హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త ఆశలు: తెలంగాణపై వారి ఆశలు, చంద్రబాబు చక్రం తిప్పుతారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన నేపథ్యంలో ఈసీ సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. కొన్నిచోట్ల అసంతృప్తుల బెడద ఉంది.

Recommended Video

తెలంగాణ‌లో పొత్తులు ఖ‌రారు..!

<strong>కేసీఆరే సీఎం, ఏపీకి ఏం చేయని చంద్రబాబుకు హైదరాబాద్‌లో దమ్ముందా: అసదుద్దీన్</strong>కేసీఆరే సీఎం, ఏపీకి ఏం చేయని చంద్రబాబుకు హైదరాబాద్‌లో దమ్ముందా: అసదుద్దీన్

అయినప్పటికీ ఆయాచోట్ల అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ దక్కుతుందని ధీమాగా ఉన్నవారు కూడా ప్రచార రంగంలోకి దిగారు. బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, మజ్లిస్ పార్టీలు కూడా ప్రచారం చేస్తున్నాయి. పలు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణలో పొత్తులు కూడా ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణ మరో కర్ణాటక అవుతుందా?

తెలంగాణ మరో కర్ణాటక అవుతుందా?

మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన సంచలనం రేపింది. నవంబర్‌లో ఫలితాలు వచ్చాక తాము ముఖ్యమంత్రి కావొచ్చుననే అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారని, ఇక్కడ మనం ఎందుకు కాకూడదని కార్యకర్తల సమావేశంలో అన్నారు.

మాదే కీలక పాత్ర... తెలుగుదేశం పార్టీ ఆశలు

మాదే కీలక పాత్ర... తెలుగుదేశం పార్టీ ఆశలు

మరోవైపు, తెలుగుదేశం పార్టీ నేత ఎల్ రమణ కూడా మేం లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు కాదని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా హంగ్ వస్తుందా అనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. ఎవరికీ సరిపోయే సీట్లు రాకుంటే టీడీపీ, మజ్లిస్, బీజేపీ వంటి తక్కువ సీట్లు వచ్చే పార్టీలు కీలకం కానున్నాయని అంటున్నారు.

ఎవరికి వారే ధీమా కానీ

ఎవరికి వారే ధీమా కానీ

తెలంగాణలో తెరాస, బీజేపీ ఓంటరి పోరుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీపీఎం, సీపీఐ, జనసేన, కోదండరాం పార్టీలు కూడా పొత్తుల చర్చలో ఉన్నాయి. కాంగ్రెస్, తెరాస ఏ పార్టీకి ఆ పార్టీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. తెరాస ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత ఉందని విపక్షాలు చెబుతున్నాయి.

మేజిక్ ఫిగర్‌కు సమీపంలో ఆగితే

మేజిక్ ఫిగర్‌కు సమీపంలో ఆగితే

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లేదా తెరాస మేజిక్ ఫిగర్‌కు సమీపంలో ఆగితే హంగ్ ఏర్పడవచ్చునని, అప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం లేదా మజ్లిస్ కొద్దో గొప్పో సీట్లు సాధిస్తే బీజేపీ కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కాంగ్రెస్‌కు అవసరం పడితే టీడీపీ మద్దతిచ్చినా, ఆ పార్టీ చక్రం తిప్పే అవకాశాలుంటాయి. టీడీపీ కూడా తమకు 40 నుంచి 60 స్థానాల్లో మంచి పట్టు ఉందని, కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే ఎక్కువ స్థానాలు అడగాలని భావిస్తోంది.

English summary
Will Andhra Pradesh Chief Minister Chandrababu Naidu play key role in Telangana after elections?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X