• search
 • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు దసరాకు గిఫ్ట్ ఇవ్వనున్నారా ? క్యాబినెట్ లో కవితకు స్థానం ? చర్చ షురూ !!

|

సీఎం కేసీఆర్ తనయ కవితకు దసరాకు గిఫ్ట్ ఇవ్వనున్నారా ? కేసీఆర్ మంత్రివర్గంలో కవితకు బెర్త్ ఖరారు అయ్యిందా? రాష్ట్ర రాజకీయాల్లో కవిత చక్రం తిప్పబోతున్నారా ? కేసీఆర్ క్యాబినెట్ లోకి కవిత వస్తే అవుట్ అయ్యే ఆ మంత్రి ఎవరు ? ఎమ్మెల్సీగా కవిత పొలిటికల్ ఎంట్రీపై తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

నిజామాబాద్ లో వార్ వన్ సైడే .. ఎమ్మెల్సీగా కేసీఆర్ తనయ కవిత ఎన్నిక లాంఛనప్రాయమే !!నిజామాబాద్ లో వార్ వన్ సైడే .. ఎమ్మెల్సీగా కేసీఆర్ తనయ కవిత ఎన్నిక లాంఛనప్రాయమే !!

 రీ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్న కవిత

రీ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్న కవిత

ఎమ్మెల్సీగా ఎన్నిక తర్వాత కవిత క్యాబినెట్లో అడుగుపెడుతోంది అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ ఎంపీ, కెసిఆర్ తనయ కవిత అప్పటి నుండి ఇప్పటి వరకూ రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్నారు. ఇక తాజాగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కవిత ఎన్నిక లాంఛనప్రాయంగా కావడంతో ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తారు అన్న చర్చ జోరుగా సాగుతోంది.

మంత్రిగా కవితకు ఛాన్స్ ?

మంత్రిగా కవితకు ఛాన్స్ ?

అయిదేళ్లపాటు ఎంపీగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కవిత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.వచ్చే నెల 9వ తేదీనే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 12వ తేదీన ఎమ్మెల్సీని ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్సీగా కవిత గెలుపు లాంఛనప్రాయమే అని అందరికీ తెలుసు. అయితే కవిత ఎమ్మెల్సీ గా మాత్రమే పరిమితం కారని , మంత్రిగా రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా పని చేస్తారని పార్టీలో చర్చ మొదలైంది.

 దసరాకు సీఎం కేసీఆర్ కవితకు గిఫ్ట్ ఇవ్వనున్నారా ?

దసరాకు సీఎం కేసీఆర్ కవితకు గిఫ్ట్ ఇవ్వనున్నారా ?

ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇంతకాలం రాజకీయాలకు దూరంగా సైలెంట్ గా ఉన్న కుమార్తె కవితకు సరైన సమయంలో సరైన స్థానంలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు . అంతేకాదు దసరా గిఫ్ట్ గా మంత్రి పదవి సిద్ధం చేశారని టాక్ వినిపిస్తుంది. కవిత రీ ఎంట్రీతో నిజామాబాద్ జిల్లాలో ఆమె అనుచరుల్లో సంతోషం కనిపిస్తుండగా, మరికొందరు గులాబి నేతలలో మాత్రం టెన్షన్ కనిపిస్తుంది.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక కానున్న కవితకు మంత్రిగా అవకాశం ఇస్తే నిజామాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి అవుట్ అన్న చర్చ జోరుగా సాగుతోంది.

నిజామాబాద్ లో పార్టీపై పట్టు కోసం .. నేరుగా కవిత రంగంలోకి

నిజామాబాద్ లో పార్టీపై పట్టు కోసం .. నేరుగా కవిత రంగంలోకి

రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ తో పాటుగా, నిజామాబాద్ జిల్లాలో పార్టీపై కూడా పట్టు సాధించాలని కవిత ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కవిత గత పార్లమెంట్ ఎన్నికల్లో అనుభవాల దృష్ట్యా స్వయంగా తానే రంగంలోకి దిగి ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని సమాచారం . విపక్ష ప్రజాప్రతినిధులకు ఆమె స్వయంగా టచ్ లోకి వెళ్తున్నారట. సునాయసంగా గెలిచే మెజార్టీ ఉన్నా.. రికార్డు మెజార్టీ లక్ష్యంగా పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నారని సమాచారం .

  Samyuktha Hegde : హీరోయిన్ Samyuktha పై సామాజికవేత్త Kavitha Reddy దాడి..!! || Oneindia Telugu
   కేసీఆర్ ఆలోచనేంటి ? కవితకు దసరాకు ఆ బంపర్ ఆఫర్ ఇస్తారా

  కేసీఆర్ ఆలోచనేంటి ? కవితకు దసరాకు ఆ బంపర్ ఆఫర్ ఇస్తారా

  రాష్ట్ర రాజకీయాల్లోశాసన మండలిలో అడుగు పెట్టి చక్రం తిప్పుతారని ,బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కవిత అనుచరగణం సంబరాలు జరుపుకుంటున్నారు . ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన కొద్ది రోజుల్లోనే దసరా పండగ రాబోతుండటంతో తనయకు దసరా గిప్ట్ గా మంత్రిని చేసి జిల్లాకు మంత్రి హోదాలో పంపిస్తే నిజామాబాద్ జిల్లాపై కవితకు మళ్ళీ పట్టు పెరుగుతుందని గులాబీబాస్ యోచనగా చెప్తున్నారు . పోయిన చోటే తిరిగి స్థానం పొందేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో కవిత పొలిటికల్ రీ ఎంట్రీ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు దసరాకు ఆ భారీ గిఫ్ట్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

  English summary
  Will CM KCR give a gift for Dussehra for daughter kavitha? Has the berth for kavitha been finalized in the KCR cabinet? kavitha is going to be a key leader state politics? Who is the minister that who will be out if kavitha enters the KCR cabinet? There is an interesting debate going on in the state of Telangana on the political entry of Kavitha as an MLC.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X