వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్తాం .. నా భార్యదే గెలుపు - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 వరకు కొనసాగుతుండగా, మొత్తం 2,779 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరగతున్నాయి. ఈ మూడు స్థానాల కోసం అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పోటీ పడుతున్నాయి.

రవి ప్రకాష్ కోసం బెంగళూరు, గుజరాత్ లలో పోలీసుల గాలింపు .. ఇంతకీ రవి ప్రకాష్ ఎక్కడ ?రవి ప్రకాష్ కోసం బెంగళూరు, గుజరాత్ లలో పోలీసుల గాలింపు .. ఇంతకీ రవి ప్రకాష్ ఎక్కడ ?

2016లో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా పట్నం నరేందర్‌రెడ్డి, వరంగల్‌ నుంచి కొండా మురళి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు విజయం సాధించారు. అయితే, డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, కొండా మురళి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. దీంతో ఈ మూడు స్థానాలకు మళ్లీ ఎన్నిక అనివార్యమైంది. తాజాగా వీటికి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి బరిలోకి దిగారు. ఇక కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఇక ఎవరికి వారు వ్యూహాత్మకంగా క్యాంపు రాజకీయాలు చేశారు.

will taught a lesson to KCR .. my wife is going to win - MLA Komatireddy Rajagopal reddy

అయితే ఈ ఎన్నికల్లో విజయం తమదేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ కు పార్లమెంటు ఎన్నికల్లోలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లోలా సత్తా చాటుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు . తన సతీమణి ఎమ్మెల్సీగా గెలుస్తుందని ఆయన చాలా ధీమాగా ఉన్నారు . స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ పార్టీ హీనంగా చూస్తోందని కనుక వారి మద్దతు తమకే ఉంటుందని ఆయన భావిస్తున్నారు. సర్పంచ్ లకు ఇంతవరకు చెక్ పవర్ కూడా ఇవ్వలేదని విమర్శించిన ఆయన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం తమదేనని గట్టిగా చెప్తున్నారు.

English summary
Komatireddy Rajagopal Reddy is confident of winning the MLC elections in local bodies. Congress MLA Komatireddy Rajagopal Reddy said that local bodies members taught a lesson to KCR in this election . As in MLA election now in MLC by election congress will be going to show their power Rajagopal reddy said . His wife lakshmi will wimn in this election he mentioned. TRS party is treating the local bodies members very worse .. so, they are going to support Congress Rajagopal reddy stated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X