• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొవిడ్-19 వ్యాక్సిన్ పై గుడ్, బిగ్ న్యూస్ -వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే -భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా

|

అమెరికా, చైనా, రష్యాలకు దీటుగా భారత్ లోనూ కరోనా విరుగుడు వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందరిలోకీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ సంస్థ ముందంజలో ఉంది. ''కొవాగ్జిన్'' పేరుతో ఆ సంస్థ రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్ రెండో దశకు చేరింది. సమర్థవంతమైన వ్యాక్సిన్ ను వీలైనంత దొందరగా తీసుకొస్తామన్న భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా కొవాగ్జిన్ ధరపై గుడ్ న్యూస్ అందించారు.

  Covaxin Human Trials News: Bharat Biotech's Coronavirus Vaccine ధరపై గుడ్ న్యూస్..!! || Oneindia

  చిట్టా విప్పిన విజయసాయిరెడ్డి - షాకింగ్ ఆరోపణలు - 48 గంటల డెడ్ లైన్ పై డెడ్లీ కామెంట్స్

  రూ.20 కంటే తక్కువకే?

  రూ.20 కంటే తక్కువకే?

  ‘‘భారత్ బయోటెక్ ఆధ్వర్యంలో కొవాగ్జిన్ పరిశోధనలు ఆశాజనకంగా సాగుతున్నాయి. వ్యాక్సిన్ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడటంలేదు. ముందుగా మన దేశంలో ఎలాంటి వ్యాక్సిన్ అందిస్తామో, ప్రపంచదేశాలకు సరఫరా చేసే వ్యాక్సిన్ కూడా అదే నాణ్యతతో ఉంటుంది. కొవాగ్జిన్ ధర విషయంలోనూ ఓ అంచనాకు వచ్చాం. వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకే వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తాం'' అని డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. భారత వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 70 శాతం వాటా హైదరాబాద్‌‌లోని 3 కంపెనీల నుంచే జరుగుతోందని, మార్కెట్‌లో పోటీదారులమైనప్పటికీ మూడు కంపెనీల టార్గెట్ కరోనాను జయించడమే ఆయన స్పష్టం చేశారు.

  పదే పదే ఢిల్లీకి పరుగులు..

  పదే పదే ఢిల్లీకి పరుగులు..

  కరోనా మహమ్మారిని మన ప్రభుత్వాలు కేవలం ఆరోగ్యపరమైన సంక్షోభంగానే చూస్తున్నాయని, అయితే ఇది, ఆర్థికపరంగానూ భారీ సంక్షోభమేనని భారత్ బయోటెక్ సీఎండీ అన్నారు. టీకాల అభివృద్ధిపై బయోటెక్ కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరపాలని, ప్రయోగాలు వేగవంతం కావాలంటే అందుకు తగిన అవసరాలను తీర్చడానికి సర్కారు ముందుకు రావాలని సూచించారు. ‘‘టీకా అభివృద్ధిలో భాగంగా ప్రతి చిన్న అనుమతి కోసం ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోంది. అలాంటి అవసరం లేకుండా ప్రాంతీయంగానే అనుమతులు మంజూరు చేసే వ్యవస్థల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముంది''అని డాక్టర్ కృష్ ఎల్లా అభిప్రాయపడ్డారు.

  కరోనాకు తొలి వ్యాక్సిన్ హైదరాబాద్‌ నుంచే - భార‌త్ బ‌యోటెక్ క్యాంపస్‌లో కేటీఆర్ - కీలక వ్యాఖ్యలు..

  మంత్రి కేటీఆర్‌తో కలిసి..

  మంత్రి కేటీఆర్‌తో కలిసి..

  హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడ‌క్ష‌న్ సెంట‌ర్‌ లో మంగళవారం నిర్వహించిన సదస్సులో ‘‘వ్యాక్సిన్ పై పోటీలో సైన్స్ - అత్యవసరం మధ్య పోటీ'' అంశంపై డాక్టర్ కృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైర‌క్ట‌ర్ శ‌క్తి నాగ‌ప్ప‌న్‌, బయోలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్ల, ఇండియన్ ఇమ్యూనలాజికల్ ఎండీ డాక్టర్ ఆనంద్ కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు. కొవిడ్-19 తొలి వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచి వస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

  English summary
  In an interesting announcement on covaxin, an upcoming covid-19 vacsin, Bharat Biotech cmd doctor Krishna Ella says its prise will be less than a water bottle. speaking at a summitt at hyderabad on tuesday along with Minister KTR, Bharat Biotech krishna ella made this comments.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X