వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ పీసీసీ చీఫ్‌గా శ్రీధర్ బాబు ? ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉత్తమ్ ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో త్వరలో మార్పులు జరగనున్నాయా అంటే ఔననే సమాధానం వస్తోంది. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ను తప్పించి .. శ్రీధర్ బాబుకు బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. పీసీసీ చీఫ్ మార్పుతోనైనా పార్టీ బలోపేతంపై మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉందని గాంధీభవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

will t pcc chief sridhar babu ?

జోరుగా గుసగుసలు ..
ఈ క్రమంలోనే మంగళవారం గాంధీభవన్ లో ఉత్తమ్, శ్రీధర్ బాబు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఇకపై బీ ఫామ్ లు ఇచ్చేది నువ్వే కదా అని శ్రీధర్ బాబుతో ఉత్తమ్ అన్నారు. దీనిని బట్టి పీసీసీ చీఫ్ మార్పు ఖాయమని అర్థమవుతోంది. అందుకు ప్రతీగా శ్రీధర్ బాబు పైనుంచి పంపేది నువ్వే కదా అని కామెంట్ చేశారు. శ్రీధర్ వ్యాఖ్యలతో కూడా ఎంతో కొంత నిజం ఉంది. ఉత్తమ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

రాజీనామా ?
రెండురోజుల్లో టీ పీసీసీ పదవీకి ఉత్తమ్ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో శ్రీధర్ ను నియమిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తమ్ ను ఖాళీగా ఉంచకుండా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవీ అప్పజెప్పుతారని తెలుస్తోంది. అయితే ఇటీవల జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశమైంది. టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ఉంటారని .. ఆయనను మార్చరని స్పష్టంచేశారు. ఒకవేళ మార్చితే శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం పేర్లను ప్రస్తావించారు. అంటే ఆయనకు ముందే అధ్యక్షుడి మార్పు గురించి తెలుసా అనే ప్రశ్న తలెత్తుతుంది. అందులో శ్రీధర్ పేరు కూడా ఉండటం కూడా అనుమానాలకు బలం చేకూరింది. దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చిందా ? లేదా జగ్గారెడ్డి విశ్వసనీయ సమాచారం ఆధారంగా పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించి ప్రస్తావించారా అనే సందేహాం వస్తోంది. అయితే దీనంతటికి మరో రెండురోజుల్లో తెరపడే అవకాశం ఉంది.

English summary
Is there a change in the Telangana Congress soon? Speaking to PCC chief Uttam, speculation about Sridhar Babu will be handed over to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X