వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ్యాట్సాఫ్: హైదరాబాద్ తొలి మెట్రో రైలును నడిపింది.. మన తెలంగాణ అమ్మాయే!

భాగ్యనగర ప్రజల కలల ప్రాజెక్ట్‌ అయిన మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరి తొలి ‘మెట్రో రైలు’ను నడిపిందెవరో తెలుసా? మన తెలంగాణ అమ్మాయిలు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Hyderabad Metro First Day Journey : Women Loco Pilots For Metro | Oneindia Telugu

హైదరాబాద్‌: నగరంలో మొదలైన మొదటి 'మెట్రో రైలు'ను నడిపిందెవరో తెలుసా? వారు మహిళా డ్రైవర్లు.. అందునా తెలంగాణ అమ్మాయిలు. భాగ్యనగర ప్రజల కలల ప్రాజెక్ట్‌ అయిన మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ప్రారంభం అనంతరం ప్రధాని మోడీ కూడా ఈ మెట్రోరైలు ఎక్కి మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకూ ప్రయాణించారు. తిరిగి అదే రైలులో ఆయన మియాపూర్‌కు చేరుకున్నారు. ప్రధాని ప్రయాణించిన ఈ మొట్టమొదటి మెట్రో రైలును నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సుప్రియా సనమ్‌ నడిపారు.

hyd-metro-loco-woman-pilot

ఈ సందర్భంగా లోకో పైలట్ సుప్రియ మాట్లాడుతూ... సవాళ్ళతో కూడిన విధులను నిర్వహించేందుకు తానెంతో ఇష్టపడతానని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రధాని ప్రయాణించిన తొలి మెట్రో రైలును నడిపే సమయంలో తాను ఎంతో ఉద్వేగానికి గురైనట్లు ఆమె పేర్కొన్నారు.

సుప్రియతో పాటు మరో ముగ్గురు మహిళా డ్రైవర్లు హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో ఉన్నారు. వీరిలో వరంగల్‌కు చెందిన కె.సింధుజ, మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌ మండలం బలిజపేటకు చెందిన బి.వెన్నెల, హైదరాబాద్‌కు చెందిన జి.ప్రణయ ఉన్నారు.

English summary
It was a woman loco pilot of the newly inaugurated Hyderabad Metro Rail who got to take the first passenger Prime Minister Narendra Modi for a ride, immediately after train services were dedicated to the nation on Tuesday. The Hyderabad Metro has over 35 women loco pilots and according to state IT minister KT Rama Rao, the state government wants to give more representation to women in the new public transport system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X