వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీడిపిలో ఆయ‌న పోటీ చేస్తారా..? పొత్తు ధ‌ర్మానికి క‌ట్టుబ‌డి త్యాగం చేస్తారా..?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: స‌హ‌నం, ఓర్పు, త్యాగం, నిధానం, నిబ‌ద్ద‌త‌, స‌మ‌న్యాయం, ప‌ర్వ‌సంగ‌ప‌రిత్యాగం..! ఏంటి ఈ ప‌దాలు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈ ప‌దాల‌న్నీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి అతికిన‌ట్టు స‌రిపోతాయి. ఒక‌ప్పుడు నేత‌ల‌ను నిర్ధేశించి సీట్లు పంచిన ఆ పార్టీ ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సీట్ల‌ను కాంక్షించే ప‌రిస్థితికి చేరుకుంది. అంతే కాకుండా హేమాహేమీలుగా పేరు తెచ్చుకున్న కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు పొత్తు ధ‌ర్మానికి క‌ట్టుబ‌డి కొన్ని నియోజ‌క‌ వ‌ర్గాల‌ను త్యాగం చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు య‌ల్ ర‌మ‌ణ ఈ సారి ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తారా..? ప్ర‌చారానికే పరిమిత‌మ‌వుతారా అనే అంశం పై ఆస‌క్తి నెల‌కొంది.

వ్యూహాల వాకిట్లో త్యాగాల మొక్క‌లు నాటుతున్న టీటీడిపి..!

వ్యూహాల వాకిట్లో త్యాగాల మొక్క‌లు నాటుతున్న టీటీడిపి..!

తెలుగుదేశం పార్టీ.. రెండు రాష్ట్రాల్లో రెండు విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఆ పార్టీ, తెలంగాణలో మాత్రం విప‌త్క‌ర‌ పరిస్థితిని చూస్తోంది. అందుకే ఈ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కారణంగానే కాంగ్రెస్ సహా మిగతా పార్టీలతో జతకట్టడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే మహాకూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి ఎన్నికల బరిలో దూకేందుకు తహతహలాడుతోంది. టీఆర్ఎస్‌ను మరోసారి గద్దెనెక్కించకుండా చేసేందుకు మిగతా పార్టీలతో కలిసి వ్యూహాలు సిద్ధం చేస్తుంది ఆ పార్టీ నాయకత్వం.

మహాకూటమి విజయం కోసం కొన్ని సీట్లు త్యాగం..! య‌ల్ ర‌మ‌ణ పోటీపై ఉత్కంఠ‌.!!

మహాకూటమి విజయం కోసం కొన్ని సీట్లు త్యాగం..! య‌ల్ ర‌మ‌ణ పోటీపై ఉత్కంఠ‌.!!

అంతేకాదు, మహాకూటమి విజయం కోసం కొన్ని సీట్లను కూడా త్యాగం చేయాలనుకుంటున్న టీడీపీలో ఆ పార్టీ కార్యకర్తలను కలవరపాటుకు గురి చేసే ఒక పరిణామం జరగబోతుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎల్ రమణ టికెట్ విషయంలో చాలా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇది టీడీపీ కార్యకర్తలను ఆయన అభిమానులను టెన్షన్‌కు గురి చేస్తోంది. అస‌లు అత్యంత ఉత్కంఠ‌భ‌రిత ప‌రిణ‌మాల మ‌ద్య జరుగుతున్న ఎన్నిక‌ల్లో ర‌మ‌ణ పోటీ చేస్తారా లేదా అనే అంశంపై కూడా ఉత్కంఠ‌ నెల‌కొంది.

ఓప‌క్క పొత్తు ధ‌ర్మం..! మ‌రో ప‌క్క అనుచ‌రుల ఒత్తిడి..! తేల్చుకోలేక పోతున్న ర‌మ‌ణ‌..!

ఓప‌క్క పొత్తు ధ‌ర్మం..! మ‌రో ప‌క్క అనుచ‌రుల ఒత్తిడి..! తేల్చుకోలేక పోతున్న ర‌మ‌ణ‌..!

మహాకూటమిలోని అన్ని పార్టీలకు చెందిన కీలక నేతల టికెట్ల విషయంలో క్లారిటీ వచ్చినా, ఎల్ రమణ విషయంలో మాత్రం ఎటువంటి అప్‌డేట్ రావడంలేదు. అందుకే ఈ మధ్య ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో అనుమానాలకు కారణం అవుతున్నాయి. జగిత్యాల స్థానాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, జగిత్యాల నుంచి ఆరుమార్లు గెలుపొందిన తాజా మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డికే కేటాయించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. అంతేకాదు, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆయనకు మద్దతు ఉంటుందని ప్రకటించారు.

కాంగ్రెస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌త్తు తెలిపిన ర‌మ‌ణ‌..! ఆయ‌న స్పూర్తికి జోహార్ అంటున్న కార్య‌క‌ర్త‌లు..!!

కాంగ్రెస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌త్తు తెలిపిన ర‌మ‌ణ‌..! ఆయ‌న స్పూర్తికి జోహార్ అంటున్న కార్య‌క‌ర్త‌లు..!!

అలాగే ఆయన గత ఎన్నికలో పోటీ చేసిన కోరుట్ల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నేతలు బాగా హడావిడి చేస్తున్నారు. ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు, ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ జంగిలి సునీత, మధుయాష్కి సన్నిహితుడైన డాక్టర్‌ రఘు, రుద్ర శ్రీనివాస్‌లు అక్కడి నుంచి టిక్కెట్‌ ఆశిస్తుండడంతో పాటు మాజీ మంత్రి రత్నాకర్‌రావు తనయుడైన నర్సింగారావు కూడా టిక్కెట్‌ ఇస్తానంటే కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతుండడంతో ఎల్ రమణ టికెట్‌పై సందిగ్ధం నెలకొంది. కాగా తెలుగుదేశానికి మంచి ప‌ట్టున్న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం నుండి య‌ల్ ర‌మ‌ణ‌ను పోటీ చేయాల్సిందిగా ఆయ‌న అనుచ‌రులు ఒత్తిడి తెస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఎప్పుడూ కూల్ గా క‌నిపించే ర‌మ‌ణ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

English summary
Some senior leaders are committed to alliance and will even sacrifice some constituencies. Telangana Telugu Desam Party president L.Ramana will be in the fray for this time? Interest in the campaign ? the tension situation continuing in ttdp regarding l.ramana contesting in elections issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X