వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుబాబులకు హోంశాఖ బ్యాడ్ న్యూస్, మే 3 వరకు నో లిక్కర్, లాక్‌డౌన్ ఉన్నచోట నో..

|
Google Oneindia TeluguNews

మందుబాబులకు కేంద్రప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ అమలు ఉన్న రోజులు వైన్ షాపులు తెరవబోమని స్పష్టంచేసింది. దీంతో మద్యం ప్రియుల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టైంది. వైరస్ కేసులు పెరుగుతోన్నా.. శనివారం నుంచి కొన్ని వ్యాపార సముదాయాలకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. కానీ ఇందులో వైన్స్ షాపులు, పబ్బులు, బార్ల డోర్స్ క్లోజ్ చేసింది. దేశంలో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. తర్వాత దానిని పొడిగిస్తే అప్పుడు కూడా వైన్ షాపులు తెరిచే అవకాశం లేదు.

రెండో విడత లాక్ డౌన్ పొడిగించిన కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. దీంతో మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రాల్లో పరిస్థితి గురించి ఈ నెల 27వ తేదీన సోమవారం ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో వైరస్ ప్రభావం, లాక్ డౌన్ పొడగింపుపై చర్చకొచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ పొడిగిస్తే మాత్రం వైన్ షాపులు తదుపరి గడువు వరకు క్లోజ్ చేసే అవకాశం ఉంది.

wine shop will be closed upto may 3rd: home minister office

వైన్ షాపులు షాప్ అండ్ ఎస్టాబ్లిస్ట్ మెంట్ యాక్ట్ ప్రత్యేక చట్టం కిందకి వస్తాయి. కానీ రాష్ట్రాలు/కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాల పరిధిలో గల గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో మద్యం విక్రయం నిలిచిపోతుందని హోంశాఖ పేర్కొన్నది. లాక్ డౌన్ అమల్లో లేని చోట మాత్రం వైన్ షాపులు తెరుచుకోవచ్చని హోంశాఖ స్పష్టంచేసింది. అయితే ఆ ప్రాంతం కరోనా ఫ్రీ అయి ఉండాలి. మరోవైపు రెడ్ జోన్, హాట్ స్పాట్ కేంద్రాల్లో మిగతా షాపులకు కూడా హోంశాఖ అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే.

Recommended Video

Coronavirus Lockdown : Home Ministry Allows Reopening Of All Shops, Coditions Apply!

English summary
wine shop will be closed upto may 3rd home minister office said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X