హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూబ్లీహిల్స్ ప్రమాదంలో జూ.ఆర్టిస్ట్ మృతి: మరో కారు మధ్యలో, అమ్మాయిలు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు?

|
Google Oneindia TeluguNews

Recommended Video

జూబ్లీహిల్స్ ప్రమాదం : మహిళల సెల్‌పోన్లలో అభ్యంతరక వీడియోలు, పలు కోణాలు !

హైదరాబాద్: పీకల దాకా మద్యం తాగి, ఆ మత్తులో ఓ యువతి ప్రాణాలను బలిగొనడంతో పాటు, మరో ఇద్దరు యువతుల ప్రమాదానికి కారణమయ్యాడు విష్ణువర్ధన్ అనే వ్యక్తి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటి రెండు గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

అర్ధరాత్రి కారు బీభత్సం: ఒకరు మృతి, మరొకరి బ్రెయిన్ డెడ్, కళ్లు మూసి తెరిచేలోపు అర్ధరాత్రి కారు బీభత్సం: ఒకరు మృతి, మరొకరి బ్రెయిన్ డెడ్, కళ్లు మూసి తెరిచేలోపు

ఈ ప్రమాదంలో మస్తానీ అనే యువతి చనిపోయింది. ప్రియ, అనుష అనే యువతులకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. విష్ణువర్ధన్ మద్యం తప్పతాగి వాహనం నడపడం వల్ల మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. మృతి చెందిన మస్తానీ జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పలు సినిమాల్లో నటించింది.

చదవండి: అక్కకు ద్రోహం, బావతో సంబంధం: భర్తను చంపిన శ్రీవిద్య నవ్వుతూ, షాకింగ్ విషయాలు

చదవండి: పూనమ్‌ను లాగి మరో తప్పు!: మహేష్ కత్తికి యాంకర్ దిమ్మతిరిగే షాక్, మీరెవరికి తెలుసు?

 పది నిమిషాల్లో చేరుకుంటారనగా

పది నిమిషాల్లో చేరుకుంటారనగా

మస్తానీ, ప్రియ, అనూషలు కూకట్‌పల్లి నుంచి జేఎన్‌టీయూ, మాదాపూర్ మీదుగా యూసఫ్‌గూడ బయలుదేరారు. వారు మరో పది నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారని అనుకుంటుండగా ఘోరం జరిగింది. వీరు వెళ్తున్న స్కూటీని విష్ణు కారు బలంగా ఢీకొట్టడంతో అదే వేగంతో దూసుకెళ్లి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. మస్తాని మృతి చెందగా, అనూష అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

 బ్రీత్ అనలైజర్‌లో 206

బ్రీత్ అనలైజర్‌లో 206

క్షతగాత్రులను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అనూష పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితుడు విష్ణుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయంగా 206 బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ ఉన్నట్లుగా తేలింది. ప్రమాదం జరగగాలనే స్థానికులు 108కు ఫోన్ చేశారు.

 పక్కనున్న మరో కారు మధ్యలో నలిగిపోయారా

పక్కనున్న మరో కారు మధ్యలో నలిగిపోయారా

కారు వీరి స్కూటీని ఢికొట్టిన సమయంలో పక్కనున్న మరో కారు మధ్యలో వీరి వాహనం నలగడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీనిసేకరించారు. విష్ణు స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టి, భయాందోళనకు గురై ఆ తర్వాత వేగంగా కారును పోనిచ్చాడు. దీంతో సదరన్ స్పైస్ క్రాస్ వద్ద రోడ్డు మధ్య డివైడర్‌ను ఢీకొని కారు ఆగిపోయింది. కారులోని రెండు బెలూన్లు తెరుచుకున్నాయి. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

 ఇద్దరు మహిళల సెల్‌పోన్లలో అభ్యంతరకర వీడియోలు

ఇద్దరు మహిళల సెల్‌పోన్లలో అభ్యంతరకర వీడియోలు

క్షతగాత్రులైన ఇద్దరు మహిళల సెల్‌పోన్లలో అభ్యంతరక వీడియోలు, కొందరు యువతుల ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వాటిని పోలీసులు విశ్లేషిస్తున్నారని తెలుస్తోంది.

 అర్ధరాత్రి తీసుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది

అర్ధరాత్రి తీసుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది

కాగా, ముగ్గురు స్కూటీపై వెళ్తున్న సమయంలో డ్రైవింగ్ చేస్తున్న మస్తానీ హెల్మెట్ ధరించిందా లేదా తెలియాల్సి ఉంది. మరోవైపు, ఇద్దరు యువతులు అర్ధరాత్రి కూకట్‌పల్లికి వెళ్లి అనూషను తీసుకు రావాల్సిన అవసరం ఏమిటనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది.

 మస్తానీ మృతదేహం అప్పగింత

మస్తానీ మృతదేహం అప్పగింత

ప్రమాద ఘటనపై ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2, 337, 185 ఎంవీ చట్టం కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మస్తానీ మృతదేహాన్ని ఆమె భర్త, తాడేపల్లిగూడేనికి చెందిన సురేషఅ కుమార్, తల్లి మదనమ్మలకు అప్పగించారు.

English summary
A woman died and two others sustained injuries in a road accident after a motorist suspected to be in an inebriated condition rammed into their bike here on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X