వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళపై అత్యాచారం, హత్య: నిందితుడికి జీవిత ఖైదు

|
Google Oneindia TeluguNews

మహబూబాబాద్‌: ఓ గిరిజన మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేయడంతోపాటు ఆమె వద్ద ఉన్న వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసులో ఓ నిందితుడికి మహబూబాబాద్‌ ఆరో అదనపు కోర్టు జడ్జి సన్మాన్‌ రాజు.. యావజ్జీవ శిక్ష, రూ. 1000 జరిమానా విధించారు. కోర్టు కానిస్టేబుల్‌ ఎండీ సర్దార్‌ అలీ చెప్పిన వివరాల ప్రకారం... ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కురవి మండం స్టేషన్‌ గుండ్రాతిమడుగు గ్రామానికి చెందిన బోడ దూబ్లి అనే గిరిజన మహిళ రైళ్లలో పల్లీలు అమ్ముకుంటూ జీవిస్తోంది.

ఈ క్రమంలో గూడూరు మండలం గోవిందాపురం గ్రామ శివారు దుబ్బగూడెంతండాకు చెందిన అజ్మీర శివలాల్‌, మహబూబాబాద్‌ మండలం జంగిలికొండ గ్రామ శివారు రోటిబండా తండాకు చెందిన అజ్మీర వెంకన్న ఇద్దరు కలిసి బోడ దుబ్లీపై అత్యాచారానికి ప్పాడ్డారు. అనంతరం చీర కొంగుతో ఉరిపెట్టి చంపి, ఆమె కాళ్లకు ఉన్న రెండు తులాల వెండి మట్టెలను చోరీ చేశారు.

2009 జులై 12న జరిగిన ఈ ఘటనలో అదేరోజు దుబ్లీ భర్త మాట్యాటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసు కేసు నమోదు చేసుకొని శివలాల్‌, వెంకన్నను అరెస్టు చేసి మహబూబాబాద్‌ సబ్‌జైలుకు రిమాండ్‌కు తరలించారు.

court

సుదీర్ఘ కాలంగా సాగిన కేసు విచారణలో వాదోపవాదాలు విన్న ఆరో అదనపు జిల్లా కోర్టు జడ్జి సల్మాన్‌ రాజు శుక్రవారం తీర్పును వ్లెడించారు. ఇందులో అజ్మీర వెంకన్న నిర్దోషిగా బయటపడగా, అజ్మీర శివలాల్‌పై నేరం నిరూపణ కావడంతో ఇతనికి యావజ్జీవ శిక్ష విధించడంతోపాటు రూ.1000 జరిమానా విధించారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడిన నెల రోజుల్లో యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం ఇదే మొదటిది.

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మృతి

జనగామ: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ ఆటో డ్రైవర్‌ మృతిచెందిన ఘటన జనగామ, సిద్ధిపేట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు వివరాల ప్రకారం.. జనగామ పట్టణం రెడ్డి స్ట్రీట్‌కు చెందిన మొహ్మద్‌ హుస్సేన్‌(55) గురువారం రాత్రి ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకొని పసరమడ్లకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ఘటనలో మొహ్మద్‌ హుస్సేన్‌ అక్కడిక్కడే మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదుచేసుకొని, మృతదేహానికి జనగామ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య బీపాషతోపాటు ఓ కూతురు ఉంది.

English summary
Life imprisonment for a accused in a Woman rape n murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X