• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మానుషి అద్భుత స్పీచ్, స్పెషల్ అట్రాక్షన్, హోదా పక్కనపెట్టి పారిశ్రామికవేత్తల కేరింత

|

హైదరాబాద్: మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ బుధవారం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. లక్ష్యం ఏదైనా దానిని సాకారం చేసుకోవడానికి కృషి చేయాలని, ప్రతి ఒక్కరు కలలు కనాలని, వాటి దిశగా అడుగులు వేయాలని చెప్పారు. సమాజం కోసం, బాలిక విద్య, వైద్యం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.

మీరూ రండి!: కేటీఆర్‌కు ఇవాంకా ట్రంప్ ఫిదా, 'ఇవాంకా'పై మంత్రి చమత్కారం

  Miss World 2017 Manushi Chhillar : మిస్ వరల్డ్ పై 'చిల్లర' వ్యాఖ్యలు | Oneindia Telugu

  సమాజం ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నేర్పుతుందని, ఆ సమాజానికి మనం కూడా ఇచ్చేందుకు ఆలోచన చేయాలని, ఇందులో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. పరిశుభ్రత అనేది వ్యక్తిగతంగానే కాకుండా సమాజపరంగా కూడా ఉండాలన్నారు.

  సినిమాల్లో నటించడం ఆసక్తికరం

  సినిమాల్లో నటించడం ఆసక్తికరం

  సినిమాల్లో నటించడమన్నది చాలా ఆసక్తికర విషయమని మానుషీ చిల్లర్ తెలిపారు. కానీ, ప్రస్తుతానికి తన ప్రాధాన్యం అది కాదని చెప్పారు. అసలు సినిమా అవకాశాల గురించి ఆలోచించడం లేదని తెలిపారు. డాక్టర్‌గా కొనాసాగాలనేది తన కోరిక అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే డాక్టర్లు అందరూ కూడా రోగులకు సాంత్వన కలిగించేందుకు వారిని అనునయించాల్సి ఉంటుందని, కాబట్టి వారు కూడా డాక్టర్లే అని అభిప్రాయపడ్డారు.

   తల్లిదండ్రులకు ఎంత చేసినా తక్కువే

  తల్లిదండ్రులకు ఎంత చేసినా తక్కువే

  మనం ఏ రంగంలో ఉన్నా ఒత్తిడి, సంతృప్తి రెండూ ఉంటాయని, వాటిని సమానంగా స్వీకరించాలని మానుషీ చిల్లర్ చెప్పారు. అమ్మతనంలోని మాధుర్యం మాటల్లో చెప్పలేనిది అన్నారు. చాలామంది తన మాతృత్వాన్ని ఎలా అస్వాదిస్తారో ఓ డాక్టర్‌గా తాను చూశానని చెప్పారు. నేను మా అమ్మతో చాలా సన్నిహితంగా ఉంటానని చెప్పారు. తల్లిదండ్రులకు మనం ఎంత చేసినా తక్కువే అవుతుందన్నారు.

   పని విషయంలో తపన ఉండాలి

  పని విషయంలో తపన ఉండాలి

  సంకల్పం ఏదైనా దానిని సాకారం చేసుకునేందుకు మనం కృషి చేయాలని మానుషి చిల్లర్ అన్నారు. మన పని విషయంలో మనకు తరగని తపన ఉండాలని చెప్పారు. లక్ష్యం ఏదైనా చిత్తశుద్ధితో పని చేయాలని వ్యాఖ్యానించారు.

  ప్రపంచ సుందరి జీవన గమంలో ఓ అంకం మాత్రమే

  ప్రపంచ సుందరి జీవన గమంలో ఓ అంకం మాత్రమే

  ఈ రోజు తాను ఇక్కడ ఉండడానికి ఈ కిరీటాన్ని సాధించడానికి మనదైన వసుదైక కుటుంబమే కారణమని మానుషి చిల్లర్ అన్నారు. కుటుంబం, సమాజం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ప్రపంచ సుందరి కావడమన్నది జీవన గమనంలో ఓ అంకం మాత్రమే అని చెప్పారు.

   నేను లింగ వివక్ష ఎదుర్కోలేదు

  నేను లింగ వివక్ష ఎదుర్కోలేదు

  లింగ వివక్ష కేవలం మానసిక భావనే అని మానుషి చిల్లర్ చెప్పారు. నేను ఎప్పుడు, ఎక్కడా లింగ వివక్ష ఎదుర్కోలేదని చెప్పారు. అందరూ సమానమే అన్నారు. ఎవరైనా ఏమైనా సాధించగలని చెప్పారు. పురుషులు కూడా ఈ వాస్తవాన్ని గ్రహించాలని సూచించారు. పల్లెల్లోని మహిళలకు అవకాశాలు కల్పించాలని చెప్పారు.

   హోదాలు పక్కన పెట్టి మానుషీ కోసం కేరింతలు

  హోదాలు పక్కన పెట్టి మానుషీ కోసం కేరింతలు

  కాగా, మానుషీ ఛిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని ధరించి, చిరునవ్వులు చిందిస్తూ వేదిక వద్దకు నడుచుకుంటూ వచ్చారు. అమె వచ్చేటప్పుడు దారిపొడవును నీరాజనాలు పలికారు. ఆమె వస్తున్నప్పుడు తమ హోదాను, వయస్సును పక్కన పెట్టి పారిశ్రామికవేత్తలు కేరింతలు, చప్పట్లు కొట్టారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహపడ్డారు.

  మానుషితో ఫోటోల కోసం పోటీ

  మానుషితో ఫోటోల కోసం పోటీ

  కాగా, బుధవారం రాత్రి గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం విందు ఇచ్చింది. ఈ విందులోను మానుషి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతులు, సౌండ్‌ అండ్‌ లైట్‌ షో మధ్య హైదరాబాద్‌ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను చాటిచెప్పే లఘుచిత్రాల ప్రదర్శనతో ఈ విందు జరిగింది. విందు పూర్తయ్యాక మానుషితో సెల్ఫీలు దిగేందుకు చాలామంది పోటీపడ్డారు.

  English summary
  The world has its eyes glued on the Global Entrepreneurship Summit 2017, being held in Hyderabad as we speak. Apart from Ivanka Trump's presence, which has created a lot of buzz all over the country, some other prominent celebs are also attending the event. After Chef Vikas Khanna and actress Aditi Rao Hydari, Miss World Manushi Chhillar has made an appearance at the event, and will be seen taking over the dais.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more