వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి రాజీనామా: స్పీకర్‌ ఏం చేస్తారు?, చిక్కుల్లో కెసిఆర్...

రేవంత్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా ఆమోదించాల్సి వస్తుందా అనేది చిక్కు ప్రశ్నే.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రేవంత్ రెడ్డి తన శాసనసభా సభ్యత్వానికి కూడా రాజనామా సమర్పించారు. రాజీనామా చేస్తూ ఏకవాక్యంతో స్పీకర్‌కు లేఖను రాశారు. దాన్ని స్పీకర్‌కు, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపించారు.

రేవంత్ రెడ్డి రాజీనామాను తెలంగాణ శాసనసభా స్పీకర్ మధుసూదనాచారి ఆమోదిస్తారా, లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే, తన రాజీనామాకు గల కారణాలను రేవంత్ రెడ్డి నుంచి స్పీకర్ వివరణ కోరవచ్చు.

తన రాజీనామాకు గల కారణాలను రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖలో ప్రస్తావించలేదు. పార్టీకి చేసిన రాజీనామాను చంద్రబాబు, శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించాల్సి ఉంటుంది.

రేవంత్ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తే...

రేవంత్ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తే...

రేవంత్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా ఆమోదించాల్సి వస్తుందా అనేది చిక్కు ప్రశ్నే. తాను టిడిపి నుంచి గెలిచాను కాబట్టి, ఆ పార్టీకి రాజీనామా చేసినప్పుడు శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడం నైతిక బాధ్యతగా భావించానని రేవంత్ రెడ్డి చెప్పవచ్చు.

తెలుగుదేశం

తెలుగుదేశం

తెలుగుదేశం నుంచి గెలిచి తెరాసలో చేరిన శాసనసభ్యులు పలువురు ఉన్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ అయితే ఏకంగా మంత్రి పదవినే చేపట్టారు. వారంతా శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశామని, స్పీకర్ వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వారిని చిక్కుల్లో పడేసినట్లే భావించాల్సి వస్తుంది.

చిక్కుల్లో కెసిఆర్

చిక్కుల్లో కెసిఆర్

శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును చిక్కుల్లో పడేసినట్లే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన పార్టీలో చేరిన తెలుగుదేశం, కాంగ్రెసు ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా కెసిఆర్ ఆమోదింపజేసుకుంటే, సాధారణ ఎన్నికలకు ముందే ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.

రాజీనామాను ఆమోదించిన తర్వాత....

రాజీనామాను ఆమోదించిన తర్వాత....

సాధారణ ఎన్నికలకు ముంందే రేవంత్ రెడ్డి తన కొడంగల్ నియోజకవర్గానికి ఉప ఎన్నికను ఆహ్వానిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ రాజీనామాను ఆమోదించిన తర్వాత ఆరు నెలల లోపల ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఆయనతో పాటు మిగతావారి రాజీనామాలను ఆమోదిస్తే సాధారణ ఎన్నికలకు ముందు మినీ ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తుంది. అది కెసిఆర్‌కు అగ్నిపరీక్ష, రేవంత్ రెడ్డికి పరీక్ష కావచ్చు. అయితే, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు మాత్రమే ఈ విషయాలపై స్పష్టత ఇవ్వగలరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Is Revanth Reddy cornered Telangana CM and Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao by resigning to MLA post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X