వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొఫెస‌ర్ పోటీ చేస్తారా..? నేత‌ల‌కు విజ‌య గాధ‌లు బోదిస్తారా..? స‌ర్వ‌త్రా స‌స్పెన్స్..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్థుబాటు అంశం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాలు మ‌రిపిస్తుంటే జ‌న‌స‌మితి అధినేత కోదంగ‌రాం పోటీ చేసే అంశం అంత‌కు రెట్టింపు ఉత్కంఠ‌ను రేపుతోంది. అదికార గులాబీ పార్టీని ఎలాగైనా గ‌ద్దెదించాల‌ని ఏక‌మ‌వుతున్న విపక్ష పార్టీల్లో ఎవ‌రికి ఏ సీటు వ‌రిస్తుందో చెప్ప‌డం క‌ష్టంగా మారింది. కూట‌మిలో కీల‌కంగా మారిన కోదండ‌రాం ప్ర‌స్థానం కూడా అయోమ‌యంగా మారింది. తాను ఎక్క‌డ‌నుండి పోటీ చేస్తారు, త‌నకు కేటాయించ‌బోయే సీట్లు ఎన్ని అనే అంశం పై ఇంకా సస్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. కోదండ‌రాం ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తారా లేక నేత‌ల‌కు విజ‌య‌గాథ‌లు బోదిస్తారా అనే అంశం తేలాల్సిఉంది.

ఉద్య‌మంలో అన్నీ తానే..! ఇప్పుడు మాత్రం ఒంట‌రి..!

ఉద్య‌మంలో అన్నీ తానే..! ఇప్పుడు మాత్రం ఒంట‌రి..!

తెలంగాణ జ‌న‌స‌మితి అధినేత కోదండ‌రాం ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా..? వ్యూహ‌ర‌చ‌న‌తో చ‌క్రం తిప్పుతారా..? స‌మాధానం లేని ప్ర‌శ్న‌గా మారింది. తెలంగాణ ఉద్య‌మంలో అన్నీ తానై, స‌క‌ల జ‌న‌స‌మ్మె వ‌ర‌కూ విజ‌యవంతం చేసి, మిలీనియం మార్చ్‌తో పాల‌కుల‌కు వ‌ణుకు తెప్పించిన కోదండ‌రాం కు సొంత రాష్ట్రంలో ఉద్య‌మం న‌డిపేందుకు అవ‌కాశం చిక్క‌లేదు. ఉద్య‌మ‌నేత‌గా ఉన్న కేసీఆర్ సీఎం పీఠం అధిరోహించ‌గానే దొర‌పెత్త‌నం చెలాయిస్తున్నారంటూ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఉద్య‌మంలో ముందువ‌ర‌స‌లో ఉన్నారు..! ఇప్పుడు బ‌ద్ద శ‌త్రువులుగా మారారు..!!

ఉద్య‌మంలో ముందువ‌ర‌స‌లో ఉన్నారు..! ఇప్పుడు బ‌ద్ద శ‌త్రువులుగా మారారు..!!

నిరుద్యోగుల స‌మ‌స్య‌పై ఆయ‌న త‌ల‌పెట్టిన స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. పైగా ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నాచౌక్‌ను రాత్రికి రాత్రే ఎత్తేశారు. స‌భ‌కు అనుమ‌తినిస్తే శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల్పించిన‌ట్ల‌వుతుంద‌ని హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. దీంతో క‌న్నెర్ర చేసిన కోదండ‌రాం మేధావుల‌ను కూడ‌గ‌ట్టి తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీతో కొండ‌లాంటి కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌హాకూట‌మి తో క‌ల‌సి బ‌రిలోకి నిలువ‌నున్నారు.మ‌రి ఆర్ధికంగా, సామాజికంగా కోదండం వెనుక న‌డిచేదెవ‌రు అనే అంశం పై ఆస‌క్తి నెల‌కొంది.

మ్రుదు స్వ‌భావి కోదండ‌రాం..! రాజ‌కీయాల్లో నెట్టుకొస్తారా..?

మ్రుదు స్వ‌భావి కోదండ‌రాం..! రాజ‌కీయాల్లో నెట్టుకొస్తారా..?

అత్యంత ఖ‌ర్చుతో కూడుకున్న‌ ఎన్నిక‌ల్లో కోదండ‌రాం వంటి మేధావులు నిల‌బ‌డి గెల‌వ‌గ‌ల‌రా అనే సందేహం కూడా లేక‌పోలేదు. ఇటువంటి స‌మ‌యంలో అసలు కోదండరాం పోటీపై నీలినీడ‌లు అలుముకున్నాయి. ప‌లుమార్లు మీడియా ప్ర‌తినిధుల‌తోనూ తాను ప్ర‌త్యక్షంగా పోటీచేసే విష‌య‌మై నోరుమెద‌ప‌లేదు. కూట‌మిలో త‌మ‌కు నాలుగు సీట్లు కావాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం. దీనిలో మాస్టారు వ‌రంగ‌ల్ వెస్ట్‌, జ‌న‌గామ‌, రామగుండం, ఉప్ప‌ల్ ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డో ఒక‌చోట పోటీ బ‌రిలోకి నిల‌వ‌టం ప‌క్కా అంటున్నారు.

అస‌లు పోటీ చేస్తారా..? ఉద్య‌మ‌నేత‌పై ఊహ‌కంద‌ని ఒత్తిళ్లు..!!

అస‌లు పోటీ చేస్తారా..? ఉద్య‌మ‌నేత‌పై ఊహ‌కంద‌ని ఒత్తిళ్లు..!!

అయితే ఇవ‌న్నీ కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మే..! ఆయ‌న నోటి నుంచి మాత్రం ఎటువంటి సంకేతాలు రాలేదు. అయితే గులాబీ పార్టీ నేత‌లు మాత్రం కోదండ‌రాం పై దూకుడు పెంచారు. ఉద్య‌మం న‌డిపిన స‌మ‌యంలో హ‌స్తం పార్టీను ఉద్య‌మ ద్రోహి పార్టీగా విమ‌ర్శించిన కోదండ‌రాం ఇప్పుడు అదే పార్టీతో క‌ల‌సి ముందుకు న‌డ‌వ‌టం తెలంగాణ ద్రోహం కాదా అంటున్నారు. రాజ‌కీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహ‌ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు వెళ్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో సున్నిత స్వ‌భావి ఐన కోదండ‌రాం ఎలా నెట్టుకొస్తార‌నేది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే..! కాబ‌ట్టి ప్రొఫెస‌ర్ దాదాపు పోటీకు దూరంగా ఉండి, నేత‌ల‌ను ముందుకు న‌డిపించ‌వ‌చ్చ‌ని స‌మాచారం.

English summary
Will the Telangana janasamithi Chairperson Kodandaram contest the elections? All of the Telangana movement and the Millennium March, which has shaken the rulers. Kodanda ram, is unlikely to drive the movement in their own state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X