నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కవితపై పోటీకి కోదండరాం ఒప్పుకుంటారా ? కాంగ్రెస్ స్ట్రాటజీ ఇదేనా ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Will Kodanda Ram Contest Against Kavitha ? | Oneindia Telugu

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కెసిఆర్ తనయ కుంట్ల కవిత బరిలోకి దిగనుంది. అయితే కవితను ధీటుగా ఎదుర్కోగలిగే నాయకుల వేటలో పడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీజేఏసీ మాజీ చైర్మన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ను ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలో దించి ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే టీజేఎస్ అధినేత కోదండరాం తమ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని... తాము పోటీలో లేని చోట కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామనిప్రకటించారు. అయితే కోదండరాం పోటీ చేస్తారనే అంశంపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ పార్టీ... ఆయనకు పొత్తుల్లో భాగంగా ఒక సీటు కేటాయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఏ ఒక్కరు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మాజీ ఎంపీ మధుయాష్కీ ఆసక్తి చూపడం లేదు. మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి సైతం ఇక్కడి నుంచి పోటీకి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే అజారుద్దీన్ బరిలోకి దింపాలని కూడా కాంగ్రెస్ ఓ దశలో ప్రయత్నం చేసింది.

తెలంగాణ నుంచి రూ.లక్షకోట్లు రావాలి: బాబు సంచలనం, లోకసభ ఎన్నికల్లో పోటీపై ఏమన్నారంటేతెలంగాణ నుంచి రూ.లక్షకోట్లు రావాలి: బాబు సంచలనం, లోకసభ ఎన్నికల్లో పోటీపై ఏమన్నారంటే

Will Kodandaram agree to fight with Kavitha in lok sabha polls ? This is the Congress strategy ?

కానీ ఫైనల్ గా కోదండరామ్ ఐతే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది.ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను బరిలోకి నిలిపి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కోదండరాంతో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ కూడా ఉంది. అయితే తమ పార్టీ తరపున మరిన్ని స్థానాలకు పోటీ చేయాలని భావిస్తున్న కోదండరాం... నిజామాబాద్ బరిలో నిలిచేందుకు అంగీకరిస్తారా లేక కవిత తో పోటీనా అంటూ పక్కకి తప్పుకుంటారా అనేది వేచి చూడాలి.

English summary
Telangana Congress Party's strategic decision will be taken in the wake of leaders who can face the KCR's daughter Kavitha as a TRS party candidate from Nizamabad in the Telangana Lok Sabha election. former TJAC chairman and Telangana Janmashtami president Kodandaram, has been contest in the Lok Sabha polls and Congress decided to support him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X