్టీ ఓటమీ పాలైందనేది పార్లమెంట్ ఎన్నికల ద్వార తేటతెల్లమయిందని పలువురు పార్టీ నేతలు భావిస్తున్నారు.

కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ .. మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయంకేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ .. మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం

రెంటికి చెడ్డ రేవడీ... చంద్రబాబు నాయుడు

రెంటికి చెడ్డ రేవడీ... చంద్రబాబు నాయుడు

సో మొత్తం మీద రెండు రాష్ట్ర్రాల్లో పాగా వేయాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడ అధికారానికి దూరమయ్యో పరిస్థితి నెలకోంది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం..జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశయానికి సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకోంది.

English summary
why the congress party defeated In the last assembly elections in Telangana. because of alliance with Chandrababu Naidu ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X