స్టాలిన్ ను కేసీఆర్ అందుకు ఒప్పించారా - భేటీలో ఏం జరిగింది : ఐసీయూలో నరసింహన్..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు పర్యటన ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఆసక్తి కర చర్చగా మారుతోంది. కేసీఆర్ దేవాలయం సందర్శనకు వెళ్లటంతో పాటుగా తమిళనాడు సీఎం స్టాలిన్ తో సమావేశం జరిపారు. సీఎం కేసీఆర్ చెన్నైలో ఉన్న సమయంలో టీఆర్ఎస్ ముఖ్యనేత వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ చర్చ మొదలైంది. బీజేపీ-కాంగ్రెసేతర పార్టీలు కలిసి పని చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అందులో భాగంగానే..ఇప్పుడు స్టాలిన్ తో ఆయన సమావేశం జరిపారని సమాచారం.
ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ పై ఆసక్తి
దేశంలో
బలమైన
ప్రాంతీయ
పార్టీలను
దెబ్బతీయడం
ద్వారా
సుదీర్ఘకాలం
అధి
కారంలో
ఉండేందుకు
బీజేపీ
కుట్రలు
చేస్తోంది.
దీనిపై
ఉమ్మడి
పోరాటం
చేయాల్సిన
అవసరం
ఉంది.
బీజేపీని
అడ్డుకోవడానికి
ప్రాంతీయ
పార్టీలన్నీ
ఏకమవడం
అవసరమని
తమిళనాడు
సీఎం,
డీఎంకే
పార్టీ
అధినేత
స్టాలిన్‌తో
భేటీలో
ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్‌రావు
స్పష్టం
చేసినట్టు
తెలుస్తోంది.
తొలుత
కుటుంబ
సభ్యులతో
కలిసి
కేసీఆర్
నేరుగా
స్టాలిన్
నివాసానికి
వెళ్లారు.
అక్కడ
అందరూ
కలిసి
సమావేశం
అయ్యారు.
ఆ
తరువాత..ఇద్దరు
ముఖ్యమంత్రులు
కలిసి
సుమారు
గంటపాటు
జాతీయ,
ప్రాంతీయ
అంశాలపై
చర్చించారు.

కాంగ్రెస్ తో సుదీర్ఘ కాలంగా డీఎంకే
దేశం
లో
బీజేపీ,
కాంగ్రెస్
ఒకదానికొకటి
ప్రత్యామ్నాయం
కాదని
పేర్కొన్న
కేసీఆర్..
రాష్ట్రా
ల్లో
బలమైన
ప్రాంతీయ
పార్టీలు
అధికారంలో
ఉండటాన్ని
బీజేపీ
జీర్ణించుకోలేకపోతోందని
స్టాలిన్‌తో
పేర్కొన్నట్టుగా
తెలుస్తోంది.
అధికార
బలాన్ని
ఉపయోగిం
చి
బలమైన
ప్రాంతీయపార్టీలను
దెబ్బతీయడం
ద్వారా
సుదీర్ఘకాలం
అధికారంలో
ఉండా
లని
కుట్రలు
చేస్తోందనే
అభిప్రాయం
వ్యక్తం
చేసినట్లు
సమాచారం.
బీజేపీ
ఓ
పెద్ద
ప్రాంతీయ
పార్టీ
అని,
దక్షిణాదిలో
బీజేపీకి
బలమే
లేదని
స్పష్టం
చేసినట్టు
తెలిసింది.
దక్షిణాది
రాష్ట్రాల్లో
బీజేపీ
ఎట్టిపరిస్థితుల్లోనూ
బలపడకుండా
ఏవిధంగా
అడ్డుకోవాలనే
అంశంతోపాటు..
వచ్చే
ఎన్నికల్లో
కేంద్రంలోనూ
చెక్
పెట్టడానికి
ఏ
విధమైన
వ్యూహం
అనుసరించాలన్న
దానిపైనా
ఇరువురు
సీఎంలు
చర్చించినట్టు
సమాచారం.

నాన్ బీజేపీ - నాన్ కాంగ్రెస్ లక్ష్యంగా
దేశంలో
అపార
వనరులున్నా
వాటిని
సద్వినియో
గం
చేసుకుని,
సంపద
పెంచే
దిశగా
ప్రయత్నాలు
జరగడం
లేదని
స్టాలిన్‌తో
కేసీఆర్
పేర్కొన్నట్టు
తెలిసింది.
దేశవ్యాప్తంగా
నదీజలాలు
వృథాగా
సముద్రంలో
కలుస్తున్నాయని,
నీటిని
సరిగా
వినియోగించుకోలేనిస్థితి
నెలకొందని
అన్నట్టు
తెలిసింది.
నదుల
అనుసంధానం
ద్వారా
ఉత్తర,
దక్షిణ
భారత
దేశంలో
వ్యవసాయ,
పారిశ్రామిక
రంగాలు
సుసంపన్నమయ్యే
అవకాశం
ఉందని..
ఆ
దిశగా
టీఆర్ఎస్,
డీఎంకే
తీసుకోవాల్సిన
చొరవపై
చర్చించినట్టు
సమాచారం.
డీఎంకే
సంస్థాగత
నిర్మాణాన్ని
అధ్యయనం
చేసేందుకు
టీఆర్ఎస్
వర్కింగ్
ప్రెసిడెంట్
కేటీఆర్
నేతృత్వంలో
ఓ
బృందాన్ని
పంపిస్తామని
కేసీఆర్
పేర్కొన్నట్టు
తెలుస్తోంది.

యాదాద్రి దేవాయల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
ఇరు
రాష్ట్రాల్లోని
అభివృద్ధి,
సంక్షేమ
పథకాలు,
సారూప్యతలు,
రాజకీయ
పరిస్థితులు
కూడా
ఈ
భేటీలో
ప్రస్తావనకు
వచ్చినట్టు
తెలిసింది.
వచ్చే
ఏడాది
మార్చిలో
జరిగే
యాదాద్రి
ఆలయ
పునః
ప్రారంభోత్సవానికి
కుటుంబ
సభ్యులతో
సహా
రావాల్సిందిగా
స్టాలిన్‌ను
సీఎం
కేసీఆర్
ఆహ్వానించారు.
ప్రారంభోత్సవం
సందర్భంగా
వారం
రోజుల
పాటు
జరిగే
కార్యక్రమాలను
వివరించారు.
పురాతన
గుడులు,
గోపురాలతో
తమిళనాడు
ఆధ్యాత్మిక
పర్యాటకానికి
చిరునామాగా
ఉందని,
అదే
తరహాలో
యాదాద్రి
ఆలయాన్ని
తీర్చిదిద్దామని
చెప్పారు.

ఐసీయూలో నరసింహన్
మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహన్ అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో మాట్లాడే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయం లో..నాడు ఏపీ - తెలంగాణ మధ్య వివాదాల పరిష్కారంలో నరసింహన్ కీలక పాత్ర పోషించారు.

కేసీఆర్ తమిళనాడు పర్యటన పైన చర్చలు
ఇక, ఇటు కేసీఆర్ తో రెండు సార్లు.. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ తోనూ ముఖ్యమంత్రులుగా గవర్నర్ హోదాలో నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నరసింహన్ తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఇప్పుడు ఆయన కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. అయితే, కేసీఆర్ కోరుకుంటున్నట్లుగా స్టాలిన్ కాంగ్రెస్ కు దూరమై... కేసీఆర్ కొత్త ఫార్ములాకు మద్దతిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.