• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్నో అనుమానాలు: సౌమ్యది హత్యే?, నువ్వెల నూనె పోసి మరీ..

|

హైదరాబాద్: హైదరాబాద్‌ ఎస్ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ, నందనగర్‌లో ఉన్న సూరజ్‌ ఆర్కేడ్‌ అపార్ట్‌మెంటులో సోమవారం అర్థరాత్రి సౌమ్య అనే వివాహిత సజీవ దహనమైంది.

ఏం జరిగి ఉంటుంది?: అర్థరాత్రి.. ఎర్రగడ్డలో వివాహిత సజీవ దహనం?

అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సౌమ్యను ఎవరైనా హత్య చేసి ఉంటారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు గానీ, ఆమె కుటుంబంతో గానీ పరిచయం ఉన్నవాళ్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఎవరీ సౌమ్య:

ఎవరీ సౌమ్య:

సూరజ్‌ ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌-104లో సౌమ్య-నాగభూషణం దంపతులు నివసిస్తున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఎల్‌&టీలో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేసే నాగభూషణం.. సోమవారం రాత్రి 8 గంటలకు విధులకు వెళ్లిపోయాడు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో వారి ఫ్లాట్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి.

సజీవదహనం:

సజీవదహనం:

అప్రమత్తమైన చుట్టుపక్కల వాళ్లు.. సౌమ్య ఇంటి బయట గడియ పెట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా.. లోపల మంటల్లో ఆమె కాలిపోతూ కనిపించింది. బిందెలతో నీళ్లు పోసినా.., ఇసుకతో మంటలను చల్లార్చేందుకు ప్రయత్నించినా.. అవన్నీ విఫలయత్నమే అయ్యాయి. ఆఖరికి సౌమ్య ప్రాణాలు వదిలింది.

ఆరేళ్ల క్రితం వివాహం:

ఆరేళ్ల క్రితం వివాహం:

మృతురాలు సౌమ్యను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వోద్యోగి అయిన పున్నారావు, రమణి దంపతుల కుమార్తెగా గుర్తించారు. ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆమెను.. శాఖపట్నం ఎల్‌ఐసీ కాలనీకి చెందిన సీతారామారావు, రత్నమాంబల కుమారుడు నాగభూషణానికి ఇచ్చి వివాహం జరిపించారు. ఆరేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది.

హత్యపై అనుమానాలు:

హత్యపై అనుమానాలు:

అపార్ట్‌మెంట్ ప్రధాన ద్వారం తాళం చెవి సౌమ్య వద్ద లేదా ఆమె భర్త నాగభూషణం వద్ద ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేస్తే.. కిందకెళ్లి సౌమ్య గేటు తాళం తీసిందా?.. లేదా ఆమె భర్త వద్ద ఉన్న తాళం చెవితోనే మరెవరైనా ఇంట్లోకి ప్రవేశించారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలిసినవాళ్లే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 ముందస్తు ప్లాన్?:

ముందస్తు ప్లాన్?:

సౌమ్య మెడ, ఎడమ కన్ను, నుదురు, ఛాతి భాగంలో కత్తి పోట్లు ఉండటంతో... ఆమెది కచ్చితంగా హత్యే అయి ఉంటుందని భావిస్తున్నారు. తొలుత కత్తితో దాడి చేసి.. అప్పటికీ ఆమె చనిపోకపోతే ఒంటిపై నువ్వుల నూనె చల్లి నిప్పంటించినట్టు పోలీసులు గుర్తించారు. దాడికి ముందస్తు ప్లాన్ ప్రకారమే వచ్చిన అగంతకుడు.. 5లీటర్ల నువ్వుల నూనెతో వచ్చినట్టు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఆయిల్ డబ్బా దొరకడం దీనికి ఊతమిస్తోంది.

కొనసాగుతున్న దర్యాప్తు:

కొనసాగుతున్న దర్యాప్తు:

కన్న కొడుకు ముందే సౌమ్యను హతమార్చాల్సిన అవసరం ఎవరికొచ్చింది అనేది అంతుచిక్కడం లేదు. సౌమ్య సెల్ ఫోన్ బాత్‌రూమ్‌లోని ఫ్లష్‌ ట్యాంకులో దొరకడం గమనార్హం. డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించగా.. అది అపార్ట్ మెంట్ లోనే తచ్చాడుతూ కనిపించింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండటంతో.. త్వరలోనే నిజనిజాలు బయటపడే అవకాశం ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
:IN yet another shocking incident, a 27-year-old woman was found stabbed and charred to death inside her house in Erragadda in the wee hours of Tuesday. Police say she was married to a civil engineer and her toddler son was present in the house when she died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more