• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విజయ్ అంత్యక్రియలకు రాని భార్య, కూతుర్నీ తీసుకురాలేదు, 'విడాకులకు రూ.3 కోట్లు'

|

హైదరాబాద్: నటుడు విజయ్ సాయి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ఈఎస్ఐ స్మశాన వాటికలో జరిగాయి. అతని భార్య, వనిత, కూతురు లేకుండానే ఈ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న అతని మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

  కమెడియన్ విజయ్ భార్య వనితారెడ్డి సెల్ఫీ వీడియో, హెచ్ ఐవి పరీక్షలు కూడా ?

  ఆ తర్వాత మంగళవరం యూసుఫ్‌గూడలోని శ్రీనివాసం విలేజ్‌ అపార్టుమెంట్‌ వద్దకు తీసుకు వచ్చారు. అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని అపార్టుమెంట్‌ కింది భాగంలో ఉంచారు. దర్శకులు రవిబాబు, నటుడు ఉత్తేజ్‌ తదితరులు ఇక్కడికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.

  రౌడీలను తీసుకొచ్చింది: నటుడు విజయ్ స్నేహితుడు, ఆర్టిస్ట్ నుంచి పెళ్లి.. ఎవరీ వనిత?

  చివరి చూపుకు రాలేదు

  చివరి చూపుకు రాలేదు

  విజయ్‌ భార్య వనిత చివరిచూపు చూడటానికి, కుమార్తె కుందనకు తండ్రిని చూపించేందుకు వస్తుందని అందరూ ఊహించారు. కానీ ఆమె రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్యనే విజయ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. విజయ్‌కు తన కుమార్తె కుందన అంటే ఎంతో ప్రాణమని, కోర్టు అనుమతితో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చూసేందుకు వెళ్లేవాడని బంధువులు తెలిపారు.

  అక్కడే దొరికిపోయారు: విచారణలో స్వాతి షాకింగ్, ప్రియుడికి సర్జరీ చేయించి పుణేకు వెళ్లాలనుకొని

  కూతురును తీసుకు రాకపోవడంపై ఆగ్రహం

  కూతురును తీసుకు రాకపోవడంపై ఆగ్రహం

  చివరి చూపుకు కుమార్తెను తీసుకురాకపోవడంపై బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. భార్య వనితారెడ్డి వేధింపులు, కుమార్తెను అతని దగ్గరకు రానీయకపోవడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని పెదనాన్న, సోదరుడు ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో విలేకరులకు తెలిపారు.

  కేసు నమోదు

  కేసు నమోదు

  విజయ్‌ ఆత్మహత్య కేసులో అతని భార్య వనితతో పాటు, లాయర్ శ్రీనివాస్‌, శశిధర్‌లపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌ సెల్ఫీ వీడియోలను స్వాధీనం చేసుకున్నామని వాటిని ఫోరెన్సిక్‌ నివేదికకు పంపుతామని పోలీసులు తెలిపారు.

  మెడ నరాలు తెగిపోవడం వల్ల మృతి

  మెడ నరాలు తెగిపోవడం వల్ల మృతి

  విజయ్ మెడ నరాలు తెగిపోవడం వల్లనే మృతిచెందాడని వైద్యులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన విజయ్‌ మెడ నరాలు తెగిపోవడంతోపాటు ఎముక విరిగిందని తద్వారా కోమాలోకి వెళ్లి మృతిచెంది ఉంటాడని పోలీసులకు ప్రాథమిక నివేదిక ఇచ్చారని తెలుస్తోంది.

  విడాకుల కోసం రూ.3 కోట్లు డిమాండ్

  విడాకుల కోసం రూ.3 కోట్లు డిమాండ్

  మరోవైపు విజయ్ తండ్రి కేవీ సుబ్బారావు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వనిత విడాకులు ఇవ్వడానికి రూ. 3 కోట్లు డిమాండ్‌ చేసిందని పేర్కొన్నారు. వనిత, లాయర్ శ్రీనివాస్‌, శశిధర్‌ కలిసి ఈ విషయంలో వేధింపులకు గురిచేశారంటూ తన కుమారుడు తనతో చెప్పాడన్నారు. వారి వేధింపులను తట్టుకోలేక విజయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. వనిత, శ్రీనివాస్‌, శశిధర్‌లు ఈ మృతికి బాధ్యులు అన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu actor Vijay Sai on Monday committed suicide and hours later, police booked his wife and two others for abetment to suicide. The 35-year-old was found hanging from the ceiling fan in his flat in Yousufguda neighborhood, police said. Police recovered a video taken by him on his mobile phone before ending his life, in which he allegedly blamed his wife and two others for driving him to the extreme.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more