వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌పై నాగబాబు వ్యాఖ్య: చిరంజీవికి ఝలకా, దారి మారుతోందా?

తనకు రాజకీయాల్లో ఏదైనా చేయాలనిపిస్తే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ద్వారానే చేస్తానని, ఆయనకు తన చేతనైన సాయం చేస్తానని మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనకు రాజకీయాల్లో ఏదైనా చేయాలనిపిస్తే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ద్వారానే చేస్తానని, ఆయనకు తన చేతనైన సాయం చేస్తానని మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.

ఇక మీ ఇష్టం!: చిరంజీవిని చూపించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరికఇక మీ ఇష్టం!: చిరంజీవిని చూపించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014లో తాను ఎవరికైతే మద్దతిచ్చారో ఆ టీడీపీ - బీజేపీలకు దూరం జరిగారు. కాంగ్రెస్ పార్టీ అంటే పవన్‌కు పడనప్పటికీ... ప్రత్యేక హోదా కోసం తన అన్నయ్య చిరంజీవి ఉన్న చేయి గుర్తుతో కలుస్తారా అనే చర్చ సాగుతోంది.

ఎందుకంటే, నాగబాబు నిత్యం అన్నయ్య చిరంజీవి వెంటే ఉంటారు. ఇటీవల నోట్ల రద్దు అంశం గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ సమయంలోను తన అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, తాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని అని చెప్పారు.

ఇంటర్వ్యూలో..

ఇంటర్వ్యూలో..

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. చిరంజీవి లేదా నాగబాబులు.. పవన్ కళ్యాణ్ పైన, ఆయన జనసేన పార్టీ పైన ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తారు. ఇరువురం ఓ లక్ష్యం కోసం పని చేస్తున్నామని, దారులు మాత్రమే వేరని చెబుతారు.

ఆ దారి ఒక్కటయ్యేనా?

ఆ దారి ఒక్కటయ్యేనా?

టిడిపి - బిజెపిలకి పవన్ కళ్యాణ్ దూరం అవుతుండటం.. నాగబాబు వ్యాఖ్యల నేపథ్యంలో చిరంజీవి - పవన్ కళ్యాణ్ దారి ఒక్కటయ్యేనా ఆనే చర్చ సాగుతోంది. పవన్ కాంగ్రెస్‌లో కలవనప్పటికీ.. తన అన్నయ్య చిరంజీవి ఉన్న కాంగ్రెస్ పార్టీతో 2019 ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకున్నా కుదుర్చుకోవచ్చని అంటున్నారు.

ఎవరెవరు కలుస్తారో?

ఎవరెవరు కలుస్తారో?

విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 2019 నాటికి పుంజుకున్నప్పటికీ టిడిపి, వైసిపిలకు ధీటుగా ఎదిగే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో టిడిపి - బిజెపి కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ - లెఫ్ట్ - జనసేనలు కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చునని అంటున్నారు.

పవన్ కోసం అందరూ..

పవన్ కోసం అందరూ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో దూరం పెంచుకోవద్దని టిడిపి సాధ్యమైనంత మేర చూస్తోంది. లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు ఆయన కోసం వేచి చూస్తున్నాయి. ఆయనతో పని చేయాలని భావిస్తున్నాయి. బీజేపీ ఒక్కటే ఆయనకు ధీటుగా స్పందిస్తోంది.

English summary
Will Jana Sena chief Pawan Kalyan and Congress leader Chiranjeevi work together?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X