హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్యాగరాయగానసభలో భర్త కోసం ఇద్దరు భార్యల గొడవ: రచయిత్రిపై ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: త్యాగరాయగాన సభలో మంగళవారం రాత్రి జరిగిన రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో భర్త, ఇద్దరు భార్యల మధ్య గొడవ కలకలం రేపింది. దీనికి సంబంధించి మొదటి భార్య సూర్యప్రభ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో రచయిత్రి రాజేశ్వరి చంద్రజ పైన ఫిర్యాదు చేశారు.

తన భర్త అంటే తన భర్త అంటూ పరస్పరం ఇద్దరు మహిళలు దుర్భాషాలాడుతూ దాడులకు దిగిన విషయం తెలిసిందే. దీంతో త్యాగరాయ గానసభ ప్రాంగణమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన చూసిన విశ్రాంత హైకోర్టు జస్టిస్‌ ఎల్ నర్సింహా రెడ్డి, సినీ నటుడు తనిఖెళ్ల భరణి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వివాహేతర సంబంధం: తనికెళ్ల భరణి సాక్షిగా త్యాగరాయ గానసభలో ఉద్రిక్తత

త్యాగరాయగాన సభలో మంగళవారం రాత్రి జరిగిన రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో భర్త, ఇద్దరు భార్యల మధ్య గొడవ కలకలం రేపింది. ఈ ఘటన పాట్నా హైకోర్టు విశ్రాంత చీఫ్‌ జస్టిస్‌ ఎల్‌ నర్సింహా రెడ్డి, ప్రముఖ నటుడు తనిఖెళ్ల భరణి కళ్లెదుట చోటుచేసుకుంది.

Wife attacks Husband over External Affair

రసమయి సంస్థ పేరిట రచయిత్రి డా డీఆర్‌ఎల్‌ రాజేశ్వరి చంద్రజ రచించిన మనసు పడిన కథలు అనే పుస్తకాన్ని సినీ నటుడు తనిఖెళ్ల భరణి ఆవిష్కరించగా, పూజకు వేళాయరా? నవలను సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి ఆవిష్కరించారు.

పుస్తకాలను ఆవిష్కరించిన అనంతరం వేదిక వద్దకు నలుగురు మహిళలు చేరుకుని రచయిత్రి డా డీఆర్‌ఎల్‌ రాజేశ్వరి చంద్రజను, ఈమె భర్త డీవీ స్వామిని దుర్భాషాలాడుతూ వారిద్దరిని కింద పడేసి చితకబాదారు. మొదటి భార్య సూర్యప్రభ ఆగ్రహంతో ఊగిపోయి డీవీ స్వామి తన భర్త అని, ఆయనతో తనకు 1991లోనే వివాహమైందని, తమకు కుమారుడు కూడా జన్మించారన్నారు.

తన భర్తను దొంగచాటుగా రచయిత్రి రాజేశ్వరి చంద్రజ వివాహేత సంబంధం పెట్టుకుని, దొంగచాటు పెళ్లి చేసుకుందని మండిపడ్డారు. తమకు ఒక పరిశ్రమ ఉందని, నాలుగేళ్లుగా డీవీ స్వామి తనతో ఉండటం లేదని వాపోయారు. సూర్యప్రభ తమ్ముడు సాయికుమార్‌.. రాజేశ్వరి చంద్రజను దుర్భాషలాడారు. వేదిక వద్ద గొడవ జరగడంతో చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సిబ్బందితో వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

English summary
Wife attacks Husband over External Affair with Poojaku Velayara Book Author.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X