వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శీనుగాడిని ఎన్‌కౌంటర్ చేయండి : సీఎం కేసీఆర్‌కు వీహెచ్ డిమాండ్

|
Google Oneindia TeluguNews

యాదాద్రి : కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏ పొలిటిషీయన్, పోలీసు అధికారో కాదు ... సైకో శ్రీనుగాడిపై హాట్ కామెంట్స్ చేశారు. శీను ఎన్ కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మానవమృగం సమాజంలో తిరిగే హక్కు కోల్పోయిందని చెప్పారు. శీనును ఉరితీయాలని హజిపూర్ వాసులు బొమ్మాలరామారంలో చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరింది. ఈ సందర్భంగా వారికి వీహెచ్, కాంగ్రెస్ నేత గంగాభవానీ మద్దతు తెలిపారు.

 రెండోరోజుకు చేరిన దీక్ష

రెండోరోజుకు చేరిన దీక్ష

మనీషా, కల్పన, శ్రావణిపై లైంగికదాడి చేసి మట్టుబెట్టిన సైకో శ్రీనివాస్‌ను ఉరితీయాలని బొమ్మాలరామరంలో హజిపూర్ వాసుల దీక్ష రెండోరోజుకు చేరింది. వీరికి అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపారు. ఇవాళ కాంగ్రెస్ నేత వీహెచ్, గంగాభవానీ వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్ మీడియాతో మాట్లాడారు. సైకో శీనుపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి .. ఆకృత్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు. శీనును పోలీసుల చేత ఎన్ కౌంటర్ చేయించాలని సీఎం కేసీఆర్ ను కోరారు.

ముక్తకంఠంతో ఖండన

ముక్తకంఠంతో ఖండన

శీను ఆగడాలను మహిళసంఘాలు ఖండించాయి. మహిళలపై అఘాయిత్యం చేసిన శీనుకు భద్రత కల్పించడం ఏంటని మహిళ నేత రేఖ ప్రశ్నించారు. ఈ ఘటనపై వెంటనే ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శీను ఆకృత్యాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

లిప్ట్ మాటున లైంగికదాడి

లిప్ట్ మాటున లైంగికదాడి

యాదాద్రి జిల్లా హజిపూర్‌కు చెందిన శ్రీనివాస్ ... అమ్మాయిలకు లిఫ్ట్ ఇస్తూనే లైంగికదాడి పాల్పడిన సంగతి తెలిసిందే. తర్వాత ఎక్కడ తన పేరు బయటకొస్తుందోనని వారిని హతమార్చి బావిలో పడేశాడు. మనీషా, కల్పన అనే ఇద్దరు అమ్మాయిల ఊపిరి తీశాడు. అయితే వారి మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. శ్రావణి ఆఛూకీ కనిపించకపోవడంతో ... పేరెంట్స్ ఫిర్యాదు శ్రీనివాస్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మరో అమ్మాయి కూడా బలైందని పోలీసులు తెలిపారు. ఇంకా ఎవరైనైనా మట్టుబెట్టారా ? అనే అంశంపై పోలీసులు విచారిస్తున్నారు.

English summary
Senior Congress leader Hanumantha Rao once again made sensational comments. Asked the government to do the encounter srinivas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X