వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ఆదివారం నుంచి వైన్స్ ఓపెన్..?, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ పేరుతో నోట్, ఖండించిన ఆబ్కారీ శాఖ.

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నేపథ్యంలో సకలం బంద్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి వైన్స్ ఏమీ మినహాయింపేమీ కాదు. కానీ మందు లేక మందుబాబుల నాలుక పిక్కుపోతోంది. ఇందూరులో ఇద్దరు చనిపోయారు. మిగతా చోట్ల కూడా ఆడపా దడపా మరణాలు సంభవిస్తున్నాయి. కొందరు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా కావాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం మద్యాహ్నం నుంచి వైన్స్ ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదనే ప్రచారం జరుగుతోంది.

ఫేక్ నోట్..

ఫేక్ నోట్..


ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ పేరుతో ఒక నోట్ కూడా విడుదలైంది. దానిని ఆబ్కారీ శాఖ ఖండించింది. ఆదివారం నుంచి మధ్యాహ్నం సమయంలో వైన్స్ తెరచి ఉంటాయని నోట్‌లో ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటుందని.. ఒక్కో వైన్ షాపు వద్ద ఐదుగురు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కాపలాగా తెలిపింది. మందు కొనుగోలు చేసే వారు.. ఇబ్బడి ముబ్బడిగా రాకుండా సోషల్ డిస్టన్స్ పాటించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.

 అదేం లేదు

అదేం లేదు


వైన్స్ షాప్ వద్ద నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించింది. ఆదివారం నుంచి వైన్స్ 3.30 గంటలపాటు తెరచి ఉంటాయని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ పేరుతో ఒక ఫేక్ ప్రకటన సోషల్ మీడియాలో వైరలవుతోంది. కానీ దీనిని ఆబ్కారీ శాఖ ఖండించింది. అలాంటి ప్రకటన విడుదల చేయలేదని తేల్చిచెప్పింది. కొందరు ఆకతాయిలు తేదీ మార్చి మరీ నోట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపింది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
 చర్యలు తప్పవు

చర్యలు తప్పవు


వైన్ షాప్ వద్ద నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే ఐపీసీ 386/1982 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా నోట్‌లో స్పష్టంచేసింది. దీనిపై ఆబ్కారీ శాఖ స్పందించింది. అలాంటి నోట్ విడుదల చేయలేమని.. ఎవరో తేదీ మార్చి పోస్ట్ చేశారని పేర్కొన్నది. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.

English summary
wine shop not open tomorrow in telangana excise and prohibition director said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X