హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెల్త్‌బులెటిన్: నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో లేదంటే.. సందీప్‌ను హెచ్చరించిన తండ్రే ఇలా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద తండ్రి మనోహరాచారి దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మాధవి హెల్త్ బులెటిన్‌ను యశోదా ఆసుపత్రి వైద్యులు గురువారం విడుదల చేశారు. మాధవి పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని తెలిపారు. మాధవికి వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

Recommended Video

ఎర్రగడ్డ కూతురుపై దాడిలో కొత్త కోణం: పరువు కోసం కాదు, అందుకే సందీప్‌పై తొలుత దాడి

చాలా బ్లీడింగ్ జరిగిందని తెలిపారు. ఆపరేషన్ చేసి కంట్రోల్ చేశామని చెప్పారు. చేయి పూర్తిగా తెగిపోయిందన్నారు. సర్జరీ చేశామని చెప్పారు. గాయాలు మానేందుకు సమయం తీసుకుంటుందన్నారు. వెంటిలేషన్ నుంచి బయటకు వస్తేనే ఆమె గురించి ఏదైనా చెప్పగలమని అన్నారు. రోడ్డు ప్రమాదం కాబట్టి ఇన్‌ఫెక్షన్ ప్రభావం ఎక్కువ అన్నారు.

ఎర్రగడ్డ కూతురుపై దాడిలో కొత్త కోణం: పరువు కోసం కాదు, అందుకే సందీప్‌పై తొలుత దాడిఎర్రగడ్డ కూతురుపై దాడిలో కొత్త కోణం: పరువు కోసం కాదు, అందుకే సందీప్‌పై తొలుత దాడి

హఠాత్తుగా జరగడంతో ఒత్తిడి, కిడ్నీపై ప్రభావం

హఠాత్తుగా జరగడంతో ఒత్తిడి, కిడ్నీపై ప్రభావం

ఈ ఘటనలో మాధవికి మెడ, చెవి, ముఖ కండరాలు తీవ్రంగా గాయపడ్డాయని వైద్యులు చెప్పారు. ఎడమ చేతి ఎముక మొత్తం తెగిపోయి చర్మం మాత్రమే వేలాడుతున్న స్థితిలో ఆమెను ఆసుపత్రికి తీసుకు వచ్చారని చెప్పారు. బుధవారం రాత్రి డాక్టర్లు ఆపరేషన్ చేసి చేతిని అతికించారన్నారు. హఠాత్తుగా జరిగిన పరిణామంతో మాధవి ఎంతో ఒత్తిడికి లోనైందని చెప్పారు. దాని ప్రభావం కిడ్నీ పైన పడిందన్నారు.

 తీసుకురాగానే ఆపరేషన్

తీసుకురాగానే ఆపరేషన్


అధునాతన చికిత్స అందిస్తునప్పటికీ మాధవి శరీరం స్పందించే తీరును బట్టే ఆమె రికవరీ ఆధారపడి ఉంటుందని వైద్యులు తెలిపారు. మాధవిని తమ ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే సమయం వృథా చేయకుండా ఆపరేషన్ చేశామన్నారు. మాధవికి యశోద ఆసుపత్రి వైద్యులు ఆరు నుంచి 8 గంటల పాటు ఆపరేషన్ చేశారు. రక్తస్రావం ఆగేలా చేశారు. వెంటిలెటర్ పైన ఉండటంతో విషమమేనని, వెంటిలెటర్ తీస్తేనే ఏదైనా చెప్పగలమని అంటున్నారు.

పోయిన పరువు వస్తుందా.. పోలీసులకే తండ్రి ప్రశ్న

పోయిన పరువు వస్తుందా.. పోలీసులకే తండ్రి ప్రశ్న


కూతురు, అల్లుడిపై దాడి చేసిన కొద్ది గంటల్లో మాధవి తండ్రి మనోహరాచారి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సందర్భంగా అతను పోలీసులను ప్రశ్నించాడని తెలుస్తోంది. ఈ దాడికి కులాంతర వివాహమో లేదా పరువు హత్యనో కాదని పోలీసులు చెప్పారు. తండ్రికి కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలియదు. మరోవైపు ఆయన పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో హఠాత్తుగా పెళ్లి జరిగిందని తెలిసి మనోహరాచారి ఆగ్రహించి, ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులను ప్రశ్నించాడని తెలుస్తోంది. తన పరువు ప్రతిష్ఠలు మంటగలిపినందుకే ఈ పని చేశానని చెప్పడంతో పాటు, తన మాట వినకపోవడంతో, కూతురు ఉన్నా లేకున్నా ఒకటేనని భావించానని, పోయిన పరువు వస్తుందా అని పోలీసులనే ఎదురు ప్రశ్నించాడట. అతను బాగా మద్యం తాగి మత్తులో ఉన్న మనోహరాచారికి పోలీసులు శ్వాస పరీక్ష నిర్వహించగా 353 బీఏసీ వచ్చింది.

కూతురు కదా చంపడనుకున్నా

కూతురు కదా చంపడనుకున్నా

ఈ దాడిలో కూతురు మాధవి తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, సందీప్ గాయాలతో బయటపడ్డాడు. అతను మాట్లాడుతూ... ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన కూతురును చంపుతాడని తాను భావించలేదన్నాడు. తనపై దాడి చేయగానే పారిపోయానని, కూతురు కదా దాడి చేయడని భావించానని అన్నాడు.

నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో లేదంటే

నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో లేదంటే


కులాలు వేరుకావడం, తండ్రి నుంచి ప్రాణహాని ఉందన్న అనుమానంతో మాధవి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. పెళ్లైన రోజే భర్తతో కలిసి ఎస్సార్ నగర్ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తమకు రక్షణ కల్పించాలని కోరింది. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మాధవి.. సందీప్ ఇంటికి వెళ్లింది. ఈ నెల 16న మాధవి కుటుంబ సభ్యులు సందీప్ ఇంటికి వెళ్లి పలకరించాడు. అంతేకాదు నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి లేదంటేనా అని హెచ్చరించాడట.

English summary
A father attacked his 20 year old daughter and her newly wed husband in the heart of the city on Wednesday, chopping off her left forearm and slashing her jaw.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X