• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త ఊపిరి పోసిన ఎంపీలు పార్టీని బలోపేతం చేస్తారా ?

|

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులతో కుదేలవుతున్న కాంగ్రెస్‌కు ఆ ముగ్గురు ఎంపీలుగా గెలిచి ఊపిరి పోశారు . లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని అని గట్టిగా చెప్పారు. ముగ్గురు నాయకులు ఎవరికి వారే హేమాహేమీలు ..మరి వీరు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారా ? కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొంటారా ? మరి ఆ ముగ్గురు మూకుమ్మడిగా పనిచేస్తారా..? అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నం అవుతుంది.

కేసీఆర్ ను వదలను .. ఎదిరించేవారు లేకుంటే బెదిరించే వారిదే రాజ్యం అన్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీలు హేమాహేమీలే

కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీలు హేమాహేమీలే

ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో హోరాహోరీగా పోరాడి తెలంగాణ కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో విజయం సాధించింది. నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్‌కు గట్టి షాక్‌ ఇచ్చి విజయ కేతనం ఎగురవేశారు . అయితే పార్టీలో ఈ ముగ్గురూ ధీటైన నాయకులే . ఎవ్వరినీ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి . ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ గా గుర్తించబడిన నాయకుడైతే, కోమటి రెడ్డి ఎవరి మాట వినని సీతయ్య , ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడైనా చక్రం తిప్పగల నాయకుడు.

పార్టీలో ఆధిపత్య పోరు... ముగ్గురు ఎంపీలు డామినేషన్ చేసే నాయకులే

పార్టీలో ఆధిపత్య పోరు... ముగ్గురు ఎంపీలు డామినేషన్ చేసే నాయకులే

అందరూ సమర్ధులైన నాయకులే. కానీ అందరూ కలిసి ఒక మాట మీద పని చేస్తే తెలంగాణలో అధికార పక్షానికి కాస్త ప్రతిపక్షం ఉంది అన్న ఆలోచన అయినా ఉంటుంది. కానీ వీరు ముగ్గురూ ఎవరికి వారే యమునా తీరేనని , మిగతావారిని పట్టించుకోరని ఎవరి ఆధిపత్యం కోసం వారు ప్రయత్నిస్తూనే ఉంటారనే వాదన ఉంది. పార్టీలో పట్టు నిలుపుకునేందుకు కూడా ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తారనే ఆరోపణలు ముగ్గురి మీదా ఉన్నాయి.ముఖ్యంగా నాలుగేళ్లుగా టీపీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌ పార్టీ హైకమాండ్‌లో మంచి పట్టున్న నేత . ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారనే విమర్శ ఉత్తమ్ విషయంలో పార్టీలో వ్యక్తమవుతోంది . ఉత్తమ్ ఏం చేసినా నడుస్తుందనే విమర్శ కూడ పార్టీలో వినిపిస్తుంది. ఇక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎవరు ఏం చెప్పినా వినరు . కోపం వస్తే సొంత పార్టీ నాయకులనే కడిగిపారేస్తారు. అలాగే పార్టీలో తనకంటే సీనియర్ ఎవరు లేరని పీసీసీగా తనకు అవకాశం ఇవ్వాలని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు . కోమటిరెడ్డి ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలియదనే చర్చ పార్టీలో నడుస్తుంది.

కలిసి పని చేస్తే పార్టీ బలోపేతం .. ఏం చేస్తారో ?

కలిసి పని చేస్తే పార్టీ బలోపేతం .. ఏం చేస్తారో ?

ఇక ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి పార్టీలో చేరేముందే హై కమాండ్ నుంచి అన్నిరకాల హామీలు తీసుకొని వచ్చారని చెబుతారు. అయితే పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు రేవంత్ కు కాస్త ఇబ్బందిగా మారినా రేవంత్ మాత్రం తనదైన శైలిలో ముందు పోతుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఎంపీగా గెలవడంతో రాష్ట్ర పార్టీలో తనదైన ముద్ర వేసేందుకు పావులు కదుపుతున్నారు. పీసీసీపై ఆసక్తి ఉన్న రేవంత్‌ అవకాశం ఇస్తే సత్తా చాటేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా తన సన్నిహితుల ద్వారా ఇస్తున్నారని తెలుస్తోంది. ఇలా ముగ్గురూ హేమాహేమీలే మరి వీరు ముగ్గురు కలిసి పనిచేస్తారా..? పార్టీని బలోపేతం చేస్తారా..? అన్నదే అనుమానంగా మారింది. కలిసి పని చేస్తే పార్టీని బలోపేతం చేసే అవకాశం వుంది. కానీ అది కాంగ్రెస్ , గెలిచినా ముగ్గురు ఉద్దండులే.. ముందు ముందు ఏం జరగనుందో ..? పార్టీని ఏం చేయ్యనున్నారో తెలియాల్సి ఉంది.

English summary
The three MPs won form the congress party are talented. If the three work together party will get strengthen ,but three of this are trying to dominate each other. PCC chief Uttam kumar reddy from Nalgonda, komati reddy Venkata reddy from Bhuvanagiri ,Revanth reddy from Malkajgiri won as MP's.If these three members unite they can keep check against the TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X