రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త కావాలంటూ అత్తింటి ఎదుట ఐదు రోజులుగా యువతి ఆందోళన

|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌లో భర్త కోసం ఓ భార్య ఆందోళనకు దిగారు. తనను పెళ్లి చేసుకొని, నాలుగేళ్ల తర్వాత ఆచూకీ లేకుండా వెళ్లిపోయారని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. రాజిరెడ్డితో సుగుణకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అబార్షన్ కూడా జరిగింది. తన భర్త తనకు కావాలంటూ ఆమె భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.

నెల రోజుల నుంచి తన భర్తను ఎక్కడో దాచిపెట్టారని చెప్పారు. తమ అత్తయ్య వారికి నాలుగు ఇండ్లు ఉన్నాయని, తన భర్త వచ్చే వరకు తనను ఉండనివ్వాలని కోరగా వారు ఇంటి నుంచి గెంటివేశారని వాపోయారు. బాధితురాలు ఇందుకు సంబంధించి మీడియా ఛానల్స్‌తో మాట్లాడారు.

Wife dharna in Rangareddy district for husband

నాలుగేళ్ల క్రితం ఆర్య సమాజ్‌లో లవ్ మ్యారేజ్ చేసుకున్నామని, అప్పటి నుంచి కలిసి ఉంటున్నామని, కానీ ఇటీవల తన భర్త తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడని, నాలుగైదు రోజులు అయినా రాలేదని, దీంతో అతని కోసం తన అత్తయ్య ఇంటికి వచ్చానని చెప్పారు. తన భర్త ఎక్కడున్నాడో చెప్పాలని తన అత్తయ్యను అడిగానని, ఆ తర్వాత వెళ్లిపోయానన్నారు.

కానీ వారు మాత్రం తనపై ఫిర్యాదు చేశారని, కొట్టడానికి వచ్చిందని, చంపడానికి వచ్చిందని ఆరోపించారని, ప్రాణహానీ ఉందని చెప్పారని, మరుసటి రోజు తన భర్త తన వద్దకు వచ్చి తన తల్లిని తిట్టావని, నీతో ఉండనని చెప్పాడని, ఇంట్లో నుంచి వెళ్లిపోయి నెల రోజులు అవుతుందని చెప్పారు. దీంతో ఐదు రోజుల క్రితం అతని ఇంటికి వచ్చానని, మా ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటానని తన అత్తయ్యతో చెప్పానని, కానీ వారు ఇంట్లోకి రానివ్వలేదని, దీంతో వాకిట్లోనే ఉంటున్నానని చెప్పారు.

తన అత్తయ్య, మామయ్య వారు పక్క భవనంలో ఉంటున్నారని చెప్పారు. తాను కేసు పెట్టలేదని చెప్పారు. కేసు పెడితే తన భర్త తనతో ఉంటాడో ఉండడోననే భయంతో కేసు పెట్టలేదన్నారు. మిస్సింగ్ కేసు మాత్రం పెట్టానని చెప్పారు. తన భర్త ఫోన్లు సవిచ్చాఫ్ ఉన్నాయని చెప్పారు.

కులం వేరు కాబట్టి తనను వదిలేసుకోవాలని ఆ కుటుంబం చూస్తోందన్నారు. ఓసారి అబార్షన్ కూడా చేయించారన్నారు. ఇది ఫ్యామిలీ ఆడుతున్న డ్రామా అన్నారు. తనకు తండ్రి లేడని, తల్లి వృద్ధురాలు కాబట్టి ఆమెకు చెప్పలేదన్నారు.

English summary
Wife dharna in abdullapurmet of Rangareddy district for husband. She is doing dharna from five days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X