చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫెడరల్ ఫ్రంట్ లో ఆ పార్టీలు కలుస్తాయా ? వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమేనా ? టీఆర్ఎస్ ధీమా ఏంటి ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమేనా ? టీఆర్ఎస్ ధీమా ఏంటి ? || Oneindia Telugu

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కోసం అడుగులు వేస్తున్నారు. దేశంలో మోడీ, రాహుల్ గాంధీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఉండాలని భావిస్తున్న కేసీఆర్ పావులు కదుపుతున్నారు. కానీ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ అవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న వేళ ఆసక్తికర చర్చకు తెరతెస్సింది టీఆర్ఎస్ పార్టీ.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు షాక్ ఇచ్చిన దేవెగౌడ .. కాంగ్రెస్ తోనే తమ ప్రయాణం అని వెల్లడికేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు షాక్ ఇచ్చిన దేవెగౌడ .. కాంగ్రెస్ తోనే తమ ప్రయాణం అని వెల్లడి

కేంద్ర రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ చక్రం తిప్పబోతుంది అని ఫీలర్లు వదులుతున్న టీఆర్ఎస్

కేంద్ర రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ చక్రం తిప్పబోతుంది అని ఫీలర్లు వదులుతున్న టీఆర్ఎస్

ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి మద్దతు కోరారు సీఎం కేసీఆర్ . డీఎంకే చీఫ్ స్టాలిన్ ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం కావాలని కోరి పరువు పోగొట్టుకుని వచ్చారు . ఇక తాజాగా జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని హెచ్. డి దేవెగౌడ కూడా తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని చెప్పి షాక్ ఇచ్చారు. దీంతో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది అని అంతటా చర్చ జరుగుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతుంది అంటూ ఫీలర్లు వదులుతున్నారు. అందులో భాగంగానే తమ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్.

ఫెడరల్ ఫ్రంట్ లో ఈ పార్టీల భాగస్వామ్యం ఉంటుందంటున్న టీఆర్ఎస్

ఫెడరల్ ఫ్రంట్ లో ఈ పార్టీల భాగస్వామ్యం ఉంటుందంటున్న టీఆర్ఎస్

టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ తమ స్టాండ్ ఎప్పటికీ ఫెడరల్ ఫ్రంటేనని తెలిపారు. ఫ్రంట్ పార్టీలు మే 23న అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతృత్వంలో తెర మీదకు వచ్చే ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామ్యంలో ఉండే పార్టీలు ఇవేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపాయి. బీఎస్పీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ ఫెడరల్ ఫ్రంట్ లో కలుస్తాయని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ చెప్పుకొచ్చారు. కానీ ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉన్న నేపధ్యంలో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ , వైసీపీలు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇస్తాయా అన్నది చూడాల్సి ఉంది . ఒక పక్క తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చంద్రబాబు తో కలిసి బీజేపీయేతర కూటమిని లీడ్ చేస్తుంటే చంద్రబాబును కాదని మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం కావటం సాధ్యమేనా ? . బీఎస్పీ, ఎస్పీలు సైతం ఫెడరల్ ఫ్రంట్ వైపు ఇప్పటి వరకు మొగ్గు చూపిన దాఖలాలు లేవు. ఇక వైసీపీ కేంద్రంలో జాతీయ పార్టీలకే మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది .ఒకపక్క దీదీ, మరోపక్క మాయావతి మోడీకి ప్రత్యామ్నాయం మేమే అంటుంటే మరి ప్రధాని పదవి కోసం జరిగే కుర్చీలాటలో చివరికి విజేత ఎవరో .

 ఆ నాలుగు పార్టీల భాగస్వామ్యం మరిన్ని పార్టీలను ఫ్రంట్ లో చేరుస్తుందంటున్న టీఆర్ఎస్ ధీమా

ఆ నాలుగు పార్టీల భాగస్వామ్యం మరిన్ని పార్టీలను ఫ్రంట్ లో చేరుస్తుందంటున్న టీఆర్ఎస్ ధీమా

అయితే ఫెడరల్ ఫ్రంట్ తో ఈ పార్టీల భాగస్వామ్యం ఉంటుందని చెప్తున్న నేపధ్యంలో ఈ పార్టీలకు దక్కే సీట్లను చూసిన తర్వాత ఫ్రంట్‌కు మరిన్ని పార్టీల మద్ధతు లభించడం కూడా ఖాయమేనని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ చెప్పారు. అప్పటికీ తగినంత మెజారిటీ రాకపోతే.. కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్ధతిచ్చేందుకు ఓకే అంటే ఆ పార్టీ సహకారాన్ని తీసుకునేందుకు కూడా తాము సిద్ధమేనని రసూల్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న నేపధ్యంలో కేంద్రంలో చక్రం తిప్పాలని ఫెడరల్ ఫ్రంట్ భావిస్తోంది. చూడాలి మరి ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ ధీమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో.

English summary
Following the Lok Sabha elections in Telangana as part of the Federal Front discussions, KCR was asked to support by Kerala CM Pinarayi Vijayan. DMK chief Stalin was forced to join the federal front and KCR has lost his dignity by this act . Thus, there is a debate over whether the Federal Front's attempts are yet to stop by the CM KCR , but there is a cycle saying that after election results in central politics the federal front is going to start. TRS chief whip Abid Rasool Khan said that his party chief KCR would form non-Congress, non-BJP government and BSP, SP ,Thrunamool congress and YCP will support to fedaral front in coming days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X