హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీ కేర్‌పుల్: olxలో యాడ్‌, కారు కొందామంటే ఇలా జరిగిందేంటబ్బా..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేసిన సైబర్ కేటుగాళ్లను మనం చూశాం. సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా ఉన్న ఏ వెబ్‌సైట్‌ను వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓఎల్‌ఎక్స్‌లోకి చొరబడ్డారు. పెళ్లిరోజు కానుకగా భర్తకు ఆశ్చర్యానికి గురి చేసేలా ఓ బహుమతి ఇవ్వాలనుకుంది.

అయితే అందుకు ఓఎల్‌ఎక్స్ నుంచి ఖరీదైన బహుమతిని కొందామనుకొని ప్రయత్నించి సైబర్ కేటుగాళ్లు చేతిలో ఓ మహిళ బోల్తాపడిన సంఘటన ఇది. చివరకు సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయానని తెలుసుకుని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన ఒక మహిళ తన భర్తకు షిప్టు డిజైర్ కారును పెళ్లి రోజుకానుకగా ఇవ్వాలనుకుంది. అందుకు ఓఎల్‌ఎక్స్‌లో లేటెస్ట్ మోడల్స్ ఏమైనా అమ్మకానికి ఉన్నాయా? అని పరిశీలించింది. అందులో మంచి కారుని రూ 4.5 లక్షలకు అమ్ముతామని తెలిపే ప్రకటనను చూసింది.

వెంటనే అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసింది. తాను అత్యవసర పనిమీద శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కారును పార్కు చేసి లండన్ వెళ్తున్నానని, కారును విక్రయించే విషయమంతా మా పీఏ చూసుకుంటారంటూ చెప్పి అవతలి వ్యక్తి ఒక ఫోన్‌నంబర్ ఇచ్చాడు.

woman lost 2.5 lakhs through olx add

దీంతో ఆ మహిళ ఆ నంబర్‌కు ఫోన్ చేయడంతో ఒక యువతి కారు వివరాలు తెలిపింది. మా సార్‌తో కూడా మాట్లాడొచ్చంటూ మరో ఫోన్‌ నంబర్ ఇచ్చింది. దానికి ఫోన్ చేయడంతో ఇంగ్లీష్‌లో మాట్లాడిన సదరు వ్యక్తి ఇప్పుడే మొత్తం డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు, మీరు సగం డబ్బులు ఇచ్చయినా కారు తీసుకోవచ్చంటూ సూచించాడు.

ఇదంతా నిజమేనని నమ్మిన ఆ మహిళ వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేసింది. డబ్బులు డిపాజిట్ చేశానంటూ ఫోన్ చేసిన సదరు మహిళకు మీ పని అయిపోతుంది, కారు మీ చేతికి వచ్చినట్లేనని చెప్పి అవతలి యువతి ఫోన్ పెట్టేసింది. ఇక అప్పటి నుంచి ఆ యువతి ఫోన్ స్విచ్‌ అఫ్‌లోనే ఉంది.

దీంతో భర్తకు తెలియకుండా, గిప్టు ఇద్దామనుకొని మోసపోయిన సదరు మహిళ విషయాన్ని గ్రహించి, జరిగిన విషయాన్ని భర్తకు చెప్పి సైబర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
woman lost 2.5 lakhs through olx add.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X