హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేడీస్ జర భద్రం: దగ్గరి వారే సైకోలైతే.. మీ ఫోన్ నెంబర్ సెక్స్ సైట్లలో ఉంటుంది!

|
Google Oneindia TeluguNews

స్నేహం అంటారు.. ఆ తర్వాత ప్రేమ అంటారు. ఇది వర్కౌట్ కాకపోతే ఇన్ని రోజులు కలిసి ఉన్నదానికి ఏదైనా తీపిగా గుర్తుండిపోయేలా ఇమ్మంటారు... అందుకు ఒప్పుకోకపోతే ఇంటర్నెట్‌లో తాము దిగిన ఫోటోలను పోస్టు చేసి పరువు బజారుకీడుస్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ తరహా మోసాలు ఎక్కువైపోయాయి. అబ్బాయిలు అమ్మాయిలను ఇలానే ట్రాప్ చేస్తున్నారు. తాము ఎంతటి పెద్ద తప్పు చేస్తున్నామో కటకటాల పాలైతే గానీ తెలుసుకోలేకపోతున్నారు.

నగరంలో నయా నేరగాళ్లు

నగరంలో నయా నేరగాళ్లు

అప్పటి వరకు కాలేజీలో స్నేహం.. ఆ తర్వాత కోచింగ్‌ల పేరుతో నగరాలకు వచ్చేయడం. కోచింగ్ సంగతి పక్కన ఉంచి తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లి నగరంలో నయా పోకడలకు పోతోంది యువత. ఒక అమ్మాయితో ముందుగా స్నేహం చేస్తున్న కొందరు దుర్మార్గులు, స్నేహం పేరుతో అమ్మాయితో చనువుగా ఉండి పార్కులు చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకుని తెగ సంబర పడిపోతుంటారు. అమ్మాయి చనువు ఇచ్చింది కదా అని చంకనెక్కే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి అమీర్‌పేట్‌లో చాలా చూస్తాం. చనువును అదనుగా చేసుకుని ప్రేమ అని వెంటపడతారు. అమ్మాయి ఒప్పుకోకపోతే ఆమె నుంచి మరేదో కోరుకుంటారు. అందుకు లొంగకపోతే బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఇదీ సినిమాలో మాత్రమే కనిపించడం లేదు... నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

 వివాహితకు కొత్త నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్

వివాహితకు కొత్త నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్

తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అయితే ఇక్కడ బాధితురాలు ఓ వివాహిత. అనుకోకుండా ఒకరోజు ఆమెకు ఒక నెంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. ఒక అమ్మాయి కావాలంటూ అవతలి వ్యక్తి ఫోన్ చేశాడు. వివాహిత షాక్‌కు గురైంది. ఇలా వరుసగా ఫోన్లు వస్తున్నాయి. దీంతో బెదిరిపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి వెలుగు చూసింది. ఆ మహిళ నెంబరును తన సమీప బంధువైన ఓ వ్యక్తి కొన్ని అంతర్జాతీయ సైట్లపై నమోదు చేశాడు. కొద్దిరోజులుగా ఆ వ్యక్తి ఆ మహిళ వెంట పడి వాట్సాప్ మెసేజ్‌లతో వేధిస్తున్నాడు. ఆ మహిళకు ఆ వ్యక్తిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 అమ్మాయిల నుంచి మరేదో ఆశిస్తున్న కేటుగాళ్లు

అమ్మాయిల నుంచి మరేదో ఆశిస్తున్న కేటుగాళ్లు

అప్పటి వరకు ఎంతో స్నేహంగా మెలిగిన అమ్మాయిలు ఒక్కసారిగా మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నారంటూ అబ్బాయిలు మృగాళ్లలా తయారువుతున్నారు. తమను పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు కానీ విడిపోయే ముందు ఏదైనా గుర్తుండిపోయేలా ఇవ్వాల్సిందిగా సిగ్గువిడిచి అడుగుతున్నారు. అందుకు ఒప్పుకోకపోతే అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా ఫోటోలు తయారు చేసి ఇంటర్నెట్‌లో పోస్టు చేస్తున్నారు. అమ్మయిల భవిష్యత్తుతో ఆడుకుని పైగా తామేదో గొప్ప పని చేసినట్లుగా నలుగురితో పంచుకుని పైశాచిక ఆనందం పొందుతున్నారు. అరెస్టు అయి కటకటాల పాలయ్యే వరకు ఈ కుర్రకారుకు తమ అమూల్యమైన భవిష్యత్తు ఏమిటో అనేది అర్థం కావడం లేదు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన సమయంలో ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకుంటున్నారు పోలీసులు. కానీ అప్పటికే అమ్మాయికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.


అమ్మాయిలూ స్నేహం చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్నేహం వరకు ఓకే కానీ సెల్ఫీలు, ఫోటోలు లాంటివి అబ్బాయిలతో దిగరాదని హెచ్చరిస్తున్నారు. ఎవరినీ గుడ్డిగా నమ్మరాదని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

English summary
A man was arrested and put behind bars for sexually harrasing a married lady. This incident took place in Yadadri Bhuwanagiri district.Police said that girls have to be cautious from such kind of fraudsters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X