వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోచింగ్ , ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ సౌకర్యం లేకున్నా .. జేఈఈ మెయిన్స్ లో ఓ ఆదివాసీ బిడ్డ ప్రతిభ

|
Google Oneindia TeluguNews

అన్ని వసతులు సమకూర్చినా, తల్లిదండ్రులు పిల్లల చదువులపై ఎంత శ్రద్ధ పెట్టినా చాలా మంది విద్యార్థులు చదువులో రాణించలేక పోతున్నారు. పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోతున్నారు. కానీ ఒక ఆదివాసి బిడ్డ ఎలాంటి వసతులు లేకుండా, ఓ మారుమూల గ్రామంలో చదువుకొని ఎంతో ప్రతిష్టాత్మకమైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ లో ప్రతిభ కనబర్చారు. 89.11 శాతం మార్కులను సాధించారు.

ఆదివాసీలకు బాసటగా .. కరోనాపై పోరాటంలో ఎమ్మెల్యే సీతక్క.. ఏం చేస్తున్నారంటే !!ఆదివాసీలకు బాసటగా .. కరోనాపై పోరాటంలో ఎమ్మెల్యే సీతక్క.. ఏం చేస్తున్నారంటే !!

చదువుకునే అన్ని వనరులు లేకున్నా పట్టుదలతో చదివిన ఆదివాసీ బిడ్డ

చదువుకునే అన్ని వనరులు లేకున్నా పట్టుదలతో చదివిన ఆదివాసీ బిడ్డ

కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు... ఈమాటను అక్షరాల నిజం చేసింది మమత అనే విద్యార్థిని. నిరుపేద ఆదివాసి కుటుంబంలో పుట్టిన ఈ విద్యార్థిని ఎలాంటి సౌకర్యాలు లేకుండా తన చదువును కొనసాగించింది. కరోనా వైరస్ కారణంగా గత నాలుగు నెలల కాలంలో ఇంటికే పరిమితమైన మమత కనీసం ఆన్లైన్లో కూడా చదువును సాగించలేక పోయింది. కోచింగ్ చెప్పించుకునే ఆర్థిక స్థితి లేకపోవడం, ఆన్లైన్లో విద్యాభ్యాసానికి కావాల్సిన ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, కనీసం స్మార్ట్ ఫోన్ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఆమె చదువుకు ఆటంకం కాలేదు.

89.1 1% సాధించి తన సత్తా చాటిన మమత

89.1 1% సాధించి తన సత్తా చాటిన మమత

అనుకున్నది సాధించడం కోసం మమత అహర్నిశలు శ్రమించింది. 89.1 1% సాధించి తన సత్తా చాటింది.
అయితే తాను 90 శాతం కంటే ఎక్కువ మార్కులను సాధిస్తానని అనుకున్నానని, కానీ అది సాధ్యం కాలేదని మమత కొంచెం నిరాశ పడుతోంది. ఎటువంటి వనరులు లేకుండా జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ కనపరిచిన ఔరా అనిపించిన ఈ విద్యార్థిని తెలంగాణ రాష్ట్ర ఎయిడెడ్ తెలంగాణ సామాజిక మరియు గిరిజన సంక్షేమ వసతి వసతి గృహంలో చదువుతున్న విద్యార్థిని. తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన హాస్టల్ లో చదువుకున్న మమత తాను పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరచటానికి తన ఉపాధ్యాయులే కారణమని చెబుతోంది.

 కరోనా కారణంగా నాలుగు నెలలుగా ఇంటికే పరిమితం .. కోచింగ్ కు దూరం

కరోనా కారణంగా నాలుగు నెలలుగా ఇంటికే పరిమితం .. కోచింగ్ కు దూరం

మంచిర్యాల జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. నిరక్షరాస్యులైన వారు మమతను బాగా చదువుకోవాలని మొదటినుంచి ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహం తో పాటుగా మమత చదువుకున్న గిరిజన సంక్షేమ హాస్టల్ లో కూడా అధ్యాపకులు ఎంతో శ్రద్ధతో విద్యార్థులకు విద్యను అందించే వారు. గత నాలుగు నెలలుగా కరోనా కారణంగా కళాశాల నడవనప్పటికీ ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. అయితే మమత వద్ద స్మార్ట్ ఫోన్ కానీ, ఇంటర్నెట్ సదుపాయం కానీ లేకపోవడంతో ఆమె తరగతులు కూడా వినలేక పోయారు.

Recommended Video

Hyderabad : కోచింగ్ సెంటర్లు బంద్.. ఎక్కడ చూసిన To-Let బోర్డులు!! || Oneindia Telugu
 ఇంట్లోనే చదువుకుని జేఈఈ మెయిన్స్ లో దూసుకుపోయిన విద్యార్థిని

ఇంట్లోనే చదువుకుని జేఈఈ మెయిన్స్ లో దూసుకుపోయిన విద్యార్థిని

అయినప్పటికీ తనకున్న వనరుల లోనే పట్టుదలతో చదువుకొని జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరిచింది మమత . తల్లిదండ్రులకు సహాయపడుతూనే, ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు చదువుకుని, జేఈఈ మెయిన్స్ లో మమత ఉత్తీర్ణత సాధించింది. ఒక ఆదివాసీ బిడ్డ ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ చదువులో తన సత్తా చాటింది. చదువుకోవాలనే తపన ఉండాలే కాని, అది ఎక్కడైనా అనుకున్న లక్ష్యానికి చేరుస్తుంది అని బలంగా విశ్వసించిన మమత చదువుపై శ్రద్ధ పెట్టకుండా, కుంటి సాకులు చెప్పే నేటి తరానికి కనువిప్పు. నిత్యం ఎనిమిది గంటలపాటు చదివి, తనకు తానే పరీక్షలు నిర్వహించుకుని ,మూల్యాంకనం చేసుకుని , దిద్దుకుని, చదువులో పట్టుదలను చూపించిన మమత నిజంగానే యువతకు మార్గదర్శి.

English summary
For at least four months during the corona lockdown adivasi 17-year-old girl Naini Mamatha was unable to study online or coaching in preparing for the JEE Mains 2020. But Mamatha secured 89.11% in JEE Mains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X