వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి ?

|
Google Oneindia TeluguNews

ఇంటర్ పరీక్షలు పకడ్బంధిగా నిర్వహించాల్సిన ఇంటర్ బోర్డు అధికారులు తమ అలసత్వం తో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సరైన సమాచారం లేకుండా పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలను పంపడం దగ్గరనుండి, పేపర్లు దిద్దేవరకు బోర్డు లోటు పాట్లు బయటపడుతున్నాయి.దీంతో ఇంటర్ రిజల్ట్ ఆలస్యమవుతున్నాయి.

పోరుగు రాష్ట్ర్రం ఏపి తోపాటు పరీక్షలు కొనసాగినా ,ఆ రాష్ట్ర్రంలో ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా తెలంగాణ ఫలితాలు మరో మూడు రోజుల తర్వాత వెలువడనున్నాయి. ఈనేపథ్యంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు గత పరీక్షల్లో చేసిన నిర్వాకాలు బయటపడుతున్నాయి. ఇందులో ప్రధానంగా గత పరీక్షల నిర్వాహణ సమయంలో చాల పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలను పూర్తి స్థాయిలో పంపడంలో వైఫల్యం చెందినట్టు తెలుస్తోంది.

why the inter result getting late ?

ఇందులో భాగంగానే వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట్ కు పరీక్ష పేపర్లను స్కాన్ చేసి కేంద్రాలకు పంపినట్టు సమాచారం .కాగా సరైన వివరాలను జిల్లా అధికారులు పంపకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్టు చెబుతున్నారు. మరోవైపు హైద్రబాద్ లోని ఓ ప్ర్రైవేటు కళాశాల విద్యార్థులకు వాళ్లు ఎంచుకున్న లాగ్వేజ్ ను పంపించడంలో పొరపాట్లు జరిగాయి. అసలు విద్యార్థులు ఎంచుకున్న లాంగ్వేజ్ పేపరునే పంపించలేదు .ఇలా రాష్ట్ర్రంలోని చాల చోట్ల ఇలాంటీ సంఘటనలు జరగడంతో పేపర్ వ్యాల్యుయోషన్ ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది.

English summary
why the inter result getting late ? what's happening in the board with the telangana inter board the students are suffering.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X