వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడినా గెలిచినా తన జీవితం ప్రజాసేవకే అంకితం అంటున్న కేసీఆర్ తనయ కవిత

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. ఊహించని ఈ పరిణామం టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగించింది. ఇక తాను నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంపై టీఆర్ఎస్ నేత, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా తన జీవితం ప్రజలకే అంకితమన్నారు. తన కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు .

నిజామాబాద్ లో కేసీఆర్ తనయ కవిత ఓటమి .. కారణాలు ఇవేనా ?నిజామాబాద్ లో కేసీఆర్ తనయ కవిత ఓటమి .. కారణాలు ఇవేనా ?

ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం ఇచ్చిన నిజామాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు.. ఎన్నికల్లో గెలుపొందిన అర్వింద్‌కు శుభాకాంక్షలు.. నా గెలుపు కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కవిత ట్వీట్ చేశారు. ఇక తన జీవితం ప్రజాసేవకే అంకితం అని ఆమె పేర్కొన్నారు. పసుపు రైతులు పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచిన నిజామాబాద్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది.

 winning or losing her life is dedicated to the public service .. KCR daughter Kavitha said

ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కవితపై బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ 62 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. పసుపు రైతులు పెద్ద సంఖ్యలో బరిలోకి దిగటం , టీఆర్ఎస్ ఎలాగైనా విజయం సాధిస్తుంది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వెరసి కవిత ఓటమి పాలయ్యారు. సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఓడిపోవడంతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది .

English summary
TRS leader and KCR daughter Kalvakuntla Kavitha responded to the defeat of Nizamabad Lok Sabha election. she tweeted in twitter that Her life is dedicated to the people, even when winning, or lose Thanks to the activists who worked for her. Thanks to the people of Nizamabad who gave me the opportunity to serve for more than five years .. Congratulations to Arvind, who won the elections Kavitha said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X