• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలీసులకే షాకిచ్చిన స్వాతి: భర్త స్థానంలో ప్రియుడితో, రాజేష్‌కు ట్విస్టిచ్చిన ఖాకీలు

By Narsimha
|
  Nagar Kurnool Swathi Mystery Case Twist | Oneindia Telugu

  నాగర్‌కర్నూల్: ప్రేమించి వివాహం చేసుకొన్నారు. అయితే వారి కాపురం సజావుగా సాగుతోంది. అయితే మధ్యలో మరో వ్యక్తితో ప్రియురాలికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేసింది భార్య. అంతేకాదు ప్రియుడినే భర్త స్థానంలోకి తీసుకు వచ్చింది. పోలీసులను, జడ్జిని కూడ నమ్మించింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. సినిమాను తలపించేలా ఓ వివాహిత పన్నిన కుట్రను నాగర్‌కర్నూల్ పోలీసులు ఎట్టకేలకు చేధించారు.నిందితురాలు స్వాతిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇలాంటి ట్విస్ట్‌ను తమ సర్వీసులో చూడలేదని నాగర్ కర్నూలు అడిషనల్ ఎస్పీ చెన్నయ్య చెప్పారు.

  ప్రియుడితో రాసలీలలు: భర్త చూశాడని చంపి సెప్టిక్ ట్యాంక్‌లో, 3 హత్యలు, 15 ఏళ్ళ తర్వాతిలా..

  వివాహేతర సంబంధం కారణంగా భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన ఇది. అయితే తన భర్తను హత్య చేయడమే కాకుండా అసలు విషయం బయటకు రాకుండా ఆ వివాహిత అనేక పన్నాగలు పన్నింది. వాటిని కుటుంబసభ్యులు, పోలీసులు నమ్మేలా చేసింది.

  శాడిస్ట్ మొగుడు: 'ఆ విషయం లీక్ చేసిందనే శైలజపై దాడి'

  నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన సుధాకర్‌రెడ్డి, స్వాతిలు భార్య, భర్తలు. వీరిద్దరూ ప్రేమించి ఎనిమిదేళ్ళ క్రితం వివాహం చేసుకొన్నారు.వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. చిన్న ఉద్యోగం చేస్తూ సుధాకర్‌రెడ్డి కాంట్రాక్టర్‌గా మారాడు. ఆర్థికంగా ఏ లోటు కూడ లేదు. అయితే స్వాతికి రాజేష్ అనే మరో వ్యక్తితో ఏర్పడిన వివాహేతర సంబంధం సుధాకర్‌రెడ్డి హత్యకు దారితీసింది.

  భార్య సహయంతో కోడలిపై అత్యాచారం: బిడ్డకు జన్మనిచ్చిన కోడలు, డిఎన్ఏ పరీక్షతో ఇలా..

  దారుణం: తండ్రిని అడ్డుపెట్టి కూతురిపై అత్యాచారం, నగ్న ఫోటోలు, వీడియోలతో ఇలా..

  వివాహేతర సంబంధం కారణంగా

  వివాహేతర సంబంధం కారణంగా

  నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం బండపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి (32), ఇదే మండలానికి చెందిన స్వాతి(28) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హైదరాబాద్‌లో కొంతకాలం ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసిన సుధాకర్‌రెడ్డి.నాగర్‌కర్నూల్‌ సమీపంలో క్రషర్‌ మిషన్‌ను ఏర్పాటు చేసుకొని ఇక్కడే స్థిరపడ్డాడు.

  నాగర్ కర్నూలులోనే ఓ ఫిజియో థెరపీ సెంటర్ కు వెళ్లిన సమయంలో స్వాతికి రాజేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర బంధంగా మారి, వారిద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. స్వాతి ప్రవర్తనపై అనుమానంతో సుధాకర్‌రెడ్డి భార్యతో గొడవపడేవాడు

  రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని భర్తను

  రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని భర్తను

  తమ మద్య వివాహేతర సంబంధానికి భర్త సుధాకర్‌రెడ్డి అడ్డుగా ఉన్నాడని స్వాతి భావించింది.ఈ మేరకు భర్త సుధాకర్‌రెడ్డిని చంపాలని భావించింది. నవంబర్ 26వ తేదీ రాత్రి సుధాకర్ తలకు గాయమైంది. ఆసుపత్రిలో కుట్లు వేయించుకొనేందుకు వెళ్ళిన సుధాకర్‌రెడ్డిని హత్య చేయాలని స్వాతి ప్లాన్ చేసింది. ప్రియుడు రాజేష్‌తో కలిసి సుధాకర్‌రెడ్డిని చంపేసింది. మృతదేహన్ని మహబూబ్‌నగర్ జిల్లా అడవుల్లోకి తీసుకెళ్ళి దహనం చేశారు.

  రాజేష్‌ను గుర్తు పట్టకుండా

  రాజేష్‌ను గుర్తు పట్టకుండా

  సుధాకర్‌రెడ్డిని చంపేసి ఆయన స్థానంలో రాజేష్‌ను తీసుకువచ్చింది స్వాతి. అయితే ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు రాజేష్ తన ముఖానికి కొన్ని క్రీములు రాసుకోవడంతో చర్మమంతా కాలిపోయింది. తన భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారని నాటకమాడింది స్వాతి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రియుడిని చేర్చింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని బంధువులకు చెప్పి, ఆరున్నర లక్షల రూపాయలు బిల్లు కూడా కట్టించింది.

  రాజేష్ కన్పించకపోవడంతో

  రాజేష్ కన్పించకపోవడంతో

  రాజేష్ పది రోజులుగా కనిపించడం లేదని తెలుసుకున్న పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తమదైన శైలిలో దర్యాఫ్తు ప్రారంభించారు. ఆసుపత్రిలో సుధాకర్ గా నటిస్తున్న రాజేష్ గొంతును గుర్తుపట్టిన బంధువులు, అతను సుధాకర్ కాదని చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా విషయం బయటకు వచ్చింది.

  పోలీసులను, న్యాయమూర్తిని ఇలా

  పోలీసులను, న్యాయమూర్తిని ఇలా

  అచ్చు సినిమాలో వ్యవహరించిన తీరులో స్వాతి కుట్ర పన్నింది. ముఖానికి బ్యాండేజీ వేసుకొని రాజేష్ తనను గుర్తు పట్టకుండా చేసింది. అంతేకాదు క్రీములు రాసుకోవడం వల్ల ముఖం కాలిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులను నమ్మించి, న్యాయమూర్తి ముందు తలకు బ్యాండేజీ వేసివున్న ప్రియుడితో స్టేట్ మెంట్ ఇప్పించింది. ఇదంగా నిజమేనని అందరూ నమ్మారు.అయితే రాజేష్ అదృశ్యం కావడంతో అసలు విషయం వెలుగు చూసింది.

  రాజేష్ పై సుధాకర్ రెడ్డి కుటుంబసభ్యుల అనుమానం

  రాజేష్ పై సుధాకర్ రెడ్డి కుటుంబసభ్యుల అనుమానం

  హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న వ్యక్తి వద్దకు పోలీసులు వెళ్లి వివరాలను సేకరించారు. సుధాకర్‌రెడ్డి కుటుంబసభ్యులూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తిని చూసి వచ్చారు. చికిత్స పొందుతున్నది సుధాకర్‌రెడ్డి కాదంటూ అతని అన్న సురేందర్‌రెడ్డి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  వేలి ముద్రల ఆధారంగా

  వేలి ముద్రల ఆధారంగా

  స్వాతి భర్త సుధాకర్‌రెడ్డి ఏమయ్యాడన్న కోణంలో పోలీసులు విచారణ జరిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం ఫత్తేపూర్‌ శివారులోగల మైసమ్మ ఆలయ సమీపంలో స్వాతి భర్త సుధాకర్‌రెడ్డి హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు.అతను నాగర్‌కర్నూల్‌లో నివాసముంటున్న రాజేశ్‌ అని పోలీసులు వేలిముద్రల ఆధారంగా గుర్తించారు. ఆదివారం నాడు స్వాతిని, రాజేష్ ను అరెస్ట్ చేశారు. తన సర్వీసులో ఇంత ట్విస్ట్ ఉన్న కేసును చూడలేదని నాగర్ కర్నూల్ ఎఎస్పీ అభిప్రాయపడ్డారు.

  English summary
  A woman killed her husbadn with the help of lover in Nagarkurnool.Swathi, Sudhakar reddy married six years back.recently swathi extra marital affair with Rajesh. Rajesh and Swathi murdered Sudhakar Reddy last month 26th
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X