వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళ దినోత్సవం రోజున అతివకు న్యాయం: ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు బలవన్మరణం...

|
Google Oneindia TeluguNews

మహిళ దినోత్సవం రోజున ఓ అతివకు న్యాయం జరిగింది. తన భర్తను కళ్లెదుటే హత్యచేయించిన దుర్మార్గుడు మారుతీరావు కూడా చనిపోయాడు. ఒత్తిడికి గురై చింతల్ బస్తీలో గల ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన భర్తను హత్య చేసి మారుతీరావు పశ్చాతపపడ్డారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని అమృత పేర్కొన్నారు. అయితే అమృతకు మహిళ దినోత్సవం రోజునే న్యాయం జరగడం విశేషం. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, ఆస్తి రాసిస్తానని తండ్రి ప్రలోభాలకు గురిచేసిన.. కూతురు అమృత లొంగిపోలేదు. అన్యాయంపై పోరాడుతానని ఎలుగెత్తి చాటారు.

Recommended Video

Exclusive: Amrutha Reaction On His Father Maruthi Rao తండ్రి ఆత్మహత్య పై అమృత ప్రణయ్ ఏమందో తెలుసా ??
మారుతీరావు ఆత్మహత్య..

మారుతీరావు ఆత్మహత్య..

కూతురు తన దారికి వచ్చే అవకాశం లేదని మారుతీరావుకు అర్థమైపోయింది. తనకు జీవితం చాలు అనుకొని ఉంటారు. అవమానాలు, ఛీత్కరాల మధ్య బతకడం కంటే చనిపోవడం నయమని భావించి.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానీ ప్రణయ్‌ను హతమార్చిన ఏ1 నిందితుడు మృతిని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు స్వాగతించాయి. చేసిన తప్పుతోనే కుంగిపోయి.. మారుతీరావు సూసైడ్ చేసుకున్నారని పేర్కొంటున్నారు.

రెండేళ్లకు న్యాయం..

రెండేళ్లకు న్యాయం..

2018 సెప్టెంబర్ నెలలో అమృత-ప్రణయ్ దంపతులపై కిరాయి రౌడీలు దాడి చేశారు. హత్య జరిగి రెండేళ్లు అవుతోంది. కేసు విచారణ తుది దశకు చేరుకొంది. తన భర్తను చంపిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమృత కోరుకుంటోంది. తన చిన్నారిని కూడా మీడియాకు చూపించి.. తన తండ్రిని మట్టుబెట్టిన వారికి త్వరగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి కేసు విచారణ-ఉరి శిక్ష-క్షమాభిక్షలతో ఎన్నెళ్లకో మారుతీరావు శిక్షను ఎదుర్కొనేవారు. కానీ అమృత మొర అలకించినా దేవుడు.. నిందితుడుని పైకి తీసుకెళ్లిపోయాడని కొందరు అంటున్నారు.

కూతురు పాపం..

కూతురు పాపం..

అమృత ప్రతీ కన్నీటి బొట్టుకు నేడు ఫలితం వచ్చిందని అంటున్నారు. అల్లుడిని దారుణంగా మట్టుబెట్టించిన మారుతీరావు చివరికి అతని వద్దకే చేరుకున్నాడు. అదీ కూడా మహిళా దినోత్సవం రోజున చనిపోవడంతో.. అమృతకు న్యాయం జరిగిందని మరికొందరు అంటున్నారు. అమృత ఉసురు పోసుకున్న మారుతీరావు చివరికి తనకు తానే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. ఇందుకు కూతురు పాపం తగలడమేనని చెప్తున్నారు.

English summary
pranay murder case accused maruthi rao suicide, amrutha get justice on womens’s day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X