వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవిప్రకాశ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం, కాసేపట్లో నోటీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రవిప్రకాశ్‌ను సైబర్ క్రైం పోలీసుల విచారణ మూడోరోజు కొనసాగుతుంది. అయితే విచారణకు రవిప్రకాశ్ సహకరించడం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. చెప్పిన సమాధానాలే చెప్పి .. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

అరెస్ట్ తప్పదా ?

అరెస్ట్ తప్పదా ?

ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుకు సంబంధించి రవిప్రకాశ్‌కు అరెస్ట్ నోటీసు జారీచేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌తో సీసీఎస్ పోలీసులు సమావేశమయ్యారు. మూడురోజులుగా జరుగుతున్న విచారణ తీరును సీపీకి వివరించారు. ఎంక్వైరీకి రవిప్రకాశ్ సహకరించలేదని .. దీంతో అరెస్ట్‌ చేయడానికి నోటీసులు జారీచేసే అంశంపై డిస్కస్ చేశారు. ఈ కేసులో రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అరెస్ట్ కోసం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

పరారీలోనే శివాజీ ..

పరారీలోనే శివాజీ ..

మరోవైపు ఈ కేసులో ఏ2 నిందితుడు శివాజీ ఇంకా పరారీలో ఉన్నారు. విచారణ సందర్భంగా శివాజీ ఆచూకీ గురించి కూడా రవిప్రకాశ్‌ను పోలీసులు ప్రశ్నించిన .. నాకు తెలియదనే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తి కూడా సీసీఎస్ విచారణకు హాజరవుతున్నారు. అయితే ఇదివరకు మూర్తి చెప్పిన సమాధానాలను .. ప్రస్తుతం విచారణ సందర్భంగా రవిప్రకాశ్ చెప్తున్న అంశాలను సైబర్ క్రైం పోలీసులు పోల్చిచూస్తున్నారు.

మరోవైపు సీఆర్పీసీ కూడా ..

మరోవైపు సీఆర్పీసీ కూడా ..

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీచేశారు. టీవీ9 లోగో విషయంలో కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని అలందా మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. దీంతో 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేశారు. ఈ కేసుకు సంబంధించి రవిప్రకాశ్ రేపు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇటు ఫోర్జరీ, అటు కాపీరైట్ కేసులతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

English summary
Former CEO of TV9 Ravi Prakash is in a fraud in the case of forgery. In this case, the cyber crime police investigation is already on for the third day in Ravi Prakash. Police officials say that Ravi Prakash does not co-operate with the investigation. He said that the answer to the questions was being made to mislead the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X