వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ హామీ ఇచ్చి మూడేళ్లు: వాటికి మోక్షం ఎప్పుడు?

ప్రజలు అడగకున్నా చేయని పథకాలు ఉన్నాయని వాదిస్తుంటారు. కానీ ఆచరణలో ఏ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని వాస్తవ పరిస్థితులు చెప్తున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూడేళ్ల క్రితం ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలు, పేర్కొనని అంశాలు హామీలు అమలు చేసి చూపామని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొదలు ఆయన మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కీలక నేతలు పదేపదే చెప్తూ వస్తున్నారు. ప్రజలు అడగకున్నా చేయని పథకాలు ఉన్నాయని వాదిస్తుంటారు.

కానీ ఆచరణలో ఏ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని వాస్తవ పరిస్థితులు చెప్తున్నాయి. గిరిజన తండాలను పంచాయతీలుగా రూపుదిద్ది స్వపరిపాలనకు అవకాశం కల్పించాలని ఆదివాసీలు, గిరిజన సంఘాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచి డిమాండ్ కొనసాగుతూ వస్తున్నది. లంబాడా హక్కుల పోరాట సమితి, ఆదివాసుల పోరాట కమిటీల పేరిట పలు రకాలుగా ఆందోళనలు సాగాయి. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఖరారుచేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకటించారు.
ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలు ముందుకు వచ్చాయి.

తొలుత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని విలీనంచేస్తానని పదేపదే హామీలు గుప్పించారు నాటి, నేటి టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు. కానీ తెలంగాణ ఏర్పాటు బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత క్రమంగా స్వరం మార్చారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్దమన్న సంకేతాలిచ్చారు. తర్వాత పొత్తు కోసం సీనియర్ నేత కే కేశవరావు సారథ్యంలో కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు గానీ ఆచరణలో అందుకు అవకాశాలు కల్పించకుండానే ఒంటరిపోరుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి హామీల అమలులో వెనుకబడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఆచరణలో హామీల అమలులో విఫలం

ఆచరణలో హామీల అమలులో విఫలం

గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా తన రాజకీయ చాతుర్యాన్నిప్రదర్శించడంలో కేసీఆర్ విజయం సాధించారు. టీపీసీసీ చీఫ్ గా బాద్యతలు స్వీకరించిన పొన్నాల లక్ష్మయ్య పరిణతి లోపించిన వ్యాఖ్యలు.. ఇతర కాంగ్రెస్ నేతల చేష్టలుడిగిన తీరును కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చచుకున్నారు. వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో సబ్బండ వర్ణాలను కలుపుకుని వెళ్లేందుకు అవసరమైన హామీలన్నీ తన మేనిపెస్టోలో చొప్పించారు. అందులో ఒకటి పంచాయతీలుగా గిరిజన తండాలను, గూడెలను తీర్చిదిద్దుతామని ఆ హామీల్లో ఒకటి.

వీటితోపాటు ఇతర హామీలు.. కాంగ్రెస్ పార్టీ నేతల అహంకార పూరిత వైఖరి.. రాష్ట్రస్థాయి సామర్థ్యం గల నేత లేమి ఫలితంగా టీఆర్ఎస్ పట్ల ప్రజలు ఆకర్షితులు కావడంతో ఎన్నికల్లో 60 స్థానాలకు పైగా గెలుచుకున్నటీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు అడుగడుగునా రాజకీయ చాతుర్యంతో కూడిన ప్రకటనలు, వ్యూహాల అమలుతోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలన సాగిందే తప్ప.. పూర్తిగా ఆచరణీయమైన రీతిలో పాలన సాగిందని చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సొంత పంచాయతీల కోసం గిరిజనం ఆందోళన

సొంత పంచాయతీల కోసం గిరిజనం ఆందోళన

గిరిజన తండాలు గానీ, గూడెలు గానీ గ్రామంలోకి ఇతర సామాజిక వర్గాలకు భిన్నంగా, విడిగా ఉంటాయి. కానీ వాటిని సమీప గ్రామ పంచాయతీలకు హామ్లెట్ గ్రామాలుగా చేర్చడంతో ఆయా పంచాయతీ పరిధిలో రాజకీయ పలుకుబడి గల నాయకులు చెప్పిందే శాసనం.. రాజ్యం. గిరిజనుల్లోనూ ఇప్పుడు విద్యావంతులు ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతున్నదో అర్థం చేసుకుంటున్నారు. స్వపరిపాలనతోనే దీనికి చరమగీతం పాడగలమని నిర్ధారణకు వచ్చారు.

అందుకు అనుగుణంగా పోరుబాట పట్టారు. రకరకాల రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. తదనుగుణంగా గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నది. షెడ్యూల్ ప్రకారం 2019లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. కానీ విపక్షాలను కోలుకోలేని దెబ్బ తీసేందుకు ముందస్తు ప్రజాతీర్పుతో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న సంకల్పంతో అధికార టీఆర్ఎస్ ముందుకు వెళుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పంచాయతీలుగా గిరిజన తండాలపై సీఎం ఇలా

పంచాయతీలుగా గిరిజన తండాలపై సీఎం ఇలా

ఈ క్రమంలో 500 మంది జనాభా గల గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఎప్పుడు మారుస్తారన్న విషయమై మాత్రం ఇప్పటికీ ప్రభుత్వంలో స్పష్టత కానరాలేదని విశ్లేషకులు చెప్తున్నారు. నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలంటే ముందే కసరత్తు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రెండేళ్ల ముందు నుంచి పంచాయతీల ఏర్పాటుకు అధికారులు తగిన కసరత్తు చేపట్టాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా రమారమీ 8600 గ్రామ పంచాయతీలు ఉంటే అదనంగా సుమారు 2847 గిరిజన తండాలు పంచాయతీలుగా రూపాంతరం చెందుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1000 గ్రామ పంచాయతీలు ఉంటే అదనంగా 2011 జన గణన ప్రకారం గిరిజన తండాలను పంచాయతీలుగా మారిస్తే నూతనంగా 250 గ్రామ పంచాయతీలు ఆవిర్భవిస్తాయి. తద్వారా తండాలు ప్రగతి పథంలో దూసుకెళ్లడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గమ్మత్తేమిటంలే సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రెండో మంత్రివర్గ సమావేశంలోనే గిరిజన తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు.

తగిన ప్రతిపాదనలు పంపాలని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు, కలెక్టర్లు తమ అధ్యయనంలో సేకరించిన సమాచారాన్ని నివేదికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తున్నది. కాని జిల్లా పంచాయతీ అధికారులు పంపిన ఆదేశాలు ఇప్పటికీ పరిశీలనకే తీసుకున్నట్లు దాఖలాలే లేవు.

పంచాయతీలుగా గిరిజన తండాల పరిస్థితి ఇదీ

పంచాయతీలుగా గిరిజన తండాల పరిస్థితి ఇదీ

పంచాయతీల చట్టం ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని సుప్రీం ఆదేశాలు జారీచేసిన మేరకు వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పంచాయతీ ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఈ లోపు తాజాగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో గ్రామ పంచాయతీలుగా తండాలను మార్చే ప్రక్రియ ఇప్పటికిప్పుడు ముందుకు సాగే సంకేతాలేమీ కనిపించడం లేదని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నాలుగుశాతం రిజర్వేషన్ పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. అదే సమయంలో న్యాయ వ్యవస్థ కూడా ఆమోదించడం తప్పనిసరి. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలను రూపొందించాలన్న ప్రతిపాదన కార్య రూపం దాల్చాలంటే.. వచ్చే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా.. ఆచరణలోకి రావడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని అంచనాలు ఉన్నాయి.

కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అమలెప్పుడు

కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అమలెప్పుడు

గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలను రూపొందిస్తామన్న హామీతోపాటే ‘కేజీ టు పీజీ' వరకు ఉచిత విద్యను అందుబాటులోకి తెస్తామన్నారు. కానీ ఈ విషయమై మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒక్కో గురుకుల పాఠశాల ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. కేజీ టు పీజీ ఉచిత విద్య విధానం అమలు సంగతేమిటన్న ప్రశ్నలకు గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం కదా? అని ఎదురు ప్రశ్నలు సంధించే తరుణం వచ్చేసిందని విమర్శకులు చెప్తున్నారు.

రెండేళ్లలో ఏడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు

రెండేళ్లలో ఏడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పూర్తయితే లక్షా ఏడువేల ఉద్యోగాలు అవసరమని వాటిని దశల వారీగా భర్తీచేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కానీ ఆచరణలో మూడేళ్లలో ఏడు వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయగలిగారు. మరో ఎనిమిది వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇక నిరుద్యోగ యువతలో అసంత్రుప్తి పెరిగిపోతుండటంతో మూడు విడతలుగా చేపట్టాలని భావించిన కానిస్టేబుళ్ల ఉద్యోగ నియామక ప్రక్రియ ఒక్కసారే 10 వేల మందిని అర్హులుగా ప్రకటించారు. అదీ కూడా ఇంకా న్యాయ స్థానాల తీర్పునకు అనుగుణంగానే అమలుచేయాల్సిన పరిస్థితి దాపురించిందని విశ్లేషకులు మాట.

వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ప్రైవేట్ రంగంలో కొత్తగా 43 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని ప్రభుత్వంలోని వ్యక్తులు చెప్తున్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలంటేనే ప్రతిభ, వారి కమ్యూనికేషన్స్ స్కిల్స్ తదితరాలు కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిన నిష్ఠూర సత్యం. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం ప్రైవేట్ ఉద్యోగాల కల్పన కూడా తమ ఘనత అని చెప్పుకునే స్థాయికి ఎదిగారంటే వారిలో ప్రజలు, నిరుద్యోగ యువత పట్ల ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతూనే ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

సొంతింటి కల సాకారం చేస్తారా?

సొంతింటి కల సాకారం చేస్తారా?

హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక కాలనీ వాసులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా నిర్మించారు. తర్వాత సీఎం కేసీఆర్ తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో దిగ్విజయంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇతర పథకాలు విజయవంతంగా అమలుచేస్తున్నారు. రాష్ట్రమంతా ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నిజం చేస్తామని పదేపదే చెప్తూ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వందల సంఖ్యల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం సాగుతున్నది. వేలల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అవసరమైతే.. కేవలం వందల్లో నిర్మాణం వల్ల అందరికీ సొంతింటి కల సాకారం చేసే డబుల్ బెడ్ రూం ఇల్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న సంగతి ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోనున్నదని అంటున్నారు.

దళితులకు పంపిణీచేసిన భూమి ఎంత?

దళితులకు పంపిణీచేసిన భూమి ఎంత?

తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద దళితులు ఆత్మగౌరవంతో బతికేందుకు మూడెకరాల భూమి ఇస్తామని తెలంగాణ ఏర్పాటైన తొలి ఏడాది ఆగస్టు 15వ తేదీన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత సీఎం కేసీఆర్, కొద్ది మంది దళితులుకూ మూడెకరాల విలువైన పట్టా పుస్తకాలు అందజేశారు. కానీ తర్వాతెప్పుడు దళితులకు భూమి పంపిణీ చేసిన దాఖలాలు లేవు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ఫలానా జిల్లాలో ఫలానా ప్రాంతంలో భూమి పరిశీలిస్తున్నామన్న ప్రకటనలు, ప్రత్యేక కథనాలు వెలువరించడం తప్ప, ఆచరణలో ఎంత మంది దళితులకు భూమి పంచారన్న విషయమై ప్రభుత్వ డాక్యుమెంట్లు మాత్రం అందుబాటులో లేవని చెప్తున్నారు.

English summary
Telangana government in the leader ship of CM KCR is failure is electoral assurances while any one of his assurances didn't fullfill fruitfully.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X