
కేసీఆర్ దేశ్ కీ నేత అవుతారా? ఆయన వెంట నడిచే వారెవరు? ఆసక్తికర చర్చ
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వచ్చే వారం భారత్ రాష్ట్రీయ సమితి ఏర్పాటు ప్రక్రియ ను ప్రారంభించనున్నారు. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు కెసిఆర్ ఢిల్లీ వేదికగా ఈ సంచలన ప్రకటన చేయబోతున్నారని ఇప్పటికే తెలిసిన విషయమే. ఇదే సమయంలో కెసిఆర్ జాతీయ పార్టీ పై, ఆయనతో నడిచేవారు ఎవరు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

జాతీయ కార్యవర్గం కోసం కేసీఆర్ కసరత్తులు
జాతీయ
పార్టీగా
భారత్
రాష్ట్రీయ
సమితిని
ఏర్పాటు
చేయాలని
భావిస్తున్న
సీఎం
కేసీఆర్
ప్రస్తుతం
జాతీయ
కార్యవర్గాన్ని
ప్రకటించడం
కోసం
కసరత్తులు
చేస్తున్నారు.
కనీసం
దేశంలోని
సగం
రాష్ట్రాలకైనా
ఇంచార్జ్
లను
ప్రకటించాలని
కెసిఆర్
భావిస్తున్నట్లు
సమాచారం.
అయితే
వివిధ
రాష్ట్రాలలో
కెసిఆర్
జాతీయ
పార్టీని
నమ్ముకుని
ఆయన
పార్టీలోకి
వచ్చే
వారు
ఎవరు
అన్నది
ఆసక్తికరంగా
మారింది.

కెసీఆర్ ప్రయత్నానికి ప్రాంతీయ పార్టీలు మద్దతునిస్తాయా?
ఇప్పటికే కెసిఆర్ అనేకమార్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల కీలక నేతలతో సమాలోచనలు జరిపారు. ఇక కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి వివిధ రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రయత్నిస్తే ఆయా ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తాయా అన్నది తెలియాల్సి ఉంది. అంతేకాదు దేశ్ కి నేత కేసీఆర్ అని అన్ని రాష్ట్రాలలోనూ కెసిఆర్ పై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న క్రమంలో కెసిఆర్ ప్రభావం వివిధ రాష్ట్రాలలో ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికర అంశంగా మారింది.

దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ లుగా కేసీఆర్ సెలెక్ట్ చేసిన వారిపై ప్రచారం
ఆయా రాష్ట్రాలలో ప్రజలపై ప్రభావం చూపగలిగిన వారిని, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న వారిని గుర్తించి, బిజెపికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించగలిగినవారిని కెసిఆర్ తన పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్ప చెప్తారని భావిస్తున్నారు. ఈ విషయంలో కెసిఆర్ స్పష్టత లోనే ఉన్నారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాలలో పార్టీకి ఇంచార్జ్ లను ప్రకటిస్తారని భావిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండవల్లి అరుణ్ కుమార్, కర్ణాటక రాష్ట్రానికి ప్రకాష్ రాజ్, తమిళనాడుకు విజయ్ లను ఎంపిక చేశారని ప్రచారం సాగుతుంది.

కేసీఆర్ కు ఉండవల్లి షాక్ .. ఇక ప్రకాష్ రాజ్, విజయ్ లు కష్టమేనా ?
అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాను అని ప్రకటించారు. ఇక ప్రకాష్ రాజ్ పార్టీ బాధ్యతలు తీసుకుంటారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ప్రస్తుతం ప్రకాష్ రాజు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. ఇక విజయ్ రాజకీయాల్లోకి ఇంకా అడుగు పెట్టలేదు. ఒకవేళ ఆయన అడుగుపెట్టినా కెసిఆర్ పార్టీలో చేరతారన్న నమ్మకం లేదు. విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో ఆయనే సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉంది.

కెసీఆర్ పార్టీ కోసం ముందుకు వచ్చే వారెవరు?
ఇక
ఈ
సమయంలో
వివిధ
రాష్ట్రాలలో
కెసిఆర్
తో
కలిసి
ముందుకు
నడిచే
కీలక
నేతలు
ఎవరు
అన్నది
ఆసక్తికర
అంశంగా
మారింది.
జాతీయ
స్థాయి
రాజకీయాల్లో
కేసీఆర్
సక్సెస్
కావాలంటే
ముందు
రాష్ట్రాలను
నియమించే
ఇన్చార్జులు
ప్రభావం
చూపగలిగే
వారుగా
ఉండాలి.
బలమైన
వ్యక్తులుగా
ఉండాలి.
ఇక
అలాంటి
వారు
కేసీఆర్
పార్టీలోకి
ఎవరు
వస్తున్నారు
అన్నది
రాజకీయవర్గాలలో
ఆసక్తికరంగా
మారింది.
వివిధ
రాష్ట్రాల్లో
కేసీఆర్
తో
సమాలోచనలు
జరిపిన
ప్రాంతీయ
పార్టీల
నాయకులు
కూడా
ఆయా
రాష్ట్రాలలో
కెసిఆర్
పార్టీ
విస్తరణను
ఎలా
తీసుకుంటారు
అన్నది
ఆసక్తికర
అంశం.