వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్సిట్ పోల్స్ తో ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గాయ‌ప‌రిచారు..! ల‌గ‌డ‌పాటి పై ఈసీకి ఫిర్యాదు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఆంద్ర ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారో అంచ‌నా ఫ‌లితాలు చెప్పి బోక్క బోర్లా ప‌డిపోయారు ల‌గ‌డ‌పాటి. ఆయ‌న బ‌య‌ట పెట్టిన అంచ‌నాలు త‌ల‌కిందులు కావ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపంలో రాజ్ గోపాల్ కి మ‌రో స‌మ‌స్య ఒచ్చి ప‌డింది. ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఫ‌లితాల వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నో బావాలు దెబ్బ‌తిన్నాయ‌ని, ప్ర‌జ‌ల మ‌నోస్తైర్యంతో ఆట‌లాడుకోవ‌డ‌మే కాకుండా, రాజ‌కీయ నేత‌ల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసార‌ని, అందుకు రాజ్ గోపాల్ పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ కి ఫిర్యాదు అందింది. దీంతో ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఎప్పుడు ఏ రూపంలో ప్ర‌తిస్పందిస్తుందోన‌ని ల‌గ‌డ‌పాటి టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

 ఎగ్సిట్ పోల్స్ పేరుతో చెల‌గాటం..! ల‌గ‌డ‌పాటి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈసికి ఫిర్యాదు..!

ఎగ్సిట్ పోల్స్ పేరుతో చెల‌గాటం..! ల‌గ‌డ‌పాటి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈసికి ఫిర్యాదు..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి వ్యతిరేకంగా పోరాడి సంచలనం సృష్టించిన లగడపాటి రాజగోపాల్ చివరకు రాజకీయ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి మెల్లగా కోలుకున్న ఆయన ఇక ఎన్నికలకు ముందు సర్వేలంటూ మరో హడావిడి మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు సర్వే చేసి తాను చూపిన వారే విజయ కేతనం ఎగరవేస్తారనే స్థాయికి ఎదిగారు. అంతకుముందు పలు రాష్ట్రాల ఎన్నికల్లో సర్వేలు చేసి.. విజయవంతం అయిన లగడపాటి.. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సర్వేలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. కనీసం ఆయన చెప్పిన దానికి ఇంచుమించు ఫలితాలు కూడా రాకపోవటంతో లగడపాటితో పాటు రాజకీయ వర్గాలన్నీ ఖంగుతిన్నాయి.

 రాజ‌కీయం స‌న్యాసం తీసుకున్న ల‌గ‌డ‌పాటి..! త‌ప్పుడు ఎగ్సిట్ పోల్స్ ఇస్తే స‌ర్వేల స‌న్యాస‌మే..!!

రాజ‌కీయం స‌న్యాసం తీసుకున్న ల‌గ‌డ‌పాటి..! త‌ప్పుడు ఎగ్సిట్ పోల్స్ ఇస్తే స‌ర్వేల స‌న్యాస‌మే..!!

ప్రజా కూటమికి 65 స్థానాలు వస్తాయని మరో 10 స్థానాలు పెరగొచ్చు లేదా తగ్గే అవకాశం కూడా ఉందన్న లగడపాటి కూటమిలోని టీడీపీ పోటీ చేసిన 13 స్థానాల్లో ఇద్దరు స్వతంత్రులు గెలుస్తారని, మరోచోట ఎంఐఎం పోటీలో ఉండగా మిగతా 12 స్థానాల్లో టీడీపీ-టీఆర్ ఎస్ మధ్య పోటీపోటీ ఉంటుందని ఇందులో 7 స్థానాల్లో టీడీపీ విజ్జయం సాధిస్తుందని తెలిపారు. అయితే తీరా ఫలితాల అనంతరం కథ అడ్డంతిరగటంతో తెలంగాణలో మరోసారి లగడపాటి జోకర్ అయిపోయారు.

ల‌గ‌డ‌పాటి పై ఈసికి ఫిర్యాదు..! క‌ట్ట‌డి చేయాల‌ని విజ్ఞ‌ప్తి..!

ల‌గ‌డ‌పాటి పై ఈసికి ఫిర్యాదు..! క‌ట్ట‌డి చేయాల‌ని విజ్ఞ‌ప్తి..!

ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు సర్వేలు చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడనే నెపంతో లగడపాటిపై ఎన్నికల సంఘంలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. లగడపాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి సచివాలయంలో ఎన్నికల కమీషన్ చైర్మన్ రజత్ కుమార్ కి తన ఫిర్యాదు అందించాడు. అబద్దపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి - గందరగోళ పరచడానికి ప్రయత్నించారంటూ ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో లగడపాటికి ఊహించని దెబ్బ తగిలింది. ఈ దెబ్బకు ఇక సర్వే స‌న్యాసం కూడా తీసుకోవాల‌ని ల‌గ‌డ‌పాటి యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 ల‌గ‌డ‌పాటికి ఉన్న ప్రాముఖ్య‌త పోయింది..! ఎవ్వ‌రూ న‌మ్మే ప‌రిస్తితి లేదు..!!

ల‌గ‌డ‌పాటికి ఉన్న ప్రాముఖ్య‌త పోయింది..! ఎవ్వ‌రూ న‌మ్మే ప‌రిస్తితి లేదు..!!

ఇప్పటికే తన సర్వే తలక్రిందులైనందుకు షాక్ అయిన లగడపాటికి తాజాగా ఈసి ఫిర్యాదు మ‌రింత కలవరపెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్రజల్లో తనపై ఉన్న ఈ కాస్త నమ్మకాన్ని కూడా కోల్పోయాననే అంతర్మథనంలో ఆయన కొట్టుమిట్టాడుతున్నట్టు స‌మాచారం. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం, తన సర్వే విషయమై నోరు మెదపకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తాజా పరిణామాలు చూస్తుంటే ఆయన ఇప్పటికే తీసుకున్న రాజకీయ సన్యాసానికి, సర్వే సన్యాసం కూడా తోడవుతుందేమోననే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

English summary
RajGopal is another problem that has been exposed to the perceptions of the pre elections in Telangana. The Election Commission has received a complaint against Raj Gopal, who has been accused of misusing Telangana people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X