వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: కొడుకు గుర్తుగా కారును చూసుకొంటాం, పోలీసులకు అందుబాటులోకి రాని వనితా

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకొన్నారు. చనిపోయే ముందు సెల్పీ వీడియో రికార్డ్ చేశారు విజయ్. ఈ వీడియో ఆధారంగా విచారణ జరిపించాలని విజయ్ సాయి తండ్రి సుబ్బారావు మరోసారి డిమాండ్ చేశారు. ఈ వీడియో ఆధారంగా ఈ ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం కన్పిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ సాయి భార్య వనితారెడ్డి పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం.

Recommended Video

కమెడియన్ విజయ్ భార్య వనితారెడ్డి సెల్ఫీ వీడియో, హెచ్ ఐవి పరీక్షలు కూడా ?

తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తా, నా బిడ్డ భవిష్యత్ ఆలోచించండి: వనితా రెడ్డి షాకింగ్ కామెంట్స్తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తా, నా బిడ్డ భవిష్యత్ ఆలోచించండి: వనితా రెడ్డి షాకింగ్ కామెంట్స్

రెండు రోజుల క్రితం ఇంట్లోనే విజయ్ సాయి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరేసుకొనే ముందు విజయ్ సాయి సెల్పీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

'చనిపోవడం కష్టంగా ఉంది, తప్పడం లేదు': 'లవ్ యూ డాడీ, వారిని వదలొద్దు''చనిపోవడం కష్టంగా ఉంది, తప్పడం లేదు': 'లవ్ యూ డాడీ, వారిని వదలొద్దు'

అయితే విజయ్ సాయి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయ్ సాయి చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే అదే సమయంలో వనితా రెడ్డి కూడ విజయ్‌పై, ఆయన తండ్రిపై కూడ ఆరోపణలు చేసింది.

ఆత్మహత్య వల్లే విజయ్ మృతి, హెచ్ఐవీ పరీక్షలు, పోన్ సంభాషణలతో వనితా కౌంటర్ఆత్మహత్య వల్లే విజయ్ మృతి, హెచ్ఐవీ పరీక్షలు, పోన్ సంభాషణలతో వనితా కౌంటర్

వనితాతో పాటు మరో ఇద్దరికి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు

వనితాతో పాటు మరో ఇద్దరికి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు

చనిపోయే ముందు సినీ నటుడు విజయ్ సాయి సెల్పీ వీడియో రికార్డ్ చేశారు. తన ఆత్మహత్యకు తన భార్య వనితారెడ్డి, కాంట్రాక్టర్ శశిధర్, అడ్వకేట్ శ్రీనివాస్‌లపై ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు గాను నోటీసులు ఇవ్వనున్నారు. అసలు విజయ్ వీరిపై ఎందుకు ఆరోపణలు చేయాల్సి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీయనున్నారు.ఈ మేరకు ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

.వనితారెడ్డిపై రెండు కేసులు

.వనితారెడ్డిపై రెండు కేసులు

విజయ్ సాయి ఆత్మహత్య కేసు విషయమై వనితారెడ్డిని పోలీసులు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆమె మాత్రం అందుబాటులోకి రాలేదని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విజయ్ సాయి చనిపోయే ముందు ఆమెపై ఎందుకు ఈ తరహ ఆరోపణలు చేశారనే విషయమై పోలీసులు ప్రశ్నించే అవకాశం కూడ లేకపోలేదు. ఈ విషయమై ప్రశ్నించాలని భావిస్తున్న సమయంలో ఆమె అందుబాటులోకి రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని విజయ్ కుటుంబసభ్యులు అభిప్రాయపడుతున్నారు.విజయ్ ఇంటికి నలుగురితో వచ్చి బలవంతంగా వచ్చి వనితారెడ్డి కారు తీసుకెళ్లిందన్నది ఓ కేసైతే, విజయ్ ఆత్మహత్యకు కారణమంటూ వనితారెడ్డిపై మరో కేసు నమోదు అయింది.

కొడుకు గుర్తుగా కారును చూసుకొంటాం

కొడుకు గుర్తుగా కారును చూసుకొంటాం

విజయ్ సాయి కారును తిరిగి ఇప్పించాలని విజయ్ తండ్రి సుబ్బారావు పోలీసులను కోరారు. విజయ్ సాయి ఆత్మహత్య కేసులో విజయ్ తల్లిదండ్రులను పోలీసులు బుదవారం నాడు సమాచారం సేకరించారు.తమ కొడుకు గుర్తుగా కారును ఇప్పించాలని సుబ్బారావు పోలీసులను కోరారు. కారు వనితారెడ్డి పేరున ఉన్నా... కారు కొనుగోలు చేసేందుకు విజయ్ డబ్బులు చెల్లించాడని వారు గుర్తు చేశారు.

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు


ఆత్మహత్య చేసుకొనే ముందు విజయ్ సాయి రికార్డ్ చేసిన సెల్పీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపారు. ఈ ల్యాబోరేటరీ ఇచ్చే నివేదిక కేసు విచారణకు దోహదపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. విజయ్ ఆరోపణలు చేసిన వారిని ప్రశ్నిస్తే కూడ ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం కూడ లేకపోలేదు.అన్ని రకాల కోణాల్లో ఈ కేసు విచారణ చేస్తున్నారు.

English summary
The Hyderabad police booked the wife of Telugu actor Vijay Sai and two others, hours after he committed suicide on Monday. The trio have been charged with abetment to suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X