వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో 3 సీట్లు బరాబర్ గెలుస్తాం : కాంగ్రెస్ నేత వీహెచ్ ధీమా

|
Google Oneindia TeluguNews

Recommended Video

Exit Polls 2019 : తెలంగాణలో... 3 సీట్లు బరాబర్ గెలుస్తాం : వీహెచ్ || Oneindia Telugu

హైదరాబాద్ : ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇప్పుడే కాదు చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ లెక్కలు తప్పాయని చెప్తుంది. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారం చేపట్టడం కల్ల అని స్పస్టంచేస్తున్నారు ఆ పార్టీ నేతలు. యూపీఏకు మ్యాజిక్ ఫిగర్ వస్తోందని .. భాగస్వామ్య పక్షలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉంది.

తారు మారే ...

తారు మారే ...

2019 సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాలు తారుమారయ్యానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. ఎన్టీఏ కూటమికి 320 సీట్లు వస్తాయనే అంచనాలను తప్పుపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీనిచ్చిందని చెప్పారు. కనీసం 3 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ 16 సీట్లు సాధిస్తాయనే లెక్కలు తప్పని .. అది మరో మూడురోజుల్లో రుజువవుతుందని చెప్పారు. బీజేపీకి చెందిన కొన్ని సంస్థలు తప్పుడు సమాచారంతో తప్పుదారి పట్టించే ప్రయత్నమే ఎగ్జిట్ పోల్స్ అని దుయ్యబట్టారు.

బాజాప్తా పెడతాం ..

బాజాప్తా పెడతాం ..

పనిలో పనిగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు వీహెచ్. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెల్చిచెప్పారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ విసిరారు. నగర నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తరలించడం ఏంటని ప్రశ్నించారు. ఇది సరికాదని .. ప్రభుత్వ వైఖరి బలహీనవర్గాలను అవమానపరిచేలా ఉందని దుయ్యబట్టారు. ఇది సరికాదని .. ఇకనైనా తీరుమార్చుకోవాలని సూచించారు.

ఫోన్‌లో మాట్లాడటమేంటీ ?

ఫోన్‌లో మాట్లాడటమేంటీ ?

హజీపూర్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వీహెచ్. కన్నవారిని పోగోట్టుకున్న వారి బాధ ప్రభుత్వ పెద్దలకు ఏం తెలుసు అని ప్రశ్నించారు. సైకో శ్రీనుపై చర్యలు తీసుకోవాలని బాధితులు దీక్ష చేస్తుంటే .. కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. వారికి అండగా ఉన్నామని దీక్ష శిబిరానికి వెళ్లి భరోసా ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. మీరు ఫోన్‌లో మాట్లాడితే బాధితులకు ఏం భరోసానిచ్చిట్లు అవుతుందన్నారు. జిమ్మిక్కులు చేయడం మానుకోవాలని కేటీఆర్‌కు సూచించారు.

English summary
The results of the exit polls revealed that in many of the 2019 general elections, the results were reversed, senior Congress leader Hanumantharao said. At least 3 Lok Sabha seats were expressed to win. TRS can not count on 16 seats and it will prove in three days. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాలు తారుమారయ్యానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. కనీసం 3 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ 16 సీట్లు సాధిస్తాయనే లెక్కలు తప్పని .. అది మరో మూడురోజుల్లో రుజువవుతుందని చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X